• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రూ.151కే ఇంటికి భద్రాచల రాములోరి కళ్యాణ తలంబ్రాలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. భద్రాచల సీతారామయ్య కళ్యాణ తలంబ్రాలను రూ.151లకే అందించనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బస్ భవన్‌లో శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణకు చెందినవారు ఈ నెల 23వ తేదీన www.tgartclogistics.co.inలో రిజిస్టర్ చేసుకోవాలని, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం తలంబ్రాలు అందజేస్తామని ఆయన వివరించారు.

February 22, 2026 / 08:27 AM IST

బావిలో పడి వ్యక్తి మృతి

BHPL: చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఏకు సారయ్య (55) రేగొండ మండలం కొడవటంచలోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ప్రతి వారం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే సారయ్య, ఈ నెల 17న ఆలయానికి వచ్చి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బావిలో దుర్వాసన రావడంతో పరిశీలించగా మృతదేహం లభ్యమయింది.

February 22, 2026 / 08:25 AM IST

తగ్గనున్న వంటనూనె ధరలు?

వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. క్రూడ్ పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10% తగ్గించింది. ఈ నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల మొత్తం సుంకం 27.5% నుంచి 16.5% పడిపోతుంది. భారత్ తన వంటనూనెల అవసరాల కోసం 70% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లీటర్ నూనెపై ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

February 22, 2026 / 08:25 AM IST

అటవీ ప్రాంతాల్లో అర్థరాత్రి తవ్వకాలు…!

MHBD: గూడూరు మండలం అటవీ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో శనివారం అర్థరాత్రి తవ్వకాలు చేశారు. సీతానగరం గ్రామ యువకులు ఆ వ్యక్తులను ఆరా తీశారు. వారు పోంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో యువకులు అటవీశాఖ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చేలోపో వారు అక్కడి నుంచి పరారయ్యారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

February 22, 2026 / 08:24 AM IST

‘మండల స్థాయిలో ప్రజావాణి పునః ప్రారంభం’

MDK: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 నుంచి మండల స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదే రోజు కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారని, మార్చి 2 నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.

February 22, 2026 / 08:23 AM IST

నేడు నారాయణ గూడెం మందకృష్ణ రాక..!

SRPT: మునగాల మండలం నారాయణ గూడెంలో దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేడు పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామంలో అగ్రవర్ణాల వ్యక్తులు దళితులపై దాడి చేసినా, పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని బాధ్యత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించనున్నట్లు సమాచారం.

February 22, 2026 / 08:21 AM IST

చెత్తను తొలగించిన MRO

ASR: పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని కొయ్యూరు MRO మురళీబాబు అన్నారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర-స్వరాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయం సిబ్బందితో కలిసి స్వయంగా చెత్తను తొలగించారు. కార్యాలయం లోపల, బయట ప్రాంగణంలో చెత్తా తొలగించి శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

February 22, 2026 / 08:18 AM IST

సీసీ కెమెరాల నిగా పెంచాలి: ఎస్పీ

NDL: రంజాన్ మాసం నేపథ్యంలో నంద్యాలలో సీసీ కెమెరాల నిఘా మరింత పెంచాలని ఎస్పీ సునీల్ షోరాన్ పోలీసులకు సూచించారు. శనివారం విజిబుల్ పోలింగ్‌లో భాగంగా నంద్యాలలో పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బొమ్మల సత్రం ఆర్టీసీ బస్టాండ్ బైర్మల్ విధి శ్రీనివాస సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.

February 22, 2026 / 08:18 AM IST

మెదక్ జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇవే

మెదక్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.206 నుంచి రూ.230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.234 నుంచి రూ.260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గింది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చుని వ్యాపారులు తెలిపారు.

February 22, 2026 / 08:18 AM IST

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ

GNTR: ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ సిద్ధమైందని శనివారం ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు సీసీ కెమెరాలు అమరిక, ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 08:16 AM IST

బంటనహళ్‌లో ఉచిత యోగా, గ్రంథాలయ కేంద్రం ప్రారంభం

KRNL: బెంగళూరులో స్థిరపడ్డ గ్రామ వాసి శ్రీ నాగరాజేంద్ర గౌడ్ గ్రామంలోని 5–12 ఏళ్ల పిల్లల కోసం ఉచిత యోగా శిక్షణ, గ్రంథాలయం, వ్యక్తి వికాస్ కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యం, విద్యా అభివృద్ధి లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు ఈ సేవను అభినందించారు.

February 22, 2026 / 08:16 AM IST

జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇవే..!

మహబూబ్ నగర్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.206 నుంచి రూ.230 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.234 నుంచి రూ.260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ.5 వరకు తగ్గింది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని వ్యాపారస్థులు తెలిపారు.

February 22, 2026 / 08:15 AM IST

‘ప్రజలకు ఉచిత న్యాయ సహాయం’

PDPL: గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే లక్ష్యమని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి గణేష్ తెలిపారు. నిన్న సుల్తానాబాద్ మండలం గట్టేపల్లిలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అవగాహనతోనే న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 08:14 AM IST

ఎమ్మెల్యే కుమార్తెకు ‘యూత్ ఐకాన్’ అవార్డు

ATP: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభల్లో MLA దగ్గుపాటి ప్రసాద్ కుమార్తె ఆశ్రితకు ‘యూత్ ఐకాన్’ అవార్డు లభించింది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా 25 కుటుంబాలను దత్తత తీసుకున్నందుకు ఆమెకు ఈ గౌరవం వరించింది.

February 22, 2026 / 08:14 AM IST

నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

SKLM: సారవకోట మండలం అలుదు ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆనందరావు తెలిపారు. శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరిసర ప్రాంతాల ప్రజల ఈ విషయాన్ని గమనించి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 08:12 AM IST