• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కొబ్బరి చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి

JN: చిల్పూర్ మండలంలోని లూనావత్ తండాకు చెందిన గుగులోతు సురేష్ (24) కొబ్బరి చెట్టు నుంచి కింద పడి మృతిచెందాడు. కొబ్బరిచెట్టు ఎక్కి బొండాలు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సురేష్ మృతితో తండాలో విషాదం నెలకొంది.

February 23, 2026 / 09:36 AM IST

బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ఎంపికకు దరఖాస్తులు

KMM: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల ఎంపిక కోసం ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దరఖాస్తులు కోరారు. గత ఐదేళ్లలో 10వ తరగతిలో 90% పైగా ఉత్తీర్ణత, అందులో 50% మంది మొదటి శ్రేణిలో నిలిచిన రాష్ట్ర/కేంద్ర గుర్తింపు పొందిన పాఠశాలలు దీనికి అర్హులన్నారు.

February 23, 2026 / 09:35 AM IST

బర్డ్ ఫ్లూ కలకలం.. అధికారుల జోక్యానికి ప్రజల డిమాండ్

SRPT: నడిగూడెం మండలం రామాపురం గ్రామంలోని కోళ్ల షెడ్లలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ వల్లే కోళ్లు చనిపోతున్నాయని అనుమానిస్తున్న యజమాని, జెసిబితో గుంతలు తీసి వాటిని పాతిపెట్టారు. ​అయితే, వ్యాధి సోకిన కోళ్లను మార్కెట్లో విక్రయించే అవకాశం ఉందని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 09:35 AM IST

ఘనంగా బేడెన్ పావెల్ జన్మదినం.. వరల్డ్ థింకింగ్ డే

PDPL : గోదావరిఖని బెడెన్ పావెల్ పార్కులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు, బెడెన్ పావెల్ 169వ జన్మదినం, ‘వరల్డ్ థింకింగ్ డే’ ఆదివారంఘనంగా నిర్వహించారు. RG-1 SO to GM చంద్రశేఖర్ పావెల్ విగ్రహానికి నివాళులర్పించి, స్కౌట్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 200 మంది విద్యార్థులతో ‘శాంతి ప్రగతి యాత్ర’ చేపట్టారు. స్కాట్స్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు.

February 23, 2026 / 09:35 AM IST

పూల్ విన్నర్‌గా నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు

NZB: రాష్ట్రస్థాయి సీఎం కప్ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు అద్భుత ప్రదర్శనతో పూల్ విన్నర్‌గా నిలిచింది. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో నిజామాబాద్ క్రీడాకారిణులు వరుస విజయాలు సాధించారు. హనుమకొండ, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల జట్లను మట్టికరిపించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.

February 23, 2026 / 09:33 AM IST

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు

ATP: గుత్తిలోని గుంతకల్లు రోడ్డులో సోమవారం బైకు అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఉపాధ్యాయుడిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 23, 2026 / 09:30 AM IST

రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం

అన్నమయ్య: రాజంపేట పట్టణ పరిధి మన్నూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వల్లీ దేవసేన సమేత స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం స్వామి వారి కళ్యాణం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ సాయంత్రం గ్రామోత్సవం ఉంటుందని వివరించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

February 23, 2026 / 09:29 AM IST

LOC పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు

HNK: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజల పాలిట వరంగా నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. 45వ డివిజన్ పరిధి లోని కడిపికొండకు చెందిన దామెరుప్పుల సురేష్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ. 2,50,000/-చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

February 23, 2026 / 09:29 AM IST

యాగంటి ఆలయంలో సోమవారం పూజలు

NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సోమవారం పూజలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

February 23, 2026 / 09:29 AM IST

ముదురుతున్న వివాదం సవాళ్లు.. ప్రతి సవాళ్లు

KMR: కామారెడ్డి జిల్లా ఉద్రిక్త పరిస్థితుల అనంతరం కళాశాల ఆస్తుల విషయంలో నేరుగా కలెక్టర్ వద్దనే కూర్చుందామని, నేడు ఆధారాలతో రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరోసారి సవాల్ చేశారు. దాంతో కళాశాల ఆస్తుల అన్యాక్రాంతం అంశం ఇప్పుడు కలెక్టర్ వద్దకు చేరింది. సోమవారం ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.

February 23, 2026 / 09:27 AM IST

కొత్తగూడెం కార్పొరేషన్‌లో సదుపాయాల కొరత

BDK: కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ పాలకవర్గం ఏర్పాటైనా, తగిన సౌకర్యాలు ఇంకా కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం పాత కౌన్సిల్ హాల్లోనే నిర్వహించగా, భవిష్యత్ సమావేశాల నిర్వహణపై కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త భవనం, ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరుగుతోంది.

February 23, 2026 / 09:26 AM IST

చిల్పూర్ గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం

JN: చిల్పూర్ మండల కేంద్రంలో చిల్పూర్ గుట్టలో 9 రోజుల బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహన సేవలు, క్యూలైన్, వసతి, అన్నప్రసాద వితరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఈనెల 28న బుగులు వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది. దేవస్థానం ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తెలిపారు.

February 23, 2026 / 09:24 AM IST

T20 WC: అందుకే ఓడిపోయాం: సూర్య‌కుమార్

టీ20 వరల్డ్‌కప్-2026 సూపర్-8లో భాగంగా నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామన్నాడు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడంతోనే మ్యాచులో వెనుకబడ్డామని, ఆ తర్వాత ఫామ్‌లోకి రాలేకపోయామని చెప్పాడు. పవర్ ప్లేలో బ్యాటింగ్ మెరుగ్గా చేసుంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నాడు.

February 23, 2026 / 09:23 AM IST

అసెంబ్లీకి రావాలని బొట్టుపెట్టి పిలవరు: లోకేష్

AP: అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేష్ చిట్‌చాట్ నిర్వహించారు. లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ అసెంబ్లీలో పెడతామని తెలిపారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టుపెట్టి పిలవరని ఎద్దేవా చేశారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని చెప్పారు. దేవుడిని కూడా వైసీపీ రోడ్డుమీదకు తీసుకురావడం బాధాకమని అసహనం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 09:21 AM IST

21 డివిజన్‌లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ శ్రీనివాస్ కాలనీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ పరిసరాలను పారిశుధ్య పనులను సిబ్బంది ముమ్మరం చేశారు. గత కౌన్సిల్ గడువు ముగిసిపోవడంతో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నూతనంగా కార్పొరేటర్ ఫలితాలు వెలవడి, డివిజన్ నుంచి గెలిచిన గుండా సంతోష్ పారిశుద్ధ్య పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

February 23, 2026 / 09:21 AM IST