• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కోటగుళ్లలో భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు

BHPL: ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శుక్రవారం భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు వారిచే పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేసి అనంతరం ఆలయ పరిరక్షణ కమిటీ తరుపున ఘనంగా సత్కరించారు.

February 27, 2026 / 04:33 PM IST

ఉగాదికి ముందే 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు: CM

AP: ఈ ఏడాది ఉగాదికి ముందే 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తామని CM చంద్రబాబు అన్నారు. ‘ఏడాది చివరినాటికి 10.6 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం. YCP హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోంది. హౌసింగ్‌లో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం కూడా నిధులు ఇస్తోంది. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు వివరాలు సేకరించాలి’ అని అధికారులకు సూచించారు.

February 27, 2026 / 04:33 PM IST

ఇదంతా బీజేపీ పొలిటికల్ గేమ్: జగ్గారెడ్డి

TG: కవితకు లిక్కర్ స్కాం కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. ఇది బీజేపీ పొలిటికల్ గేమ్ అని అన్నారు. లిక్కర్ మాఫియా గురించి మొదట మాట్లాడింది బీజేపీనే అని అన్నారు. అవసరం ఉంటే ఒక తీరు.. అవసరం లేకుండా మరో తీరులా బీజేపీ ఉంటుందన్నారు. శత్రువు దోస్త్.. దోస్త్ శత్రువు కావొచ్చన్నారు.

February 27, 2026 / 04:33 PM IST

డీసీసీబీ కాలనీలో పర్యటించిన కలెక్టర్

SKLM: నగరంలోని డీసీసీబీ కాలనీలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శుక్రవారం పర్యటించారు. కాలనీలో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త సేకరణ పై ప్రజల్లో అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య పనుల నాణ్యతను తనిఖీ చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

February 27, 2026 / 04:32 PM IST

రేపు జరుగుమల్లికి మంత్రి రాక..!

ప్రకాశం: జరుగుమల్లి మండలం దావగూడూరు గ్రామంలో రేపు ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమానికి కొండేపి ఎమ్మెల్యే, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి రానున్నారని జరుగుమల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది, మండల నాయకులు, ప్రభుత్వ అధికారులు, గ్రామస్థులు పాల్గొనాలని తెలిపారు.

February 27, 2026 / 04:32 PM IST

బస్తీ వాసులను కలిసిన కేంద్ర మంత్రి

HYD: సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలోని బౌద్ధ నగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పేదల సంక్షేమం, స్థానికుల మౌలిక సమస్యలపై బస్తీ వాసులను స్వయంగా కలుసుకొని వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. డివిజన్‌లో, బస్తీలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

February 27, 2026 / 04:31 PM IST

‘రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి’

BDK: రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని సుజాత నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ డిమాండ్ చేశారు. యాసంగి వరి నాట్లు పూర్తి అయి రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను విడుదల చేయడంలో జాప్యం చేయడం తగదని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు అనంతరం రైతుబంధు ఇస్తామని హడావిడిగా ప్రకటించిన ప్రభుత్వం ఎటు పోయిందన్నారు.

February 27, 2026 / 04:31 PM IST

చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత

HYD: ప్రముఖ చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ (90) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో చిలుకూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1981లో ఏపీ ప్రభుత్వం ఈయనను ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుతో గౌరవించింది. చిలుకూరు ఆలయంలో హుండీ లేకపోవడం, VIP దర్శనాలు లేకుండా అందరికీ ఒకే క్యూలైన్ వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు.

February 27, 2026 / 04:31 PM IST

నిధులపై పారదర్శకత ఉండాలి: మేకల నాగరాజు

SRPT: చెన్నకేశవపురం పంచాయతీ ఆదాయ, వ్యయాల వివరాలను బహిర్గతం చేయాలని బీజేపీ మండల మాజీ ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. 2024-25 నిధులు, పన్నుల వసూళ్లు, కుక్కల బెడద నివారణ చర్యల వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి ఈ వివరాలు వెల్లడించారు.

February 27, 2026 / 04:30 PM IST

310 మంది విద్యార్థులు గైర్హాజరు

AKP: జిల్లాలో శుక్రవారం జరిగిన 27 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 310 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 3,321 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,011 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.

February 27, 2026 / 04:30 PM IST

మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

MNCL: చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి మంత్రి వివేక్ వెంకటస్వామి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు పార్టీలో చేరినట్లు తెలిపారు.

February 27, 2026 / 04:30 PM IST

ఎమ్మెల్యే లోకం నాగ మాధవి రేపటి షెడ్యూల్

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం ఉదయం 8 గంటలకు భోగాపురం మండలం, గుడివాడ పంచాయతీ వద్ద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు ముంజేరు సచివాలయాలకు ట్రైసైకిల్స్ పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయం వారు తెలిపారు.

February 27, 2026 / 04:30 PM IST

ఈతకు వెళ్లి యువకుడు మృతి

KDP: పులివెందుల సమీపంలోని అంబకపల్లె రోడ్డు వద్ద ఉన్న కాలువలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి శ్రమ అనంతరం ఫైర్ సిబ్బంది శుక్రవారం మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

February 27, 2026 / 04:30 PM IST

జీలకర్రతో గ్యాస్ సమస్యలకు చెక్..!

జీలకర్ర జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసి మరిగించి, ఆ కషాయాన్ని తాగితే కడుపులో గ్యాస్ సమస్యలు వెంటనే మాయమవుతాయి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చాలా అవసరం. వేసవిలో శరీర వేడిని తగ్గించడానికి జీలకర్ర పొడిని మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా శక్తి కూడా లభిస్తుంది.

February 27, 2026 / 04:30 PM IST

వైకుంఠధామం పునరుద్ధరణకు కాంగ్రెస్ నాయకుల సహకారం

MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 276 డివిజన్ ప్రగతి నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి శ్రీనివాస్ రావు సహకారంతో ప్రగతి నగర్ వైకుంఠధామాన్ని పునరుద్ధరణ పనులు చేపట్టారు. పరిరక్షణ కమిటీ సభ్యులు, ఆలేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా వైకుంఠధామంలో బోర్ రిఫ్రెషింగ్, కొత్త మోటార్, పూల మొక్కలు పనులు చేపట్టామని తెలిపారు.

February 27, 2026 / 04:29 PM IST