NLG: నార్కట్ పల్లి మండలం, గోపలాయపల్లి గుట్టపై శ్రీ వారిజాల వేణు గోపాలస్వామి ఆలయంలో బుధవారం సుదర్శన హోమాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల రోహిణి నక్షత్రం సందర్భంగా గుట్టపై హోమాన్ని నిర్వహిస్తారు. పలువురు దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి హోమంలో పాల్గొన్నారు. భక్తులు విచ్చేసి హోమాన్ని తిలకించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిపారు.
SDPT: అక్కన్నపేట మండలంలోని జనగామలో ఆర్థిక అక్షరాస్య త కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యత, సైబర్ నేరాల నివారణ, బ్యాంకింగ్ సేవలపై వివరించారు. KYC, e-KYC, CKYC, డిజిటల్ KYC ప్రక్రియలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ చందు లక్ష్మి, సెక్రటరీ మహేందర్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ సంజయ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.
MNCL: జన్నారం మండలం కవ్వాల్ హాస్టల్ తండాలోని కట్టె స్తంభాలు, ఈదురు గాలులకు ఒక పక్కకు ఒరిగిపోయాయి. ఎనిమిదేళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పొలాలకు వెళ్లే మార్గంలో ప్రాణాపాయం పొంచి ఉందని, తక్షణమే స్పందించి శాశ్వత సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
MDCL: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అల్వాల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యారు. శ్రీ చైతన్య, నారాయణ, వైభవ్ , లయోలా తదితర కాలేజీల్లో పరీక్షలు నిర్వహించగా, కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో మొదటి రోజు పరిక్ష ప్రశాంతంగా ముగిసింది.
SRD: సంగారెడ్డి పట్టణంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ పారితోష్ పంకజ్ బుధవారం తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు.
JN: తండాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలంలోని పలు తండాలలో ఎమ్మెల్యే పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గతంలో అధికారంలో ఉన్న వారు తండాలను పట్టించుకోలేదని, తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు.
ADB: గ్రామాల అభివృద్ధిలో గ్రామపంచాయతీ పాత్ర కీలకమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బుధవారం మండలంలోని సాంగ్వి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థానికులతో కలిసి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీలోనే గ్రామాల అభివృద్ధి చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. మండల నాయకులు, మహిళలు తదితరులున్నారు.
MBNR: జడ్చర్ల మండలంలోని గంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు విజయవంతంగా నిర్వహించారు. ఈ టెస్టులో సాత్విక్ మెరూన్, జ్యోత్స్న, యశ్వంత్ బ్లూ, వర్ష, సారిక, రామ్ సాయి, మానస్, జస్వంత్ ఆరెంజ్, అనిల్, వరుణ్ ఎల్లో బెల్టు సాధించినట్లు అకాడమీ ఫౌండర్ మాస్టర్ కేశవ్ గౌడ్ తెలిపారు.
NRPT: ఇంటర్మీడియట్ విద్యార్థులు భయాందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఊట్కూర్ ఉప సర్పంచ్ ఆర్. రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం. భరత్ అన్నారు. బుధవారం ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు మనోధైర్యం ఇచ్చి, ఆందోళన లేకుండా శ్రద్ధగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
JGL: నిజామాబాద్లో ఇటీవల జరిగిన ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల్లో పెగడపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన రాకేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకత్వం నుంచి ఆయనను ఈ బాధ్యతలకు ఎంపిక చేసినట్లు ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేష్ రంగరాజన్ తెలిపారు. ఈ సందర్భంగా లింగాపూర్ సర్పంచ్ వీరేశం, గ్రామస్థులు రాజేష్‌ను అభినందించారు.
RR: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షాద్‌నగర్, మొయినాబాద్, మహేశ్వరం డివిజన్లకు చెందిన డీసీపీ పరీక్ష కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని కేంద్రాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని అధికారులు తెలిపారు.
MDK: నార్సింగి మండలం శంకాపూర్ తండాలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద వధువుకు పుస్తె మట్టెలను సర్పంచ్ మహేందర్ సింగ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల సంతోషమే తన సంతోషమని తండాలో ఉన్న ఆడబిడ్డలు తమ తో బుట్టువులని, వారికి సేవచేయడంలో ఉన్న ఆనందం మరోకటి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్ పాల్గొన్నారు.
MDCL: అల్వాల్ సర్కిల్ ఇందిరా గాంధీ విగ్రహం చౌరస్తా సమీపంలోని హనుమాన్ దేవాలయం ఎదురుగా, లైబ్రరీ పక్కన చెత్త వేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ప్రజలు చెత్తలో కూర్చొని నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారులు చెత్త ఉన్న స్థలాన్ని సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక కాలనీవాసులు డిమాండ్ చేశారు.
RR: తిరుమల పవిత్ర లడ్డు కల్తీ చేశారని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు అన్నారు. ఇవాళ షాద్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ మహా పాపం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఊరికే వదిలిపెట్టదని, తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదన్నారు. దాదాపు 20 కోట్ల కల్తీ లడ్డూలను భక్తులకు పంపిణీ చేసి హిందువుల విశ్వాసాలతో ఆడుకున్నారన్నారు.
NZB: దర్‌పల్లి మండలంలోని అన్ని గ్రామాల ఊసర్పంచ్, వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా ఎంపీడీవో కాయలయ్య సమావేశపు గదిలో అధికారులు పంచాయతీల్లో జరిగే కార్యక్రమాలకు చట్టాలపై అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో అన్నిగ్రామాల ఊసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.