HNK: వరంగల్ నగర పారిశుద్ధ్య నిర్వహణలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) పాత్ర అత్యంత కీలకమని హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శుక్రవారం బల్దియా కార్యాలయంలోని ఐసీసీసీ కేంద్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశంపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. శానిటేషన్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
ASF: రెబ్బెన మండలం దుర్గాపూర్‌కు చెందిన మడావి అజయ్ (18) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై వెంకట కృష్ణ వివరాలు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న అజయ్ 2 సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. గత నెల 27న వైద్యం కోసం వెళ్లి పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
VKB: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పోలీస్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఘనంగా ప్రారంభించారు. నిన్న పట్టణంలోని సత్యభారతి హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంటి వైద్య శిబిరం, రోడ్డు భద్రతా అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. డ్రైవర్ల కంటి చూపు బాగున్నప్పుడే సురక్షిత ప్రయాణం ఉంటుందన్నారు.
SDPT: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని సిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. శుక్రవారం అర్బన్ మండలం బక్రీ చెప్యాలలో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహప్రవేశంలో పాల్గొని మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పేదల, అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఖమ్మం జిల్లాలో విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 50 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై డీఈవో చైతన్య జైని చర్యలు చేపట్టారు. కారణం లేకుండా గైర్హాజరైన 24 మందికి, అనుమతి లేకుండా ఓడీ పేరుతో గైర్హాజరైన 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దెందుకూరు జడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదుల నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. ఏన్కూరు ఎంపీపీ స్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేశారు.
JN: బచ్చన్నపేట ప్రధాన రహదారి దుస్థితిని పరిష్కరించాలని కోరుతూ ‘ఫైట్ ఫర్ బచ్చన్నపేట’ కమిటీ సభ్యులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రోడ్డు అధ్వాన్నంగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ధూళి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.
HYD: ఆరోగ్యమే ఆస్తి అని పెద్దలు చెబుతుంటారు. ఇదే సూత్రం ఇప్పటి తరానికి సైతం వర్తిస్తుందని HYD జీవన్ దాన్ అధికారులు పేర్కొన్నారు. కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, గుండె కవటాలు, కిడ్నీల విలువ లక్షల నుంచి కోట్లతో సమానం. మీ ఆరోగ్యం కాపాడితే కోట్లు సంపాదించినట్లే. అవయవాల ఫెయిల్ అయిన వారు 4 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.
NGKL: ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో వెలసిన 12వ శతాబ్దపు పురాతన లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 1171 నాటి చారిత్రక శాసనాలు, పురాతన బావి, మెట్లు, తేరు ఇప్పటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
SRD: జిల్లా ఆసుపత్రిలో మార్చి నెలకు సంబంధించిన సదరం శిబిరాల షెడ్యూల్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ విడుదల చేశారు. మార్చి 4, 11, 18, 25 తేదీల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. శిబిరానికి వచ్చే వారు స్లాట్ బుకింగ్ మెసేజ్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావలన్నారు.
MNCL: వేమనపల్లి శివారులోని చేనులో మేకలు మేపుతున్న రాజన్న, తుమ్మిడి సాయికిరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజన్న, సాయికిరణ్ కాలు మడమపై గొడ్డలితో దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. నీల్వాయి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MDK: రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
GDWL: గద్వాల ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి అయిజ పట్టణంలోని గాంధీ చౌక్ ఏరియాలో 50 మంది సిబ్బందితో డీఎస్పీ వై. మొగిలయ్య భారీ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 76 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించిన డీఎస్పీ, కాలనీల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
MDCL: అందాన్ని డబులు చేస్తామని ఉప్పల్ పరిధి గణేష్ నగర్ కాలనీకి చెందిన రమ్యకు మెసేజ్ వచ్చింది. నమ్మిన రమ్య కాల్ చేసి అడగగా డైరెక్ట్ ఆన్ లైన్ ద్వారా రూ.4,500 పేమెంట్ చేస్తే, వెంటనే ఇంటికి వస్తామని పేర్కొన్నారు. పేమెంట్ చేసి దాదాపు 15 రోజులు గడుస్తున్నప్పటికీ స్పందన లేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని రమ్య వాపోయారు.
BHPL: జిల్లా ఐడిఓసీ కార్యాలయంలో 10వ తరగతి ఉత్తమ ఫలితాల సాధన పై విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, DEO రాజేందర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను ఉత్తమ ఫలితాల్లో ముందంజలో నిలిపేందుకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
SDPT: ఆయిల్ ఫామ్ సాగుపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యానశాఖ, ఆయిల్ ఫామ్ అధికారులతో కలెక్టర్ హైమావతి సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫ్రైడ్ అధికారుల పనితీరు మందకోడిగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.