• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

న్యాయవాదుల మహా పాదయాత్ర

GDWL: అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు న్యాయవాదులు రక్షణ చట్టం కోసం చేపట్టిన మహా పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. నేడు జడ్చర్ల నుంచి ప్రారంభమైన యాత్రను అలంపూర్ నియోజకవర్గ న్యాయవాదులు యాకోబు, నరసింహులు నిర్వహిస్తున్నారు. అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాత్ర సెక్రటేరియట్ వరకు కొనసాగనుంది.

February 24, 2026 / 10:50 AM IST

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: MLA

ADB: ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో సిరికొండ, ఇచ్చోడ మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 10:50 AM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

NRPT: ఉట్కూర్ మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు తీరును జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మహిళలకు మాత్రమే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సాధారణ ప్రసవాలు జరిగేందుకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ను కోరారు.

February 24, 2026 / 10:47 AM IST

NIMS ఆసుపత్రికి కొత్తగా నాలుగు కోర్సులు

HYD: పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రికి మొత్తం నాలుగు కోర్సులు మంజూరైనట్లు అధికారులు తెలియజేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ నాలుగు విభాగాలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ కోర్సులు అనుమతి ఇచ్చింది. మాస్టర్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కోర్సులకు అనుమతి లభించినట్లుగా డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు. మొత్తం 16 సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 10:46 AM IST

గాంధీ మెడికల్ కాలేజీలో పెరగనున్న క్రిటికల్ కేర్ స్పెషాలిటీ

HYD: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో క్రిటికల్ కేర్ మెడిసిన్ సీట్లు నేషనల్ మెడికల్ కమిషన్ మంజూరు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. న్యూరాలజీ, కార్డియాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, పోస్ట్ ఆపరేషన్, ఇన్ఫెక్షన్, తదితర విభాగాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్‌లో మరింత మెరుగైన సేవలు అందించనున్నట్లుగా వివరించారు.

February 24, 2026 / 10:45 AM IST

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. సర్వం సిద్ధం..!

MDCL: రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసినట్లు యంత్రాంగం వెల్లడించింది. పరీక్షల నిర్వహణకు 151 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగంలో 64,780 ఒకేషనల్ కోర్సులో 1,368, మంది, సెకండ్ ఇయర్ 67,792 జనరల్ విభాగం, ఒకేషనల్ విభాగంలో 1,258 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

February 24, 2026 / 10:44 AM IST

డివిజన్‌లో పర్యటించిన కార్పొరేటర్ రాంబాబు

BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్‌లో కార్పొరేటర్ రాంబాబు మంగళవారం పర్యటించారు. ముందుగా డివిజన్‌లో ప్రతి కుటుంబాలతో వ్యాపారస్తులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవభారత్ సెంటర్‌లోని డ్రైనేజ్ సమస్యలు, మంచినీటి సమస్యను త్వరలోనే పరిష్కార మార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 10:42 AM IST

‘ఇంటర్ పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమలు’

ASF: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు DIEO రాందాస్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఫస్ట్,సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ. 12 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఒక్క నిమిషం నిబంధన అమలు ఉంటుందన్నారు.

February 24, 2026 / 10:42 AM IST

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

BDK: అన్నపురెడ్డిపల్లి మండలం, రాజాపురంలో శనిగరపు పుల్లయ్య మృతదేహం పొలం వద్ద మంగళవారం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికితే ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో మృతదేహం లభ్యమవడంతో విద్యుత్‌షాక్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 10:40 AM IST

‘ఛలో సెక్రటేరియట్‌’కు తరలిన ఆర్టీసీ ఉద్యోగులు

NRML: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తలపెట్టిన ఛలో సెక్రటేరియట్‌కు భైంసా ఆర్టీసీ ఉద్యోగులు తరలివెళ్లారు. రెండు ప్రత్యేక వాహనాల్లో ఉద్యోగులు HYDకి పయనమయ్యారు. 2021సంవత్సరం ఉద్యోగుల పే స్కేల్‌ను శాశ్వతంగా 30 శాతం అమలుపరచి, మా లక్ష్మి పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలన్నారు.

February 24, 2026 / 10:37 AM IST

తాడూరులో 18.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

NGKL: జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోనే తాడూరు మండలంలో 18.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం ప్రకటించారు. కల్వకుర్తి మండలంలో 11.3, అమ్రాబాద్ లో 7.0, పదరలో 4.3, అయినోల్ లో 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 10:35 AM IST

సీఎం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థిని ప్రతిభ

NZB: వేల్పూర్ మండలం మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కుమారి రూప ఇటీవల జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ఆడి మంచి ప్రతిభ కనపరిచినందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్య గణేశ్, ఉపాధ్యాయులు మంచే గణేశ్, మహేందర్ ఉన్నారు.

February 24, 2026 / 10:35 AM IST

రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అధికారుల నిఘా

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలు, గోధుమల్లో అక్రమాలను అరికట్టేందుకు అధికారులు పక్క వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. నిరుపేదల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు నిఘాను ముమ్మరం చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,081 రేషన్ దుకాణాలపై నిరంతరం పరిరక్షణ ఉంచాలని ఆ శాఖ నిర్ణయించుకుంది.

February 24, 2026 / 10:33 AM IST

‘పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’

KMR: బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో జనసేన పార్టీ నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు సరిత మానేకర్ హాజరై మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభం కాబోతున్నాయని, బిచ్కుంద మండలంలోని ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలను తీసుకోవాలని పేర్కొన్నారు.

February 24, 2026 / 10:33 AM IST

కాకతీయ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది..?

WGL: ప్రతిష్ఠాత్మక కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల కాలంలో విద్యార్థుల మధ్య గొడవలు, ఘర్షణలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రశాంత వాతావరణం ఉండే క్యాంపస్‌లో ఇప్పుడు అస్థిరత నెలకొంది. నిన్న యూనివర్సిటీలోనే చికెన్ కోసం విద్యార్థులు కర్రలతో కొట్టుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పర్యవేక్షణ లేక గొడవలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

February 24, 2026 / 10:30 AM IST