• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘సీఎం కప్ పోటీలో ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులు’

ADB: ఈనెల 20 నుంచి నల్గొండ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీఎం గా పోటీలో అదిలాబాద్ జిల్లా ఖో ఖో జట్టు విజేతగా నిలిచింది. ఈ మేరకు ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులను కలెక్టర్ రాజర్షి షా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో ప్రతిభ కనబరచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ శ్యామల దేవి, అధికారులు, తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 11:00 AM IST

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

NGKL: జిల్లాలో ఇంటర్ తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 కేంద్రాల్లో ఫస్ట్ ఇయర్ 7,557 మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు. రేపు సెకండ్ ఇయర్ 7,616 మంది స్టూడెంట్స్ హాజరుకానున్నారని తెలిపారు. తాగునీటి సదుపాయం, గాలి, వెలుతురు లాంటి అంశాలను కలెక్టర్ పర్యవేక్షించారు.

February 25, 2026 / 10:59 AM IST

రోడ్డు మరమ్మతులు ప్రారంభం

SDPT: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేశ్ ఆధ్వర్యంలో ధర్మాజీపేట వెళ్లే రోడ్డుకు మరమ్మతుల పనులను ప్రారంభించారు. రోడ్డుపై గుంతలు పడడంతో RTC బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా JCBతో మరమ్మతుల పనులు చేపట్టారు.

February 25, 2026 / 10:59 AM IST

ఏళ్ల తరబడి ములకుబడిన వాహనాల తొలగింపు

MDCL: మల్కాజ్‌‌‌గిరి పరిధిలో రహదారుల మధ్య సంవత్సరాలుగా మూలకు పడి తుప్పు పట్టిన వాహనాలపై అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు మల్కాజ్‌గిరి జోన్‌లో 39, ఉప్పల్ జోన్‌లో 40, ఎల్బీనగర్ జోన్‌లో 10 వాహనాలను తొలగించారు. మొత్తం 89 వాహనాలు స్వాధీనం చేసుకుని ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా మార్గాలను స్వచ్ఛంగా మార్చారు.

February 25, 2026 / 10:55 AM IST

అక్రమ మట్టి తవ్వకలపై పోలీసుల దాడి

WGL: గీసుగొండ మండలం సూర్య తండా సమీపంలోని SRSP కాలువ నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సమాచారం మేరకు గీసుగొండ CI విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్న ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు CI తెలిపారు. వారందరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు CI వెల్లడించారు.

February 25, 2026 / 10:52 AM IST

శేనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

KMR: మద్నూర్ మండలంలో వెంటనే శేనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో 8,500 ఎకరాల్లో సాగైన పంట ప్రస్తుతం చేతికి రావడంతో ఆరబెడుతున్నారు. అకాల వర్షాల భయం వెంటాడుతోందని, పంట నష్టపోకముందే ప్రభుత్వం స్పందించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. ఆలస్యమైతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.

February 25, 2026 / 10:42 AM IST

మల్లన్నను దర్శించుకున్న పట్నా హైకోర్ట్ న్యాయమూర్తి

SDPT: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని పట్నా హైకోర్ట్ న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి బుధవారం దర్శించుకున్నారు. ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 10:42 AM IST

ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు మంజూరు

ASF: కెరమెరి మండలంలోని 31 గ్రామాల్లో 623 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, గృహాలతో పాటు తప్పనిసరిగా టాయిలెట్లు నిర్మించుకోవాలని MPDO సురేశ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. బహిరంగ మలవిసర్జన నిర్మూలనలో భాగంగా ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన లబ్దిదారులు పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

February 25, 2026 / 10:41 AM IST

కక్షిదారులకు లోక్ అదాలత్ సువర్ణ అవకాశం

WNP: మార్చి 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ వివాదాల పరిష్కారానికి ఒక మంచి అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత తెలిపారు. మంగళవారం కోర్టు ఆవరణలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజీపడదగిన క్రిమినల్, యాక్సిడెంట్ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని, దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆమె సూచించారు.

February 25, 2026 / 10:35 AM IST

గోశాలకు పశుగ్రాసం వితరణ

RR: ఫరూక్‌నగర్ మండలం సోలీపూర్ గ్రామ శివారులోని చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి గోశాలకు కమ్మ సమైక్య వేదిక ఉపాధ్యక్షులు ఆనందరావు రూ. పదివేల విలువచేసే పశుగ్రాసం (కుట్టి) వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్మ సమైక్య వేదిక అధ్యక్షులు సాంబశివరావు, ఉపాధ్యక్షులు ఆనందరావు పాల్గొన్నారు. గోశాలలో ఉండే గోవుల కోసం తమవంతుగా ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.

February 25, 2026 / 10:35 AM IST

ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులకు పదోన్నతులు

ఉమ్మడి WGL జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు మంజూరు చేసింది. నలుగురు డిప్యూటీ CEOలు CEOలుగా పదోన్నతి పొందారు. HNK ZP డిప్యూటీ CEO రవి, JN DRDO వసంత, JN ZP డిప్యూటీ CEO సరిత, హసన్పర్తి ETC ప్రిన్సిపల్ కౌసల్య దేవి ఈ జాబితాలో ఉన్నారు. అదే విధంగా ఐదుగురు MPDOలు డిప్యూటీ CEOలుగా పదోన్నతి పొందారు.

February 25, 2026 / 10:33 AM IST

కాప్రా PHMC సర్కిల్ పరిధిలో రూ.33 కోట్ల పన్ను వసూలు

MDCL: కాప్రా GHMC సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు పురోగమిస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.33 కోట్ల మేరకు పన్ను సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.72.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు.

February 25, 2026 / 10:31 AM IST

ఎర్రబెల్లి జాతర స్టాళ్లకు రేపు బహిరంగ వేలం

NLG: ఎర్రబెల్లిలో వెలిసిన శ్రీ మాణిక్యాలదేవి సమేత లింగమంతుల స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా రేపు వివిధ విక్రయాలకు సంబంధించి బహిరంగ వేలం నిర్వహించనున్నారు. మార్చి 7 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసే స్టాళ్లకు ఈ వేలం ఉంటుందని దేవస్థాన కమిటీ ఛైర్మన్ మన్నెం వెంకన్న తెలిపారు.

February 25, 2026 / 10:30 AM IST

రోజుకు 37 లక్షల లీటర్లు తాగేస్తున్నారు..!

HYD: HMWSSB పరిధిలో 2,050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 1.30 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. ప్రస్తుతం సుమారు రోజుకు 550MGD (37.8 లక్షల లీటర్లు) తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు జలమండలి వర్గాలు వెల్లడించాయి. నగర విస్తరణను దృష్టిలో పెట్టుకొని నీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు.

February 25, 2026 / 10:27 AM IST

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

SRD: కోహిర్-జహీరాబాద్ రైల్వే మార్గంలో 35-40 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వద్ద సదాశివపేట ‘సాయిరాం షాపింగ్ మాల్’ సంచి ఉంది. లోకో పైలట్ సమాచారంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచారు. వివరాలు తెలిసిన వారు 77026 29707 నంబర్కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై పూర్తి వావరాలు తెలియాల్సి ఉంది. 

February 25, 2026 / 10:21 AM IST