ASR: ప్రభుత్వం నుంచి వచ్చే ఐవీఆర్ఎస్ కాల్స్‌కు తప్పకుండా స్పందించాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు ప్రజలను కోరారు. ఆయన సోమవారం రావణాపల్లిలో పర్యటించారు. పంచాయతీలో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. చెత్త సేకరణ కార్యక్రమం పక్కాగా అమలు చేయాలన్నారు.
CTR: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 54 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 23 ఫిర్యాదులు అందాయన్నారు.
ఉద్యోగ భవిష్య నిధి (EPF)పై ఇచ్చే వడ్డీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) 8.25 శాతంగా కొనసాగించాలని EPFO నిర్ణయించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన 239వ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇంతే వడ్డీరేటు అందించగా.. ఈసారి కూడా ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.
VSP: పేదల ఆరోగ్యానికి అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తున్నామని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు చెందిన పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ఎంపీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోగా 22 లక్షల పైగా మంజూరైన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను బాధితులకు ఎంపీ చేతుల మీదుగా అందజేశారు.
PDPL: జూలపల్లి మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి కాచాపూర్ గ్రామం వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సోమవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నైతిక విలువలతో, ప్రజల పట్ల అంకితభావంతో సేవలందించిన నాయకుడు శ్రీపాద రావు అని స్మరించుకున్నారు.
AP: మాజీ సీఎం జగన్ ఎల్లుండి విశాఖ, అల్లూరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి ఆయన వెళ్లానున్నారు. ఇటీవల వివాహమైన గణేష్ కుమారుడు దంపతులను ఆశీర్వదించనున్నారు.
NLG: దివంగత శాసన సభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ చంద్రశేఖర్, పలువురు అధికారులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
SRPT: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 83 దరఖాస్తులను స్వీకరించారు. భూ సమస్యల దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పెండింగ్ దరఖాస్తులను శాఖల వారీగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
VZM: ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అతిది విజయలక్ష్మి గజపతిరాజు కలిసి వినతిపత్రం అందించారు. ఆర్టీసీలో థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి నేరుగా ఆర్టీసీ సంస్థ నుంచి జీతం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని పబ్లిక్ సెక్రెటరీ అశోక్ కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
NTR: తిరువూరు(M) అక్కపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ నాభిశిలాంబ శ్రీ ముత్యాలమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, పోతురాజు స్వామి వార్ల విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం ఈనెల 8వ తారీఖున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును వ్యక్తిగత ఆఫీసులో కమిటీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కమిటీ సభ్యులు నాగిరెడ్డి సోమవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
SRCL: జిల్లా కలెక్టరేట్ సోమవారం ప్రజావాణి నిర్వహించగా, 164 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖకు 61, గృహ నిర్మాణ శాఖకు 25, జిల్లా పంచాయతీ కార్యాలయం, డీఆర్డీఓకు 13 చొప్పున, సంక్షేమ శాఖకు- 09, ఉపాధి కల్పన శాఖకు – 08, వచ్చాయన్నారు.
W:G: జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పరీక్షలకు రిజిస్టర్ అయిన వారందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ఆమె వెచ్ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
BHNG: అడ్డగూడూర్ మండలం అజీంపేట బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ కన్నేబోయిన ఎలేందర్ కుమారుడు కిరణ్ వివాహం సందర్బంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు లింగాల మధు గౌడ్, చిరంజీవి, రాకేష్ పాల్గొన్నారు.
TG: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు విద్యాశాఖ పొడిగించింది. 6వ తరగతిలో పూర్తిస్థాయి సీట్లను భర్తీ చేయనుండగా 7, 8, 9, 10వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లను ఈ ప్రవేశాల ద్వారా భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఆసక్తి గల విద్యార్థులు https://tgms.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.