W.G: మొదటి రోజు అసెంబ్లీ ‘ఆట విడుపు’ క్రీడా పోటీలలో సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాలీబాల్, కబడ్డీ ఆటలను ఆడారు. అలాగే ఆటల్లో సరదాగా ఆయన తొడ కొట్టారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఎమ్మెల్యే రఘురామ అన్నారు.
ఏఐకి టీసీఎస్ భయపడదని ఆ సంస్థ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. కంపెనీ వార్షిక ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఏఐ మార్పులకు అనుగుణంగా తమ కంపెనీ విధానాలు మార్చుకుంటున్నామని తెలిపారు. అంతేగానీ.. కొత్త టెక్నాలజీ చూసి భయపడబోమని అన్నారు. ఏఐ టూల్స్‌ను వినియోగించి పనిని వేగంగా, తక్కువ ఖర్చుతో చేసే విధానంపై తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నట్లు కృతివాసన్ వెల్లడించారు.
MLG: మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన తూముల అనిల్ నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం సాయంత్రం మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్టే గ్రామానికి చెందిన ముక్కెర యాకన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చరిత్ర విభాగంలో “ల్యాండ్ కాస్ట్ అండ్ పవర్ ఆఫ్ తెలంగాణ” అంశంపై డాక్టర్ అంజయ్య పర్యవేక్షణలో పరిశోధన చేసినందుకు గాను యూనివర్సిటీ విభాగం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా యాకన్నను పలువురు అభినందించారు.
WGL: నెక్కొండ మండలం మడిపల్లి గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం పై గ్రామ సర్పంచ్ అనూష DLPOకు బుధవారం ఫిర్యాదు చేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో రూ. 1,75,703 అక్రమంగా విడుదల చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాలకవర్గం, తనకు తెలియకుండా ఫిబ్రవరి 21న హాజరు పట్టికలో సంతకం పేరుతో కార్యదర్శి రజియా మోసం చేసినట్లు సర్పంచ్ ఆరోపించారు.
అన్నమయ్య: పుంగనూరు టౌన్ మంగళం రోడ్డు, కోనేటిపాలెం వద్ద 15 అడుగుల లోతైన నీటి సంపులో ఓ పశువును పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది తాళ్లు, నిచ్చెనల సహాయంతో ఆవును రక్షించి యజమానికి అప్పగించారు. రెస్క్యూ కాల్‌పై సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజల సహకారంతో రక్షణ చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి.
అన్నమయ్య: పుంగనూరు టౌన్ మంగళం రోడ్డు, కోనేటిపాలెం వద్ద 15 అడుగుల లోతైన నీటి సంపులో ఓ పశువు పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది తాళ్లు, నిచ్చెనల సహాయంతో ఆవును రక్షించి యజమానికి అప్పగించారు. రెస్క్యూ కాల్‌పై సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజల సహకారంతో రక్షణ చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి.
TPT: చిల్లకూరు (M) కడివేడు గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోట నుంచి గూడూరుకు ఆటో వస్తుండగా కోట వైపు వెళుతున్న కారు ఢీకొంది. దీంతో ఆటో, కారు నుజ్జునుజ్జయ్యాయి. ఆటో డ్రైవర్ ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రుడిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ప్రయాణికుడి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్, మంజుల దంపతులు నర్సంపేట వెళ్లే బస్సు కోసం వేచి చూస్తుండగా దొంగలు బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నం (కొండగూడెం)లోని దాపర్తి చిట్టియ్య క్వారీలో పనిచేస్తున్న అవిటి యేసు (42)కు ప్రమాదవశాత్తు బుధవారం తలపై రాయి పడింది. అతడికి గాయం కావడంతో వైద్యం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంపై దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
JN: ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. కొడకండ్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులతో వైస్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
KRNL: ఎస్‌ఎంఏ టైప్-1తో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే బాలిక చికిత్సకు సాయం చేసేందుకు మంత్రి లోకేష్ ముందుకొచ్చారు. ఈ స్థితిలోనూ ధైర్యంగా పునర్విక పోరాడుతున్న తీరును కొనియాడారు. ఆమె ఇంజక్షన్‌కు రూ.16 కోట్లు అవసరమని అయితే, ఇప్పటికే దాతలు స్పందించి రూ.10 కోట్లు సమకూర్చడం హర్షణీయమన్నారు. మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చడం తన బాధ్యతన్నారు.
KMM: వెలుగుమట్ల గ్రామ సర్వే నం. 147,148,149 భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు, స్వాధీన చర్యలు పూర్తిగా చట్టబద్ధమైన వని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇవాళ తెలిపారు. 31 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి ఆక్రమణలో ఉండగా, సంబంధిత భూమి మొత్తం విలువ సుమారు 250 కోట్లకు పైగా ఉంటుందని భారీ స్థాయి ఆస్తులను కాపాడగలిగామని ఆయన తెలిపారు.
NZB: ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు. పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో టేస్టింగ్ సాల్ట్ కృత్రిమ రంగులవాడుతున్నట్లు గమనించామన్నారు.
PDPL: గోదావరిఖని పట్టణంలో బుధవారం ఆర్ఎంపీ డాక్టర్ల మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా జవహర్ నగర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అన్వర్ ఇటీవల ఒక వ్యక్తికి సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా సదరు RMP వైద్యుడిని నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య యాదవ్ శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో 54వ డివిజన్ కార్పోరేటర్ ముస్తఫా పాల్గొన్నారు.