• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

శ్రీనివాస కాలనీ మున్సిపల్ పార్కును తనిఖీ చేసిన కమిషనర్

MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ మున్సిపల్ పార్కును కమిషనర్ రామానుజులు రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కులో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అనంతరం పార్క్‌ను సందర్శించి మున్సిపల్ సిబ్బందికి తగు సూచనలు చేసినట్టు వివరించారు.

February 25, 2026 / 12:47 PM IST

పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ

MDK: మెదక్ పట్టణంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల వివిధ కేంద్రాలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసెందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

February 25, 2026 / 12:47 PM IST

‘పెద్దపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా మల్లయ్య బాధ్యతలు’

పెద్దపల్లి మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన నూగిల్ల మల్లయ్య బుధవారం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకవర్గం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

February 25, 2026 / 12:47 PM IST

అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లీబిడ్డా సేఫ్

VKB: యాలాల్ మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవానికి 108లో హాస్పిటల్ వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్సును పక్కకాపి EMT నితిన్, పైలట్ మహేందర్ డెలివరీని విజయవంతంగా పూర్తి చేశారు. భాగ్యలక్ష్మి పండంటి బాబుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

February 25, 2026 / 12:44 PM IST

పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

WNP: జిల్లాలోని అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవసరమైన అన్ని సౌకర్యాలను విద్యార్థులకు కల్పించాలని అధికారులకు సూచించారు.

February 25, 2026 / 12:43 PM IST

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ రాజర్షి షా

ADB: ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, గదుల్లో సౌకర్యాలను వారు స్వయంగా పరిశీలించారు.

February 25, 2026 / 12:43 PM IST

ఒక్క గైర్హాజరు లేకుండా ఇంటర్ పరీక్షలు పూర్తి

JN: కొడకండ్ల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 244 మంది విద్యార్థులు నమోదు కాగా, అందరూ హాజరయ్యారు. ఒక్క విద్యార్థి కూడా గైర్హాజరు కాలేదు. పరీక్షా కేంద్రంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణతో పాటు అవసరమైన సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేశారు.

February 25, 2026 / 12:42 PM IST

ఇంటర్ పరీక్షలకు 197 మంది విద్యార్థులు హాజరు

NRPT: మరికల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 204 మంది విద్యార్థులకు గాను 197 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 7 మంది విద్యార్థులు పరీక్షకు గైహాజరైనట్టు ప్రిన్సిపల్ నాగమణి మాల తెలిపారు. పరీక్షల సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు.

February 25, 2026 / 12:38 PM IST

‘విద్యార్థుల కోసం ఎక్కడైనా బస్సు నిలపాలి’

KMR: ఇంటర్, పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి, బాన్సువాడ డిపోల పరిధిలో విద్యార్థులు చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపాలని డిపో మేనేజర్లు డ్రైవర్లను ఆదేశించారు. మార్చి 16 వరకు ఇంటర్, ఏప్రిల్ 7 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఈ వెసులుబాటు కల్పించారు.

February 25, 2026 / 12:35 PM IST

MCA మొదటి సెమిస్టర్ పరీక్షలు రీషెడ్యూల్

WGL: కాకతీయ యూనివర్సిటీలో వాయిదా పడిన MCA మొదటి సెమిస్టర్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ వెల్లడించారు. మొదటి పేపర్ మార్చి 6న, రెండవ పేపర్ మార్చి 9న, మూడవ పేపర్ మార్చి 11న, నాలుగవ పేపర్ మార్చి 13న, ఐదవ పేపర్ మార్చి 17న నిర్వహించనున్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.

February 25, 2026 / 12:33 PM IST

మహిళా సమైక్య భవనానికి భూమిపూజ

MDK: నర్సాపూర్ ఇన్‌ఛార్జి ఆవుల రాజిరెడ్డి బుధవారం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సికింద్లాపూర్ గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఆయన మహిళల సాధికారత, ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

February 25, 2026 / 12:33 PM IST

‘వట్టివాగు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి’

BDK: పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం కరకగూడెం మండలం చొప్పాల గ్రామ పరిధిలోని గొడుగుబండ వద్ద వట్టివాగు ప్రాజెక్టును పరిశీలించారు. రైతులకు రెండుపంటలు పండేలా ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని సూపర్వైజర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 25, 2026 / 12:33 PM IST

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం లక్ష్యం: సర్పంచ్

BHPL: గోరికొత్తపల్లి(M) నిజాంపల్లి గ్రామంలోని 1వ వార్డులో బుధవారం గ్రామ సర్పంచ్ సునీత-రవీందర్ ఆధ్వర్యంలో GP కార్మికులు సైడ్ డ్రైనేజీ కాలువలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.

February 25, 2026 / 12:32 PM IST

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద దరఖాస్తులు ఆహ్వానం

MLG: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ 2025-26 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద అర్హత గల ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి తెలిపారు. అర్హత గల విద్యార్థులు మార్చి 25వ తేదీ లోపు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 12:31 PM IST

వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ శబరీష్

MHBD: ద్విచక్ర వాహనాలపై జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే వారందరికీ హెల్మెట్ తప్పనిసరి అని ఎస్పీ డాక్టర్ శబరీష్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారిని కలవడానికి వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారులు, బాధితులు, కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో సహా ఎవరైనా సరే హెల్మెట్ లేకుండా కార్యాలయ ప్రాంగణంలోకి అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బందికి స్పష్టం చేశారు.

February 25, 2026 / 12:29 PM IST