• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భార్యభర్తల గొడవ.. కత్తితో దాడి

MBNR: భార్య, భర్త గొడవపడి ఇద్దరి అత్తలపై కత్తితో దాడి చేసిన ఘటన జడ్చర్ల మండలం పోలేపల్లిలో జరిగింది. సోమవారం రాత్రి పోలేపల్లికి చెందిన అలివేలు, రవి దంపతులు గొడవపడ్డారు. గొడవ ఆపేందుకు వచ్చిన అత్తలు శ్యామలమ్మ, అంజమ్మలపై రవి కత్తితో మొఖం, కడుపులో దాడి చేయగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు.

February 24, 2026 / 06:50 AM IST

‘శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు’

NZB: జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని CP సాయి చైతన్య హెచ్చరించారు. సోమవారం ఆయన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో పర్యటించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు.

February 24, 2026 / 06:49 AM IST

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్

MLG :గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు కలెక్టర్ దివాకర్‌ను సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగపేట, ముళ్లకట్ట, రామన్నగూడెం, కన్నాయిగూడెం ఘాట్లలో తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, భద్రత, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ తెలిపారు.

February 24, 2026 / 06:49 AM IST

ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ పురోగతిపై కలెక్టర్ సమీక్ష

NRPT: నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ, అదనపు మిషన్ డైరెక్టర్ గౌరవ్ కటియార్ సోమవారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన నర్వ మండలంలో ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ (ABP) పురోగతిని అధికారులతో సమీక్షించారు. పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.

February 24, 2026 / 06:49 AM IST

శుభకార్యాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

WNP: వనపర్తి డిపో పరిధిలో శుభకార్యాలు, విహారయాత్రలకు అద్దె బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు (79957 01851, 96765 63377, 7382829313) విడుదల చేశారు. ఈ సేవలు జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తాయని పేర్కొన్నారు.

February 24, 2026 / 06:48 AM IST

మాజీ మంత్రిని కలిసిన మాల సంఘం నేతలు..

ADB: జిల్లా పర్యటనకు వచ్చిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. గత BRS ప్రభుత్వంలో దళితుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనట్లు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

February 24, 2026 / 06:45 AM IST

కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

WGL: పర్వతగిరి మండలం పంచరాయ తండాకు చెందిన భానోత్ యాకూబ్ (45) అనే వ్యక్తి పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మద్యానికి బానిసై ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, తరచూ వస్తున్న కడుపునొప్పిని భరించలేక సోమవారం సాయంత్రం తన పొలం వద్ద పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

February 24, 2026 / 06:44 AM IST

మైనార్టీ షాదీఖానాకు నిధులు మంజూరు చేస్తా: ఎంపి

SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో మైనార్టీ షాది ఖానా కోసం నిధులు మంజూరు చేస్తానని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నియమిస్తున్న షాదీఖానా పనులు నిలిచిపోవడంతో ఎంపీ నిధులతో పూర్తి చేయాలని మైనార్టీ సోదరులకు సూచించారు. రెండుసార్లు ఐదు లక్షలు మంజూరు చేస్తానని చెప్పారు. నాయకులు ఉన్నారు.

February 24, 2026 / 06:43 AM IST

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

JGL: కోరుట్ల శివారులోని D40 కాలువలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతను ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లికి చెందిన రాజ్ కుమార్ (38)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

February 24, 2026 / 06:42 AM IST

ఇంటి కిటికీలో కొండచిలువ..!

MDK: పాపన్నపేట మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీలో ఓ నూతన ఇంటి కిటికీలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. గమనించిన ఇంటి సభ్యులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారి కిష్టయ్య బృందం అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను బంధించారు. పట్టుకున్న పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.

February 24, 2026 / 06:42 AM IST

బాల్క సుమన్ అరెస్టుపై BRSV నిరసన

NLG: నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం ముందు బాల్క సుమన్ అక్రమ అరెస్టును BRSV కార్యకర్తలు ప్లకార్డులు, నల్ల కండువాలతో సోమవారం రాత్రి నిరసన తెలిపారు. BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ నేతను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 06:40 AM IST

నూతన సర్పంచులకు శిక్షణ తరగతులు ప్రారంభం

BHNG: పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాజపేట మండల సర్పంచులు పాల్గొనగా, నిపుణులు గ్రామాభివృద్ధి, పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో జవాబుదారీతనం పెంచడం, నిధుల వినియోగంపై వీరికి శిక్షణ ఇవ్వనున్నారు.

February 24, 2026 / 06:39 AM IST

కోకా కోలా కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ భేటీ

PDPL: సిఎస్ఆర్ (CSR) నిధులతో గ్రామీణ, విద్యా భివృద్ధి పనులు చేపట్టేందుకు హిందుస్థాన్ కోకా కోలా కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ శ్రీహర్ష ఎంఓయు (MOU) కుదుర్చుకున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా నీటి భద్రత, విద్య, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలను ప్రాధాన్యతగా అమలు చేయనున్నారు. సమీకృత కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో అభివృద్ధి పై  ప్రత్యక దృష్టి సారించాలన్నారు.

February 24, 2026 / 06:37 AM IST

‘రజక కుటుంబాన్ని ఆదుకోవాలి’

SRD: కుమ్మెర జాతరలో రజక, దళిత కుటుంబాలపై అగ్రవర్ణాల దాడిని నిరసిస్తూ సోమవారం ఖేడ్ రాజీవ్ చౌక్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. పసికందు మృతికి కారణమైన వారిపై హత్యాకేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొఠారి నర్సింలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి రమేష్, సీపీఐ నాయకులు చిరంజీవి పాల్గొన్నారు.

February 24, 2026 / 06:36 AM IST

‘మద్యం మత్తులో వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు’

SRPT: రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తుంగతుర్తి సీఐ నరసింహారావు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, ఇది చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

February 24, 2026 / 06:35 AM IST