• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాష్ట్రపతి రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మిస్తాం: ఎమ్మెల్యే

W.G: తణుకులోని ప్రధాన రహదారి అయిన రాష్ట్రపతి రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రకటించారు. మహిళా కళాశాల నుంచి తేతలి వై జంక్షన్ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. గత నెల తణుకు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మండల, పట్టణ కమిటీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

February 21, 2026 / 09:12 AM IST

శ్రీశైలం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

NGKL: శ్రీశైలం వెళ్తుండగా అచ్చంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో NGKL జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లికి చెందిన పంపూరం ఆంజనేయులు (38) గాయపడి, శుక్రవారం వెల్దండ ఆసుపత్రిలో మృతి చెందారు. కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు గాయపడ్డారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

February 21, 2026 / 09:12 AM IST

ALERT: రేపే పరీక్ష

TG: రాష్ట్రంలోని గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు, 6-9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం TGCET నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రేపు 492 కేంద్రాల్లో ఉ.11-మ.1 గంటల మధ్య పరీక్ష జరగనుంది. నిమిషం నిబంధన ఉండే అవకాశమున్న నేపథ్యంలో విద్యార్థులు ముందగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఉత్తమం. మాక్ టెస్ట్ పేపర్స్, హాల్ టికెట్లు తదితర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

February 21, 2026 / 09:10 AM IST

రేపు గురుకుల ప్రవేశ పరీక్ష: DCO

WGL: జిల్లా వ్యాప్తంగా రేపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భక్తి కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు DCO అపర్ణ తెలిపారు. విద్యార్థులు నిర్ణిత సమయంలో హాల్ టికెట్ తీసుకొని పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచించారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించారు.

February 21, 2026 / 09:09 AM IST

అక్రమంగా తరలిస్తున్న బియ్యం స్వాధీనం

MDK: బీహార్ నుంచి అల్లాదుర్గం మండలానికి తరలిస్తున్న అక్రమ బియ్యం లారీను అల్లాదుర్గం పోలీసులు పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని ప్రైవేటు వ్యక్తుల నుంచి దొడ్డు రకం బియ్యం లారీల్లో రవాణా చేస్తూ మండలంలోని శ్రీ సాయి బిన్నీ రైస్ మిల్‌కు తరలిస్తుండగా పట్టుకొని స్థానిక స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం సుమారు 42 టన్నుల వరకు ఉందని పోలీసులు తెలిపారు.

February 21, 2026 / 09:09 AM IST

దామరగిద్ద రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ సూచన

NRPT: దామరగిద్ద మండలంలోని రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తహసీల్దార్ తిరుపతయ్య సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏఈవోలు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి, ఈ నెల 21 నుంచి 28 వరకు షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, దీని ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంఏవో బాలాజీ పాల్గొన్నారు.

February 21, 2026 / 09:07 AM IST

మద్యం సేవించిన ఇద్దరికి జరిమానా

KDP: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు కడప రెండో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారని చిన్న చౌక్ SI రాజరాజేశ్వరి రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచామని ఎస్ఐ తెలిపారు.

February 21, 2026 / 09:05 AM IST

దాడి కేసులో నలుగురిపై కేసు నమోదు: ఎస్సై

MNCL: దాడి కేసులో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SI ప్రసాద్ తెలిపారు. నెన్నెల మండలంలోని చిత్తపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు చెల్కల భాస్కర్, మల్లక్కపై శుక్రవారం అదే గ్రామానికి చెందిన వేముల రాజేష్, శంకరి,మల్లయ్య, సంపత్ దుర్భాషలాడి దాడి చేసి చంపుతామని బెదిరించారు. భార్యభర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.

February 21, 2026 / 09:05 AM IST

తిరుమల నెయ్యి వివాదంపై ఉషశ్రీచరణ్ విమర్శలు

సత్యసాయి: తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో టీడీపీ, చంద్రబాబు పాత్ర బహిర్గతమైందని మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ సంస్థకు అనుబంధమని ఇన్నాళ్లు ప్రచారం చేసి, ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కల్తీ అంశం నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

February 21, 2026 / 09:05 AM IST

రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: AO

MLG: వెంకటాపూర్ మండలంలోని అన్ని గ్రామాల రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని (AO) తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, లింక్ మొబైల్ నెంబర్‌తో నేరుగా సంప్రదించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతు పథకాలు, సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరని AO స్పష్టం చేశారు.

February 21, 2026 / 09:05 AM IST

T20 WC గ్రూప్ దశ: టాప్ 5 బ్యాటర్లు, బౌలర్లు

ఇవాళ న్యూజిలాండ్-పాక్ పోరుతో T20 WC సూపర్-8 రౌండ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక గ్రూప్ దశలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లుగా ఫర్హాన్(220*), నిస్సంక(199*), కుశల్ మెండిస్(182), మార్క్రమ్(178*), ఇషాన్(176*) టాప్ 5లో నిలిచారు. బౌలర్ల లిస్టులో స్కాల్క్‌విక్(13 వికెట్లు), వరుణ్(9*), ముజర్బానీ(9*), లియాస్క్(9), ఒమర్జాయ్(9) టాప్ 5 ప్లేయర్లుగా ఉన్నారు.

February 21, 2026 / 09:04 AM IST

చిరుత దాడి.. లేగ దూడలు మృతి

KMR: లింగంపేట్ మండలంలోని గాంధీనగర్లో చిరుతపులి పంజా విసిరింది. రైతు షేక్ రజాక్ పశువుల పాకలో కట్టేసిన రెండు లేగదూడలపై అర్ధరాత్రి చిరుత దాడి చేసి చంపేసింది. శుక్రవారం అటవీశాఖ అధికారులు రామకృష్ణ, వాసుదేవ్ ఘటనాస్థలిని పరిశీలించి చిరుత దాడిని ధృవీకరించారు. వెంటనే బోను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

February 21, 2026 / 09:03 AM IST

ఉపాధి హామీ బకాయిలు విడుదల చేయాలి: MLA

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజను శుక్రవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ మేరకు నియోజక వర్గంలోని ఉపాధి హామీ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి అని ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. సారవకోట ఎంపీడీవో కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

February 21, 2026 / 09:03 AM IST

పంట పొలాల్లో కొంగల సందడి

​VKB: దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరగడంతో రైతులు భారీగా వరి సాగు చేశారు. ప్రస్తుతం పచ్చని పొలాల్లో రైతు నేస్తాలుగా పిలువబడే కొంగలు సందడి చేస్తున్నాయి. పంటకు నష్టం కలిగించే పురుగులు, కీటకాలను ఆహారంగా తింటూ ఈ కొంగలు రైతులకు రక్షణ కవచంలా మారుతున్నాయి. ప్రకృతి ఒడిలో ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

February 21, 2026 / 09:03 AM IST

విశాఖలో రైతు బజార్‌లో కూరగాయల ధరలు ఇలా

VSP: విశాఖ రైతు బజార్‌లో కాయగూరల ధరలు శనివారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ.19, టమాటా రూ.12, బంగాళాదుంప రూ.13, వంకాయ రూ.28, క్యారెట్ రూ.28, మిర్చి రూ. 44, కాకరకాయ రూ.50, కాలిఫ్లవర్ రూ.14, దొండ రూ.36, బీట్రూట్ రూ.22, గోరు చిక్కుడు రూ.38, బీరకాయ రూ.28, గ్రీన్ పీస్ రూ.40, అల్లం రూ. 64, వెల్లుల్లి రూ.110, కీరా రూ.30, క్యాప్సికం రూ.54లుగా ఉన్నాయి.

February 21, 2026 / 09:02 AM IST