KNR: తిమ్మాపూర్ మండలం మల్లాపూర్‌కు చెందిన బనక చందు అనే యువకుడు కెనాల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య జరిగి ఉండొచ్చని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
SDPT: కోహెడ మండలం శనిగరంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతపై అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని సిబ్బందికి హెచ్చరించారు. అనంతరం తంగళ్లపల్లి కస్తూర్బా పాఠశాలను కూడా తనిఖీ చేశారు.
JN: చిల్పూర్ మండలం కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై బుధవారం లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండ వైపు బైక్‌పై వెళ్తున్న దంపతులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గుగులోతు కమలమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త గుగులోతు దాసుకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన దాసును 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
BDK: మణుగూరు గుట్ట మల్లారం ప్రాంతంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఒలింపియాడ్ INTSO పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఒలింపియాడ్ సెకండ్ లెవెల్ జిల్లా గ్రాండ్ ప్రైజ్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి డి. ఉజ్వల్ ధీరన్ ల్యాప్‌టాప్‌ను గెలుచుకున్నారు.
NLG: చిట్యాలకు చెందిన తెలంగాణ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ తన రాజకీయ భవిష్యత్తుపై ఉగాది తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విద్యార్థి నేతగా, బీఆర్ఎస్, తెలంగాణ జాగృతిలలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయనకు కేటీఆర్, కవితలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన ఎటువైపు వెళ్తారు? అనే చర్చ జరుగుతోంది.
MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చిన్న చింతకుంట పీహెచ్సీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ వైద్యులతో నిర్వహిస్తున్న శిబిరాన్ని పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాలను సందర్శించి, ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
KMM: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ వేం నరేందర్ రెడ్డికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నరేందర్ రెడ్డి పెద్దల సభలో అడుగుపెట్టడం సంతోషదాయకమని, ఆయన పదవీ కాలంలో తెలంగాణ ప్రయోజనాల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తారని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.
MLG: మంత్రి సీతక్కను మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కలిశారు. అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే మహిళా కార్యకర్తలకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షురాలికి మంత్రి సీతక్క సూచించారు.
MNCL: రైతులకు మెరుగైన సేవలు అందించేలా మార్కెట్ కమిటీ పని చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. బుధవారం చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్‌గా మహేష్ ప్రసాద్ తివారి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉండి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు.
GDWL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నుంచే కాక పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా రోగులు వస్తుంటారని, వారందరికీ ఎల్లప్పుడూ మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన సూచించారు.
SRCL: అవమానకరంగా మాట్లాడితే సహించేది లేదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని చేనేత చౌక్ వద్ద టీడీపీ ఎంపీల ఫ్లెక్సీలను మంగళవారం దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన డే, బ్లాక్ డే అని టీడీపీ ఎంపీలు అనడం దురదృష్టకరమన్నారు.
SRPT: ప్రభుత్వ పథకాల అమలుకు 2027 జనాభా లెక్కలు కీలకమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు తొలి దశ ఇళ్ల జాబితా నమోదు, 2027 ఫిబ్రవరిలో రెండో దశ గణన జరుగుతుందని వివరించారు. తొలిసారిగా డిజిటల్ విధానంలో మొబైల్ యాప్‌ల ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
NGKL: పీఎం జన్మన్ పథకంలో భాగంగా మన్ననూర్ వైద్య బృందం బుధవారం కొల్లంపెంట, కొమ్మనపెంట చెంచు పెంటల్లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించింది. సుమారు 45 మంది చెంచులకు షుగర్, బీపీ, మలేరియా, డెంగ్యూ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి మోహన్ లాల్ తెలిపారు.
HNK: కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థి సేన నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా విజయ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శరత్, జనరల్ సెక్రెటరీగా నవీన్, వైస్ ప్రెసిడెంట్‌గా దినాకర్, పూర్తి కమిటీని ఎన్నుకున్నారు. అనునిత్యం కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని వారు చెప్పారు.
KMR: దోమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేస్తామని పట్టణానికి చెందిన వ్యాపారి పప్ప విజయ్ కుమార్ అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం రూ.కోటి విరాళం అందజేశారు. ఆడబ్బులతో చేపట్టే పనులకు విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ కాగా వాటిని పాఠశాలహెచ్ఎంకు బుధవారం అందజేశారు. తాము చదువుకున్న పాఠశాల అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.