• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి’

PDPL: రీజినల్ టాస్క్ సెంటర్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలోని సెంటర్లో జావా, పైథాన్, సీ, సీ++, హెచ్ఎఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, టాలీ విత్ జీఎస్ఏ, మెడికల్ కోడింగ్, ఆప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 07:11 PM IST

పునరుద్ధరణకు నివేదికలు సిద్ధం

RR: కేశంపేట మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామ సమీపంలో ఉన్న పెద్ద చెరువును సర్పంచ్ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. MLA వీర్లపల్లి శంకర్‌కు రైతులు చెరువుసమస్యలను విన్నవించడంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. MLA ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖఅధికారులు చెరువును ప్రత్యక్షంగా పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన నివేదికలు సేకరించారు.

February 21, 2026 / 07:10 PM IST

కోమరోలులో రేపు పవర్ కట్

ప్రకాశం: కొమరోలు మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మరమ్మతుల కారణంగా తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి,గుండ్రెడ్డిపల్లి, దద్దవాడ, అలసందలపల్లి, నారాయణ పల్లి, వెంకటంపల్లి గ్రామాలకు ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

February 21, 2026 / 07:09 PM IST

చంద్రబాబు అధ్యక్షతన CRDA భేటీ

AP: CM చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రి నారాయణ, అధికారులు హాజరయ్యారు. రాజధాని పురోగతి, అనుమతులు, సహకారంపై చర్చించారు. రాజధాని పనులపై అధికారులను ఆరా తీశారు. త్వరగా నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

February 21, 2026 / 07:07 PM IST

విషాదం.. దంపతుల ఆత్మహత్య

AP: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుప్పంలోని వేపూరులో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో భార్య మల్లమ్మ(55) ఉరి వేసుకోవడంతో మనస్తాపం చెందిన భర్త రామప్ప(62) కూడా ఉరి వేసుకున్నాడు. భార్యాభర్తల మృతిత కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

February 21, 2026 / 07:07 PM IST

గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

JGL: రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై యంత్రాంగం దృష్టి సారించింది. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో ఉన్న పుష్కర ఘాట్లను డీపీవో రేవంత్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో గణేష్, ఎస్సై నవీన్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్పంచ్ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి మనోజ్, ఆర్పీలు పాల్గొన్నారు.

February 21, 2026 / 07:06 PM IST

రాగి జావా తాగి విద్యార్థులకు అస్వస్థత

TG: మెదక్ జిల్లా రామాయంపేటలో ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ZPHSలో రాగి జావా తాగిన ఆరుగురు విద్యార్థులు కడుపు నొప్పితో ఇబ్బందులు పడ్డారు. వారికి రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రాగి జావాలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

February 21, 2026 / 07:06 PM IST

ఆధునీకరణ పనులను పరిశీలించిన ఎంపీడీవో

AKP: గొలుగొండ మండల పరిషత్ కార్యాలయ ఆధునీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సుందరంగా ముస్తాబిస్తున్న కార్యాలయం ఉగాది నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీడీవో యువి.ఎస్. శ్రీనివాసరావు ఆధునీకరణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా చెప్పారు.

February 21, 2026 / 07:05 PM IST

త్వరలో దివ్యాంగులకు స్కూటీలు

SRD: జిల్లా మహిళాల, శిశు, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేయనున్నారు. కలెక్టర్ కార్యాలయానికి ఇటీవల 50 స్కూటీలను తీసుకువచ్చారు. ఇప్పటికే స్కూటీల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులను గుర్తించారు. త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేస్తామని జిల్లా సంక్షేమ అధికారిని లలిత కుమారి తెలిపారు.

February 21, 2026 / 07:05 PM IST

‘చెత్తను వేరు చేసి సిబ్బందికి అందించాలి’

SRD: సంగారెడ్డి పట్టణ ప్రజలు తమ ఇళ్ల వద్ద తడి, పొడి, హానికర చెత్తను వేరువేరుగా వేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఇలా చెత్తను వేరు చేయడం వల్ల ప్రాసెసింగ్ సులభమవుతుందన్నారు. ప్రజలు మార్కెట్‌కు వెళ్లే సమయంలో ప్లాస్టిక్ కవర్లను విడిచి, పర్యావరణ హితమైన సంచులను వాడాలని సూచించారు.

February 21, 2026 / 07:05 PM IST

‘అరైవ్ అలైవ్‌తో ట్రాఫిక్ చైతన్యం’

SDPT: పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు స్థానిక కంటెంట్ క్రియేటర్లు రూపొందించిన వీడియోలకు మంచి స్పందన లభించింది. సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియమాలపై చిన్న వీడియోలు @Siddipet_Police_Commis sionerateను ట్యాగ్ చేయాలని రష్మీ పెరుమాళ తెలిపారు.

February 21, 2026 / 07:05 PM IST

విఘ్నేశ్వర స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.4,01,761 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 513 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 17 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 4,871 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.

February 21, 2026 / 07:04 PM IST

‘అభివృద్ధికి మాతృభాషనే పునాది’

NLG: మాతృభాష పరిరక్షణ మనందరి బాధ్యత అని గ్రంథాలయ ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ పిలుపునిచ్చారు. కేతేపల్లి మండలం, భీమవరం జి.ప.ఉ.పాఠశాలలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషా ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పాలన్నారు. అభివృద్ధికి మాతృభాషనే పునాది అని, ఇందులో పట్టుంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని పేర్కొన్నారు.

February 21, 2026 / 07:04 PM IST

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్పీ

ADB: తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎస్పీకి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.

February 21, 2026 / 07:03 PM IST

‘పేద‌ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సహకరించాలి’

KMM: హైదరాబాద్‌కు విచ్చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేంద్రం నుండి ఒక్క ఇల్లు కూడా సాధించలేకపోయిందని, కానీ, ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఇప్పటికే 11.57 లక్షల మంది అర్హులను గుర్తించిందని ఆయన పేర్కొన్నారు.

February 21, 2026 / 07:03 PM IST