• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు ధ్వంసం..ఇబ్బందులు పడుతున్నా వాహనదారులు

KMR: జిల్లా ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో గ్రామాలకు రోడ్లు వేస్తున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యంగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. ఇందుకు నిదర్శనం ఈ చిత్రం. మద్నూర్ మండలం అవల్ గావ్ గ్రామం నుంచి కొడిచిర గ్రామానికి వెళ్లే మార్గంలో తారు రోడ్డును గుర్తు తెలియని దుండగులు ట్రాక్టర్‌తో ధ్వంసం చేయడంతో రోడ్డు ధ్వంసం అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

February 26, 2026 / 12:40 PM IST

‘ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం’

KMR: తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సర్పంచ్ రాజా గౌడ్ అన్నారు. గురువారం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ సెలవులో ఉండటంతో, పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలగకుండా సర్పంచ్ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. సిబ్బందితో కలిసి వీధుల్లోని చెత్తను తొలగింపజేశారు. పదవిలో ఉండి పని చేసిన సర్పంచ్ చొరవను గ్రామస్థులు కొనియాడారు.

February 26, 2026 / 12:40 PM IST

పాల కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

KDP: బద్వేల్ పరిధిలో కొనసాగుతున్న పాల కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీ నరసింహ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎకో మిల్క్ అనలైజర్ మీటర్ ద్వారా రీడింగ్ చెక్ చేసుకుంటూ, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మంచి సేవలు అందిస్తున్న పాల కేంద్ర యజమాని శ్రీ లక్ష్మయ్యను అభినందించి, సన్మానించారు.

February 26, 2026 / 12:40 PM IST

బాలికలకు తప్పనిసరిగా HPV టీకా వేయించాలి: MLA

VZM: చీపురుపల్లి ప్రాంతీయ హాస్పిటల్‌ను గురువారం ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సందర్శించారు. ఈనెల 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవి టీకా వేయించాలని సూచించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి ఆరోజున చంద్రబాబు నాయుడు హాస్పిటల్ సందర్శించనున్నారు. అన్ని ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.

February 26, 2026 / 12:40 PM IST

క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్యే

NLG: యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాక క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

February 26, 2026 / 12:40 PM IST

పార్టీ బలోపేతం పై కృషి చేస్తాం: మాధవ్

NLR: బుచ్చి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వాన్ని స్థానిక ప్రజలు, కార్యకర్తలు నమోదు చేయించారు. ఇప్పటివరకు 200 సభ్యత్వాలు నమోదు చేశామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతంపై కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.

February 26, 2026 / 12:40 PM IST

తాళ్లకోడు కాలనీలో సమస్యలపై సీపీఐ పోరాటం

W.G: ఆకివీడు తాళ్లకోడు కాలనీలో సమస్యలను పరిశీలించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర ప్రారంభించారు. కాలనీలో రోడ్లు సక్రమంగా లేవని, తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లేదని కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీని ఆకివీడు నగర పంచాయతీలో చేర్చి అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీపీఎం నాయకులు శ్రీనివాస్, బలరాం, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 12:40 PM IST

ధర్మారంలో ఇంటర్ పరీక్షకు 98 శాతం హాజరు

PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్షకు 98.32% విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాధన జూనియర్ కళాశాలలోని కేంద్రాలలో 478 మంది విద్యార్థులకు 470 మంది విద్యార్థులు హాజరయ్యారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

February 26, 2026 / 12:39 PM IST

గద్వాల జిల్లాలో అధికారుల బదిలీలు

జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు ప్రభుత్వ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి పద్మజ రాణిని DROగా నియమించింది. జిల్లాలో ఆర్డీవోగా ఉన్న అలివేలు హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.శ్రీనివాస్ రావు జిల్లా రెవెన్యూ అభివృద్ధి శాఖకు బదిలీ అయ్యారు.

February 26, 2026 / 12:39 PM IST

శివ‌మ్ దూబే ఫేవరెట్ హీరో ఎవరంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరో అని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే  తెలిపాడు. హిందీ డబ్బింగ్‌లోనూ తాను తెలుగు సినిమాలు చూస్తానని, ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలను అస్సలు మిస్ అవ్వనని పేర్కొన్నాడు. సూపర్ స్టార్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనలోని గ్రేస్ తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.

February 26, 2026 / 12:39 PM IST

తెనాలిలో రేపు ఆయేషా మీరా అంత్యక్రియలు

GNTR: ఆయేషా మీరా అస్థికలను సీబీఐ తల్లిదండ్రులకు అప్పగించనుంది. రేపు తెనాలిలో భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. కేసులో దర్యాప్తు విఫలమైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఆశాభావం తెలిపారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి డిసెంబర్ 27ను సంస్మరణ దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

February 26, 2026 / 12:38 PM IST

నూనె పంటల సాగులో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానం: కలెక్టర్

వికారాబాద్ జిల్లాలో నూనె పంటల సాగులో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ గురువారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మరియాపూర్ గ్రామంలో భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. వికారాబాద్‌లో 2,26,000 ఎకరాల్లో కుసుమ నూనె పంటలు సాగుతున్నాయని కలెక్టర్ అన్నారు.

February 26, 2026 / 12:38 PM IST

స్టేషన్ ఘనపూర్ లో “Arrive Alive” కార్యక్రమం

JN: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో CI ఆధ్వర్యంలో “Arrive Alive” రోడ్డు భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CI జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడిపిన డ్రైవర్లను అభినందిస్తూ వారికి రోజా పువ్వులు అందజేశారు. CI మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని CI అన్నారు.

February 26, 2026 / 12:36 PM IST

నార్నూరులో పర్యటించిన నీతి ఆయోగ్ బృందం

ADB: నార్నూర్ మండలంలో గురువారం కేంద్ర నీతి ఆయోగ్ బృందం పర్యటించింది. ఆస్పిరేషనల్ బ్లాక్‌గా నార్నూర్ ఎంపికైన సందర్బంగా జాండ, గుంజాల గ్రామాల్లోని పలు పాఠశాలలను సందర్శించారు. అధ్యాపకుల బోధన విధానాన్ని పరిశీలించి విద్యార్థులు సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బృందం ప్రతినిధి అన్నేక మాఝి, డీఆర్డీవో రవీందర్, ఎంపీడీవో పుల్లారావు పాల్గొన్నారు.

February 26, 2026 / 12:36 PM IST

‘చెత్తను కార్మికులకు ఇవ్వాలి’

MNCL: చెత్తను మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు కౌన్సిలర్ రాజు కోరారు. గురువారం ఉదయం ఆ వార్డులోని పలు కాలనీలలో చెత్తతో పేరుకుపోయిన డ్రైనేజీలను మున్సిపల్ కార్మికుల సహాయంతో శుభ్రం చేయించారు. డ్రైనేజీలలో చెత్త వేస్తే మురికి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి రోడ్డుపై ప్రవహిస్తుందన్నారు. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.

February 26, 2026 / 12:35 PM IST