JN: ఎమ్మెల్యే కడియం శ్రీహరికి పాడి కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని లింగాల గణపురం మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి అన్నారు. మీడియాతో మాజీ జెడ్పీటీసీ మాట్లాడుతూ.. అవినీతి మరకలేని నాయకుడిగా కడియం శ్రీహరి పేరు సంపాదించారని, కడియం శ్రీహరి ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.
NZB: మాదకద్రవ్యాలకు స్వస్తి పలుకుదాం జీవితాన్ని ప్రేమిద్దాం” అనే నినాదంతో రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ.. యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.
SRD : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రామేశ్వరంబండ సమగ్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం ఇంద్రపురి కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హామీలన్నీ ప్రణాళికబద్ధంగా నెరవేర్చుతామని పేర్కొన్నారు.
SRPT: పట్టణ అభివృద్ధికి మున్సిపల్ కౌన్సిలర్లు సమన్వయంతో కృషి చేయాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో బ్యాంక్వెట్ హాల్‌లో కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కౌన్సిలర్లు పనిచేయాలని వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ నివేదిత అన్నారు.
MNCL: జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై పలు సూచనలు చేశారు. పన్నుల వసూలు, మురుగు కాలువ వ్యవస్థ శుభ్రత, వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు.
HNK: మోసపూరిత హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. పెగడపల్లిలో ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన జరుగుతుందని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
JGL: ఇబ్రహీంపట్నం మండలంలోని కేశాపూర్, వేములకుర్తి, వర్షకొండ గ్రామాల్లో ఐస్ క్రీమ్ వాహనాలకు ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ఇటీవల తీర్మానం చేశాయి. నాసిరకం ఐస్ క్రీమ్లను విక్రయిస్తుండడంతో చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారని, ఐస్ క్రీమ్ విక్రయించే వాహనాలను నిషేధిస్తున్నామని, ఎవరైనా వచ్చి విక్రయిస్తే రూ.5వేల జరిమనా విధిస్తామన్నారు.
BHNG: ఆలేరు పట్టణంలోని రంగనాయక వీధి సమీపంలో బొడ్రాయి, పెద్ద రోలు వద్ద నివాసముంటున్న ఎలగల శ్రీనివాస్(48) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు గాయత్రీ, గౌతమిలు ఉన్నారు. మృతుడికి కుమారులు లేరు. దీంతో తండ్రికి తప్పనిసరి పరిస్థితులలో పెద్ద కుమార్తె గాయత్రి శవయాత్రలో ముందు నడిచి తలకొరివి పెట్టింది.
KMM: కేరళ రాష్ట్రంలో వచ్చే నెల 9వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని (UDF) స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పతనంతిట్ట జిల్లా లోని ఎమ్మెల్యే అభ్యర్థి శాంత కుమార్కు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా వివిధ ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు.
BDK: ఏప్రిల్ 10,11 తేదీల్లో హైదరాబాదులో నిర్వహించనున్న అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. అలాగే బొంబాయి తండాలో పోస్టర్ ఆవిష్కరించారు. జర్పుల రమేష్ అధ్యక్షతన జరిగిన నేత భూక్యా బిక్షం 1974లో ఆవిర్భవించిన అరుణోదయ సంస్థ కళారూపాల ద్వారా ప్రజా సమస్యలపై నిరంతరం చైతన్యం కల్పిస్తోందన్నారు.
JN: జనగామ కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ బాలమణి మాట్లాడుతూ.. అనునిత్యం జనగామ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ జనగామను ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కష్టపడి పని చేస్తామని చెప్పారు.
MBNR: రాజాపూర్ మండలం చెన్నవెళ్లి గ్రామంలో సోమవారం నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని గ్రామస్థులు ఆహ్వానించారు. ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలో సర్పంచ్ యాదగిరి, ఉపసర్పంచ్ శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు రమ్య, తిరుపతి రెడ్డి తదితరులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
WGL: పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో TDP పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రామసాని కృష్ణ జెండాను ఆవిష్కరించగా, మాజీ జెడ్పీటీసీ మేడిశెట్టి రాములు ముఖ్య అతిథిగా హాజరై సుమారు 200 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
SRCL: వీర్నపల్లి శివారులో ఎస్సై వేముల లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా డ్రంకెన్ డ్రైవ్ వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు.
KMR: గాంధారి మండలంలో దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం ఓ కోడలు తన అత్తను బండరాయితో కొట్టి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. సీతాయపల్లి గ్రామంలో రుక్మవ్వ తలపై కోటవ్వ బండరాయితో కొట్టగా ఆమె అక్కడికక్కటే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఎస్సై ఆంజనేయులు పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.