• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం మాజీ ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంతరావు పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డ్ కోమటిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో మైనంపల్లి పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 25, 2026 / 06:40 PM IST

ఓపెన్ జిమ్ శిలాఫలకంపై వివాదం

WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందు ఓపెన్ జిమ్ పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేసి హడావుడి చేశారు. కేవలం ఎన్నికల ప్రచార కోసమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బుధవారం ఎన్నికలు పూర్తయ్యాక ఆశిలాఫలకాన్ని పక్కకు తొలగించి పాత మున్సిపాలిటీ భవనంలో ఉంచినట్లు స్థానికులు తెలిపారు. ఇట్టి దృశ్యాలు సామాజికమద్యంలో వైరల్ గా మారాయి.

February 25, 2026 / 06:38 PM IST

SL vs NZ: ప్లేయింగ్-11

NZ: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్SL: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక(c), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక

February 25, 2026 / 06:38 PM IST

GWMC కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సందర్శించారు. కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో ఎమ్మెల్యే భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అనంతరం కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమావేశమై మాట్లాడుతూ.. ప్రతిరోజు సాయంత్రం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

February 25, 2026 / 06:38 PM IST

‘భూగర్భ డ్రైనేజీ పనులు వేగంగా పూర్తి చేయాలి’

MDCL: మల్కాజ్‌గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్, బలరాం నగర్ వాటర్ వర్క్స్ మేనేజర్ నవీన్‌ను వాజ్పేయి నగర్ కార్యాలయంలో కలిశారు. మంజూరైన భూగర్భ డ్రైనేజీ పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. పాడైన మాన్ హోల్ కవర్లు తక్షణం బాగుచేయాలని సూచించారు. రాబోయే వేసవిలో మంచినీటి సరఫరా అంతరాయం లేకుండా రిజర్వాయర్ల మోటార్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

February 25, 2026 / 06:38 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఏసీపీ, సీఐ

SDPT: గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్ హబ్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాలను గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సీఐ రవికుమార్ సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. పిల్లలు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.

February 25, 2026 / 06:37 PM IST

పొన్నూరులో సింగిల్ నంబర్ జూదంపై పోలీసుల దాడి

GNTR: పొన్నూరు పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ సమీపంలో ఆన్‌లైన్ ద్వారా సింగిల్ నంబర్ జూదం నిర్వహిస్తున్న వెంకటరామ సుబ్బారావును గుంటూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి రూ.2,500 నగదు, ఓ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి చర్యల కోసం నిందితుడిని స్థానిక అర్బన్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

February 25, 2026 / 06:35 PM IST

జిల్లా అభివృద్ధికి కృషి: కలెక్టర్

ASR: జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో జిల్లాలో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. అందుబాటులో ఉన్న వాటితో, పక్కా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో నీతి అయోగ్ ప్రోగ్రాంలో భాగంగా సంపూర్ణత అభియాన్ 2.0 నిర్వహించారు.

February 25, 2026 / 06:34 PM IST

ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు

BHNG: యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహరాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

February 25, 2026 / 06:34 PM IST

నీటిని విడుదల చేసిన ఛైర్మన్ నరసింహారెడ్డి

JN: వెల్దండ రిజర్వాయర్ నుంచి నర్మెట్ట, అమ్మాపురం, అక్కరాజుపల్లి, తరిగొప్పుల గ్రామాలకు కొమురవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ గంగం నరసింహారెడ్డి నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు రుణమాఫీ చేసినట్లు ఛైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

February 25, 2026 / 06:34 PM IST

ఆప్కాస్ కార్మికులతో ఎమ్మెల్యే మాధవి చర్చలు

KDP: తమ డిమాండ్ల పరిష్కారానికి గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ఆప్కాస్ కార్మికులతో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చర్చలు నిర్వహించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సానుకూల పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

February 25, 2026 / 06:34 PM IST

న్యూజిలాండ్‌పై టాస్ గెలిచిన శ్రీలంక

T20 WCలో భాగంగా కొలంబో వేదిగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గ్రూప్-2లో ఇప్పటికే లంక తమ తొలి మ్యాచ్ ఓడగా.. పాక్, కివీస్ మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఈ క్రమంలో ఇవాళ విజయం సాధించడం ఇరుజట్లకు తప్పనిసరిగా మారింది. ఓడిన జట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

February 25, 2026 / 06:33 PM IST

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్

KNR: ప్రజల ఫిర్యాదుల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన నూతన రిసెప్షన్, గ్రీవెన్స్ సెల్‌ను సిపి గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఉల్లంఘనలు, చలాన్లపై వాహనదారులు ఇక్కడ నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులకు నిర్ణీత కాలంలో న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

February 25, 2026 / 06:30 PM IST

‘గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి’

SRCL: గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.

February 25, 2026 / 06:30 PM IST

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించిన ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం విస్తృతంగా ప్రకటించారు. ముందుగా స్వయం సహాయక సంఘాల కోసం కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం ఇటీవల ప్రారంభించిన మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడపడమే లక్ష్యం అన్నారు.

February 25, 2026 / 06:30 PM IST