• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

SRPT: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆకర్షితులయే పార్టీలో చేరికలు మొదలయ్యాయని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మోతే మండలానికి చెందిన పలువురు పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

February 26, 2026 / 08:26 PM IST

6 నెలలైనా పాస్ బుక్ రావడం లేదు: హరీష్ రావు

TG: రెవెన్యూ సదస్సులో 9 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. భూభారతిలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా.. 6 నెలలైనా పాస్ బుక్ రావడం లేదన్నారు. స్లాట్ రద్దు చేసిన వారికి రెండున్నరేళ్లు అయినా.. ఇంతవరకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు.

February 26, 2026 / 08:24 PM IST

ఆశ్రమ పాఠశాల విద్యార్థికి సర్పంచ్ రక్తదానం

ASF: వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న గిరిజాబాయికి అత్యవసరంగా A+ రక్తం అవసరమైంది. విషయం తెలిసిన వెంటనే వాంకిడి సర్పంచ్ చూనార్కర్ సతీశ్ స్పందించారు. సమాజ సేవలో భాగంగా ఆసిఫాబాద్ రక్తనిధి కేంద్రానికి వెళ్లి గురువారం రక్తదానం చేశారు. కాగా రక్తదానం చేసిన సర్పంచ్ సేవాభావాన్ని గ్రామస్థులు అభినందించారు.

February 26, 2026 / 08:22 PM IST

చోరీలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్

MNCL: మందమర్రిలోని యాపల్‌ ప్రాంతంలో గత నెల 30న సెగ్గం మధు, దుర్గం నాగలక్ష్మి ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడిన జాడి అభిరామ్ ను గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై జి. నరేష్ తెలిపారు. స్థానిక సీఈఆర్ క్లబ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుండి 14.4 గ్రాముల బంగారం, 14 తులాల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

February 26, 2026 / 08:22 PM IST

“ప్రాధాన్యత రంగాలకు రుణాలు మంజూరు చేయడమే లక్ష్యం”

BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో MLA గండ్ర, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్ల రుణాలు మంజూరు చేయడం లక్ష్యమని, డిసెంబర్ నాటికి 1937.21 కోట్లు అందించినట్లు MLA గండ్ర తెలిపారు. లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు.

February 26, 2026 / 08:22 PM IST

మున్సిపల్ ఛైర్మన్‌కు జర్నలిస్టుల సన్మానం

PDPL: మంథని మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అందిస్తామని, పట్టణ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.

February 26, 2026 / 08:21 PM IST

ఏలూరులో నకిలీ హావెల్స్ వైర్లు స్వాధీనం

ELR: Havells పేరుతో నకిలీ వైర్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి ఏలూరు పవర్ పేటలోని మహావీర్ ఎలక్ట్రికల్స్‌పై డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆదేశాలతో పోలీసులు దాడి చేశారు. భారీగా నకిలీ వైర్లు స్వాధీనం చేసుకుని, కంపెనీ ప్రతినిధుల ధృవీకరణతో నిందితుడు కుమార్ జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

February 26, 2026 / 08:20 PM IST

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతారంలో ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తప్పనిసరి అన్నారు. ట్రిపుల్ రైడింగ్, అతివేగం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదాలకు కారణమన్నారు.

February 26, 2026 / 08:20 PM IST

గుంటూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుంటూరు జీజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద గురువారం ఓ గుర్తుతెలియని వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందారు. అస్వస్థతతో పడి ఉన్న ఆయనను సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

February 26, 2026 / 08:20 PM IST

భారత్‌లో పనిచేసేందుకు ఉత్తమమైన 10 కంపెనీలు

ప్రముఖ ప్లాట్‌ఫామ్ బ్లైండ్ 2026 సంవత్సరానికి భారత్‌లో పనిచేసేందుకు ఉత్తమమైన టాప్ 10 కంపెనీల జాబితాను ప్రకటించింది. ఇందులో ఎన్విడియా (NVIDIA) అగ్రస్థానంలో నిలిచింది. గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సుమారు 40,686 మంది ఉద్యోగుల సమీక్షల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను రూపొందించారు. ఈ కంపెనీలు మెరుగైన పని వాతావరణాన్ని అందిస్తున్నాయి.

February 26, 2026 / 08:20 PM IST

రేపు తిరుపతికి రానున్న ‘డెకాయిట్’ టీం

TPT: ఎర్రవారిపాలెంలోని IIT తిరుపతిలో శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) ‘డెకాయిట్’ కార్యక్రమం జరగనుంది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా డెకాయిట్ సినిమా హీరో అజిత్ కుమార్ రేసింగ్ టీం సభ్యులు పాల్గొననున్నారు. అలాగే విద్యార్థులతో వారు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.

February 26, 2026 / 08:20 PM IST

జంగిటి వారిపల్లిలో CMRF చెక్కు అందజేత

అన్నమయ్య: రైల్వే కోడూరు(మం) జంగిటి వారిపల్లికు చెందిన కొండేటి విజయలక్ష్మికు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.30,795 విలువైన చెక్కును టీడీపీ పార్టీ ఇంఛార్జ్, KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి వారి నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవడం బాధ్యత అని తెలిపారు.

February 26, 2026 / 08:19 PM IST

కన్మనూర్ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

NRPT: మంత్రి డా.వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కన్మనూర్ గ్రామంలో పలువురి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇల్లు లేని వారికి కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉన్నారని నాయకులు తెలిపారు. అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా మంజూరు చేస్తామని తెలిపారు.

February 26, 2026 / 08:17 PM IST

భూ సేకరణ చేయండి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

NLR: రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని అర్హులైన నిరుపేదలకు త్వరితగతిని ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో హౌసింగ్, రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా గిరిజనులకు మంజూరైన 1,000 పక్కా గృహాలకు భూసేకరణ చేయాలని ఆదేశించారు.

February 26, 2026 / 08:17 PM IST

డ్రంకెన్ డ్రైవ్.. రూ. 5.30 లక్షల జరిమానా

VZM: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించారు. ఈ జరిమానాలను అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ MSHR తేజ చక్రవర్తి విధించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.

February 26, 2026 / 08:17 PM IST