WGL: వాహనదారులు తమ కుటుంబ క్షేమాన్ని దృష్టిలో వుంచుకోని మద్యం సేవించి వాహనం నడపోద్దని వరంగల్ ట్రాఫిక్ ACP సత్యనారాయణ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పట్టుపడిన వాహనదారులకు నేడు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ, నిబంధనలు పాటించాలని అన్నారు. హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ సీతారెడ్డి, తదితరులు ఉన్నారు.
MNCL: బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని MLA గడ్డం వినోద్ అన్నారు. గురువారం కాసిపేట్ మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డేవిడ్ గురువారం సూచించారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో క్రమశిక్షణ, గోప్యత పాటించాలని, మొబైల్ ఫోన్లను అనుమతించవద్దని తెలిపారు.
BDK: బూర్గంపాడు మండలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సింగారం రోడ్డు ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజనుల పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి లేక గిరిజన ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారని మణుగూరు చెరువు సింగారం రోడ్డు మార్గం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
BDK: ప్రభుత్వం ప్రజా పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామ పంచాయితి పరిధిలోని స్ధానిక రైతు వేదికలో స్ధానిక MRO అధ్యక్షతన జరిగిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణి కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు.
KMR: గాంధారి మండలం రామలక్ష్మణ పల్లిలో అక్రమంగా నాటు సారాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఆంజనేయులు వివరాలిలా.. విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 3న గ్రామంలో సోదాలు నిర్వహించారు. నిందితుడు రాము తన ఇంట్లోని ఎయిర్ కూలర్‌లో దాచి ఉంచిన 4 లీటర్ల నాటు సారాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
HNK: కాజీపేటలోని డివిజన్ ముఖ్య నాయకులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్థానిక సమస్యల పరిష్కారానికై పోరాడాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 6గ్యారంటీలు, 420హామీల అమలు కోసం ప్రజల తరఫున పోరాటం చేయాలని పేర్కొన్నారు.
KMR: జుక్కల్ సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై MLA లక్ష్మీకాంతారావు గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్‌తో కలిసి వివిధ శాఖల పురోగతిపై చర్చించారు. ముఖ్యంగా వైద్యం, గృహ నిర్మాణం, సాగునీరు, అటవీ, పర్యాటక రంగాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
KNR: హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్డులో గల కాకతీయ కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. కాలువలో మృతదేహం కొట్టుకుపోతుండగా గుర్తించిన పోలీసులు, HNKలోని ఎల్కతుర్తి శివారులో దానిని బయటకు తీశారు. మృతుడు హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన పల్లకొండ గణేష్‌గా గుర్తించారు. ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా లేదా, ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. గోదావరి తీర ప్రాంతం, దేవాలయ ప్రాంగణం, కళ్యాణ మండపం, కోనేరు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సమీక్షించారు. మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ADB: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం పట్టణంలోని జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఖాకీ కిడ్స్ ద్వారా సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి లేకుండా, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.
KMR: యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై నాగిరెడ్డిపేట మాజీ జడ్పీటీసీ మనోహర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, యూరియాను ప్రత్యక్షంగా సరఫరా చేయాలని కోరుతూ న్యాయ పోరాటం చేసేందుకు ఆయన ఫోరం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమస్యపై సీనియర్ న్యాయవాది రచనరెడ్డితో చర్చించి, ఆన్‌లైన్ విధానంలోని సాంకేతిక లోపాలు, నెట్వర్క్ సమస్యల గురించి వివరించారు.
నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి నియమితులయ్యారు. వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తా హుస్సేన్ గురువారం నియామక పత్రం అందజేశారు. అంజిరెడ్డి ప్రస్తుతం యూనివర్సిటీలో సోషల్ సైన్స్ విభాగం డీన్‌గా, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు.
SRPT: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆకర్షితులయే పార్టీలో చేరికలు మొదలయ్యాయని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మోతే మండలానికి చెందిన పలువురు పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ASF: వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న గిరిజాబాయికి అత్యవసరంగా A+ రక్తం అవసరమైంది. విషయం తెలిసిన వెంటనే వాంకిడి సర్పంచ్ చూనార్కర్ సతీశ్ స్పందించారు. సమాజ సేవలో భాగంగా ఆసిఫాబాద్ రక్తనిధి కేంద్రానికి వెళ్లి గురువారం రక్తదానం చేశారు. కాగా రక్తదానం చేసిన సర్పంచ్ సేవాభావాన్ని గ్రామస్థులు అభినందించారు.