• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గుంటూరు జెడ్పీలో నలుగురికి ఏవోలుగా పదోన్నతులు

గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏవో) పదోన్నతులు లభించాయి. జెడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, సీఈవో జ్యోతిబసు ఆధ్వర్యంలో వీరికి నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో సురేష్ బాబు, పాండురంగ స్వామి, శ్రీనివాస మూర్తి, శ్రీనివాసరావు ఉన్నారు.

February 27, 2026 / 06:29 PM IST

‘మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

ATP: ​ఏపీ సైనిక సంక్షేమ డైరెక్టర్ క్యాప్టెన్ పి.సత్యప్రసాద్ శుక్రవారం అనంతపురంలో పర్యటించారు. మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు రామావత్ పార్వతి, దరపనేని శ్రావణిలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. వీరమరణం పొందిన జవాన్ నరేష్ సాకే కుటుంబాన్ని పరామర్శించి, ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం, భూమి కేటాయింపుపై హామీ ఇచ్చారు.

February 27, 2026 / 06:28 PM IST

కంటి చూపు బాగుంటే ప్రమాదాలను తగ్గించగలం: CP

WGL: డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని CP సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో ప్రయాణించే వారి గమ్యస్థాలను క్షేమంగా చేరవేయాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు.

February 27, 2026 / 06:26 PM IST

‘సంఘటన్ సృజన్ అభియాన్‌తో సంస్థాగత బలోపేతం’

KMR: కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘటన్ సృజన్ అభియాన్ 7వ రోజు శిక్షణ శిబిరం విజయవంతంగా జరిగింది. రాజ్యసభ సభ్యుడు, AICC మైనారిటీ విభాగం ఛైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గార్హీ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ స్థాయి నిర్మాణ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహాలపై మార్గదర్శనం చేశారు. ఉమ్మడి జిల్లాల DCC అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నగేశ్ రెడ్డి పాల్గొన్నారు.

February 27, 2026 / 06:26 PM IST

యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. రేపటి విశేష పూజలు..!

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం విశేష వేడుకలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం. రాత్రి 9:00 గంటలకు శృంగార డోలోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవాలు పరిసమాప్తి గావిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు.

February 27, 2026 / 06:26 PM IST

డిప్యూటీ సీఎంను పరామర్శించిన సినీ నటుడు

W.G: హైదరాబాద్ AIG లో చికిత్స పొందుతున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజును ప్రఖ్యాత సినీ నటుడు మంచు మోహన్ బాబు శుక్రవారం ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. RRR త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేపు డిశార్చ్ అవుతారని టీడీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

February 27, 2026 / 06:25 PM IST

ANU దూరవిద్యలో 5 ఎంబీఏ కోర్సులకు అనుమతి

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) దూరవిద్య కేంద్రం 2026 క్యాలెండర్ సంవత్సరానికి గాను 5 ఎంబీఏ స్పెషలైజేషన్లకు యూజీసీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నుంచి అనుమతి పొందినట్లు సీడీఈ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. అలాగే, మార్చి 8న జరగాల్సిన ఎంబీఏ ప్రవేశ పరీక్షను మార్చి 15వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

February 27, 2026 / 06:25 PM IST

రేపే మృత్యుంజయ్ ట్రైలర్ విడుదల

శ్రీ విష్ణు, రెబా మౌనికా జాన్ జంటగా నటించిన మృత్యుంజయ్ చిత్రం.. మార్చి 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రేపు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, మొదటి సారి శ్రీ విష్ణు కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ వైపు అడుగులు వేశాడు.

February 27, 2026 / 06:23 PM IST

చికెన్ కోసం తమ్ముడిని చంపిన అన్న

AP: అమరావతిలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కుటుంబం ఉపాధి కోసం వలస వచ్చింది. ఇంట్లో చికెన్ వండుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో అన్న బబ్బు గౌడ్ ఇనుప రాడ్‌తో తమ్ముడు జితేరాజ్‌పై దాడి చేసి చంపేశాడు. నేరం బయటపడకుండా తండ్రి దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.

February 27, 2026 / 06:22 PM IST

విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర గాయాలు

MDK: రామాయంపేట పట్టణంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ జంపర్ మారుస్తుండగా బచ్చు రాజు పల్లి తండాకు చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు బాబు లాల్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో తోటి సిబ్బంది వెంటనే స్పందించి రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 27, 2026 / 06:21 PM IST

రాజాపూర్ మండల నూతన వార్డు సభ్యులకు శిక్షణ పూర్తి

MBNR: రాజాపూర్ మండలంలో మొదటి విడతగా 13 గ్రామపంచాయతీలకు చెందిన నూతన వార్డు సభ్యులకు గత 5 రోజులుగా మండలంలోని రైతు వేదికలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ శిబిరం ఈరోజు ముగిసింది. వార్డు సభ్యులకు ఎంపీడీవో విజయలక్ష్మి సర్టిఫికెట్స్ అందజేశారు. వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామాలలో వార్డు సభ్యుల విధులు, అభివృద్ధిపై అధికారుల శిక్షణ తమకు చాలా ఉపయోగపడుతుందన్నారు.

February 27, 2026 / 06:21 PM IST

జిల్లా ప్రధాన కార్యదర్శి నియమాకం..!

NDL: బీజేపీ యువమోర్చా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. విజయ భాస్కర్ శుక్రవారం ఎన్నికయ్యారు. 2014 నుంచి డోన్ పట్టణంలో విద్యార్థి హక్కుల కోసం ఉద్యమం చేశారు. యువత శక్తిని జాతీయ నిర్మాణంలో భాగం చేయడం, కేంద్ర సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన వెల్లడించారు.

February 27, 2026 / 06:19 PM IST

కోడిపందాల స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు

NLR: కావలి మండలం పెద్ద రాముడు పాలెం గ్రామంలో కోడిపందాలు ఆడుతున్నారని సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9 మంది వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 32,350 రూపాయలు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నామని రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట, కోడిపందాలు, గంజాయి అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

February 27, 2026 / 06:19 PM IST

B.Ed ఫలితాలు విడుదల

TPT: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది డిసెంబర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) మూడో(3వ) సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

February 27, 2026 / 06:18 PM IST

నిధుల కేటాయింపునకు డిమాండ్

కడప: జిల్లాలోని చేనేత సహకార సిల్క్, కాటన్ నిధులు కేటాయించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని చేనేత ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున స్పష్టం చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట శుక్రవారం చేనేత సహకార సంఘాలు,ప్రజా సంఘాల నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. సంఘాలను తిరిగి పునరుద్దించేలా RRR నిధులను విడుదల చేసేలా చూడాలన్నారు.

February 27, 2026 / 06:17 PM IST