NRPT: దండు గ్రామం నుంచి సత్యారం వరకు బుధవారం బీటీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు కొత్త రహదారితో ఇబ్బందులు తీరనున్నాయి. ఈ రహదారి ప్రారంభంతో ప్రయాణికులకు రాకపోకలు సులభతరం కానున్నాయి. కొత్త రహదారి మంజూరు చేయడంతో దండు, సత్యారం గ్రామ ప్రజలు మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.
MHBD: విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కనకదుర్గమ్మ తల్లిని ప్రార్ధించినట్లు తెలిపారు.
NLG: దేవరకొండ తాలుకా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, మాజీ MLA కామ్రేడ్ పల్లా పర్వత్ రెడ్డి 29వ వర్ధంతి సందర్బంగా బుధవారం పట్టణంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. దేవరకొండ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆకర్షితులై అనేక పోరాటాలు చేశారన్నారు.
JN: చిల్పూరు మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో నెలకొన్న సమస్యలపై DPR సిద్ధం చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేస్తామని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నేడు చిన్నపెండ్యాలను కౌన్సిల్ మెంబర్ సందర్శించి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులతో భేటీ అయి గ్రామ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
NZB: డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో మొదటి విడతగా 13 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు సర్పంచ్ కోట్ల భాస్కర్ తెలిపారు. రెండో విడతలో 40 ఇళ్లు మంజూరు చేయాలని రూరల్ ఎమ్మల్యే భూపతి రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం సత్తురి సావిత్రి భర్తకి ఇంటి మంజూరు పత్రాల్ని పంచాయతీ సెక్రటరీ వసంత్ రావుతో కలిసి అందజేశారు.
KMM: చంద్రగ్రహణం ముగియడంతో కూసుమంచి మండలం జీళ్ళచెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. పూజారి చిలకమర్రి స్వామినాథాచార్యులు ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
HYD: ఉప్పుగూడలో ఇవాళ హోలీ పండుగ సందర్భంగా ఉప్పుగూడ బస్తీ వాసులు చాలా సందడిగా హోలీని జరుపుకున్నారు. పిల్లలు పిచికారీలతో, ఒకరిపై ఒకరు రంగులను చల్లుకున్నారు. పెద్దలు ఒకరికొకరు మొహంపై వివిధ రంగులను పూసుకున్నారు. యువతీ యువకులు రంగు నీటిని ఒకరిపై ఒకరు కుమ్మరించుకున్నారు. డప్పుల మోతకు, డీజే పాటలకు, ఉత్సాహంతో నృత్యాలు చేశారు.
GDWL: ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అని గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులకు అందుతోంది కేవలం 12 గంటలే అని కేటిదొడ్డి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గాజుల కృష్ణా పేర్కొన్నారు. బుధవారం కేడిదొడ్డి మండలం వెంకటాపురం సబ్‌స్టేషన్‌ను రికార్డులను పరిశీలించారు. నిరంతర విద్యుత్ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ మాత్రమేనని, రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు అందించారన్నారు.
KNR: గన్నేరువరం మండలం చాకలివానిపల్లెలో ఉపాధి పనుల వద్ద ‘ఈ-కేవైసీ’ నమోదు కాకపోవడంతో బుధవారం కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు వేచి చూశాక ఈ కేవైసీ రావడం లేదని అధికారులు తమను వెనక్కి పంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజులుగా ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని పేర్కొన్నారు.
BHPL: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లికి చెందిన శ్రీకాంత్ పటేల్, నేతలు ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు.
ADB: గాదిగూడ మండలంలోని దాబా(బి) నుంచి లొద్దిగూడ వయా పౌనూర్ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గుంతలమయంగా ఉన్న మట్టి రోడ్డు కంకరంగా ఏర్పడటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోంది. సుమారు 10 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ రోడ్డుకు సంబంధిత శాఖ అధికారులు స్పందించి నూతన రహదారిని మంజూరు చేసి తక్షణమే నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రజలు కోరారు.
VKB: బొంరాస్‌పేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో జనవాసాల మధ్య పందులు సంచరిస్తూ కనిపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో అవి స్వైరవిహారం చేస్తున్నాయని, దోమల బెడద కూడా రోజురోజుకు ఎక్కువ అవుతోందని వారు అన్నారు. అధికారులు స్పందించి వెంటనే దోమల బెడదకు నివారణ చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
NRML: భద్రాద్రి ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్‌ను బుధవారం ఏర్పాటు చేశారు. రూ.151 చెల్లించి ఈ నెల 31లోపు నమోదు చేసుకుంటే, కల్యాణం అనంతరం తలంబ్రాలు ఇంటికి అందజేస్తామని డిపో మేనేజర్ కే. పండరి తెలిపారు.
ASF: సిర్పూర్(టి) మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో గతంలో ఆడిట్ నిర్వహించగా, ధాన్యం నిల్వలు, లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఇటీవల దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల మిల్లుకు చెందిన ఓ వ్యక్తిని విచారించి, కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ ITI ఆవరణలో ఈనెల 6వ తేదీ ఉదయం 10:30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ బుధవారం ప్రకటనలో తెలిపారు. జీవీ అరణ్య మోటార్స్‌లో 17 ఖాళీలు ఉన్నాయన్నారు. 18 నుంచి 35సం:ల వయసు గల అర్హులైన నిరుద్యోగ యువకులు జాబ్ మేళాలో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.