• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మేడ్చల్ ఏరియాలో PLC ఇంజనీర్లకు ఫుల్ డిమాండ్

MDCL: మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆటోమేషన్ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో PLC ఇంజనీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. తయారీ యూనిట్లు, ఫార్మా కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అధిక సంఖ్యలో నిపుణులను నియమించుకుంటున్నాయి. పరిశ్రమల్లో యంత్రాల ఆటోమేటిక్ నియంత్రణ, ప్రొడక్షన్ లైన్ల మానిటరింగ్ కోసం PLC నైపుణ్యం కీలకంగా మారింది.

February 25, 2026 / 07:26 AM IST

‘జర్నలిస్టుల చలో విజయవాడ జయప్రదం చేయాలి’

VZM: వచ్చే నెల 4 న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని APWJF జిల్లా అధ్యక్షుడు కె.రమేశ్‌ నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం బొబ్బిలిలో చలోవిజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు,పెన్షన్‌ మీడియా కమిషన్‌ ఏర్పాటు, వెల్ఫేర్‌ ఫండ్‌కు50 కోట్లు కేటాయింపు పరిష్కారించాలన్నారు.

February 25, 2026 / 07:25 AM IST

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

SDPT: జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. నేటి నుంచి ఏప్రిల్ 18 వరకు జరగనున్న ఈ పరీక్షలపై CS నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.

February 25, 2026 / 07:23 AM IST

‘మట్టి పరీక్షలపై మోడల్ స్కూల్ విద్యార్థులకు అవగాహన’

MHBD: భూసార మట్టి పరీక్షలపై నెల్లికుదురు మోడల్ స్కూల్‌లోని 8, 9 తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. పంటల దిగుబడి పెంపుతో పాటు నేల ఆరోగ్యం పరిరక్షణకు మట్టి పరీక్షలు ఎంతో కీలకమన్నారు. సరైన విధానంలో మట్టి నమూనాలు సేకరించి, పరీక్షలు చేయడం ద్వారా రైతులు అవసరమైన ఎరువులను వాడవచ్చని తెలిపారు.

February 25, 2026 / 07:23 AM IST

దుకాణాలు తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు..!

CTR: ప్లాస్టిక్ కవర్ల విక్రయాలను అరికట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ బ్యాగుల వాడకంపై అంక్షలు ఉన్నప్పటికీ పుంగనూరు పట్టణంలో విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది బృందాలుగా ఏర్పడి మంగళవారం పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

February 25, 2026 / 07:23 AM IST

‘RTC డిపోలు మూసివేయడం అన్యాయం’

PPM: ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 12 RTC డిపోలు మూసివేసేందుకు సన్నాహాలు చేస్తుండడం చాలా అన్యాయమని ఏపీ PDT నేషనల్ మజ్దాూర్ యూనియన్ పాలకొండ డిపో కార్యదర్శి రాజేశ్ అన్నారు. మంగళవారం పాలకొండ డిపోవద్ద ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. విద్యుత్తు బస్సులను తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 4 డిపోల మూసివేతకు ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు.

February 25, 2026 / 07:23 AM IST

త్వరలో 7 వేల ఆయా పోస్టుల భర్తీ: మంత్రి

AP: అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. త్వరలో 7 వేల ఆయా పోస్టులను భర్తీ చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 257 ICDS ప్రాజెక్టులు, 55,746 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని.. గతంలో 70గా ఉన్న హాజరు శాతం ప్రస్తుతం 96కి పెరిగిందని చెప్పారు.

February 25, 2026 / 07:20 AM IST

జేఎన్టీయూ ఎంబీఏ, ఎంసీఏ పరీక్ష ఫలితాలు విడుదల

ATP: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏ విభాగాలకు చెందిన ఒకటి, రెండు సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ ఆదేశాల నుంచి పరీక్షల విభాగం అధికారులు నాగప్రసాదానాయుడు, శివకుమార్ ఫలితాలు విడుదల చేశారు.

February 25, 2026 / 07:20 AM IST

బాలికను వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు

E.G: గోకవరం మండలంలోని ఓ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలికను వేధించిన రాకేశ్ అనే యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు నిత్యం వేధిస్తున్నాడని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో గోకవరం SI పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. నిందితుడిని రాజంమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.

February 25, 2026 / 07:20 AM IST

సోమశిల జలాశయంలో తాజా నీటి సమాచారం

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. బుధవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 66.313 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 1784 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. జలాశయంలో 261క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 07:20 AM IST

డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో నేడు ధర్మాన పర్యటన

SKLM: డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు బుధవారం పర్యటించనున్నారు. ఉ. 9 గంటలకు ఓ ప్రైవేట్ క్లినిక్‌లో చికిత్స పొందుతున్న రోగులతో పాటు మృతి చెందిన రోగుల కుటుంబాలను పరామర్శిస్తారు , అనంతరం అధికారులతో ప్రస్తుత పరిస్థితుల పై సమీక్షిస్తారు అని మంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

February 25, 2026 / 07:20 AM IST

గొడిచెర్ల PHC లోఆకస్మిక తనిఖీ

VSP: నక్కపల్లి మండలం గొడిచెర్ల పీహెచ్సీలో ఓపీ పెంచి సకాలంలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించి పలు వార్డులను పరిశీలించారు. భవనంలో కొన్ని చోట్ల బీటలు ఉన్నట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆమె సూచించారు.

February 25, 2026 / 07:19 AM IST

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: MLA

BHPL: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ లేకుండా ఉక్కుపాదం మోపాలని MLA గండ్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం IDOC కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, TGMDC, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్, TGMDC శాఖలతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

February 25, 2026 / 07:17 AM IST

‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి’

SRPT: సూర్యాపేట జిల్లాలో ఉగాది నాటికి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

February 25, 2026 / 07:16 AM IST

టీమిండియా ఓటమి సంతోషమే: రవిశాస్త్రి

T20 WCలో సౌతాఫ్రికాపై భారత్ భారీ తేడాతో ఓటమిపాలవడంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. వరుస విజయాల తర్వాత ఇలాంటి ఓటమి ఎదురవడం సహజమని, ఇది జట్టుకు అలర్ట్ లాంటిదని అభిప్రాయపడ్డాడు. సెమీఫైనల్స్ వంటి కీలక స్టేజ్‌లో కాకుండా ఇప్పుడే ఓటమి ఎదురైనందుకు సంతోషిస్తున్నా అని అన్నాడు. ఈ ఓటమితో జట్టు తన గేమ్ ప్లానింగ్ చేసుకుని విజయం సాధించే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నాడు.

February 25, 2026 / 07:16 AM IST