• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బోధనా పరికరాలపై టీచ్ టూల్ శిక్షణకు శ్రీకారం

అన్నమయ్య: రాయచోటిలోని డైయెట్‌లో బోధనా పరికరాల ఆధారిత తరగతి గది పరిశీలన అంశంపై ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ టీచ్ టూల్ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ ప్రతినిధులు పండవుల సాయిరామ్, నాగేంద్ర, కోర్స్ కోఆర్డినేటర్ మదితాటి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:07 PM IST

పోలీస్ వాహనాలు ఫుల్ కండిషన్‌లో ఉండాలి: ఎస్పీ

SRD: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఎహెచ్‌వోతో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అత్యవసర సమయాల్లో పోలీసులు వేగంగా స్పందించాలంటే వాహనాల నిర్వహణ బాధ్యతాయుతంగా ఉండాలని డ్రైవర్లకు సూచించారు. ప్రతి వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలని, మెకానికల్ కండిషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

February 28, 2026 / 08:07 PM IST

‘సమాజం కోసం నిరంతరం విధులు నిర్వర్తించేది పోలీసులే’

PDPL: తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులేనని, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన Slలు నక్క శామ్యూల్, నూనె శ్రీనివాస్, ASI వెంకటేష్ బాబు, హెడ్ కానిస్టేబుళ్లు అలీముద్దీన్, విజయేందర్ రెడ్డి కుటుంబాలను ఆత్మీయంగా సన్మానించారు.

February 28, 2026 / 08:05 PM IST

కందుకూరులో మంచినీటి పథకం కోసం రూ.19 కోట్లు: MLA

NLR: కందుకూరు మున్సిపాలిటీ శివారు ప్రాంతాలలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం రూ.19 కోట్లు మంజూరు చేసిందని MLA నాగేశ్వరరావు అన్నారు. శనివారం కందుకూరులో ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తైనట్లు పేర్కొన్నారు. త్వరలో శివారు ప్రాంత వాసుల మంచి నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

February 28, 2026 / 08:05 PM IST

ఉద్యోగులకు పదోన్నతి పత్రాలు అందజేత

MNCL: కాసిపేట 1 ఇంక్లైన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు శనివారం పదోన్నతి పత్రాలు అందజేశారు. గని మేనేజర్ సతీష్, AITUC బెల్ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్‌లు ఏడుగురు ఓవర్ మన్ ఉద్యోగులకు హెడ్ ఓవర్ మన్‌గా పదోన్నతి పత్రాలు అందించారు. రక్షణ అధికారి రవీంద్ర నిఖిల్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సుమన్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్, తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:04 PM IST

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ పాత్ర కీలకం: SP

ADB: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల పాత్ర కీలకమని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తెలిపారు. 42 సం.లు విధి నిర్వహణ చేసి పదవీ విరమణ పొందిన అధికారి స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్‌ను శనివారం SP అఖిల్ మహాజన్ ఘనంగా సత్కరించారు. ఆయురారోగ్యాలను కాపాడుకుంటూ వ్యాయామం చేస్తూ శేష జీవితాన్ని గడపాలని SP అఖిల్ మహాజన్ కోరారు.

February 28, 2026 / 08:04 PM IST

అంగన్వాడీ టీచర్ లేక.. ఆయానే అన్ని..!

VKB: కొండాపూర్ అంగన్వాడీ కేంద్రానికి టీచర్‌ను నియమించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత కొంతకాలం క్రితం విధులు నిర్వహించిన అనారోగ్య కారణాల వల్ల మృతి చెందింది. అంగన్వాడీ కేంద్రంలో సుమారు 20 మంది పిల్లలు వరకు ఉన్నారు. అయితే ఆయానే పిల్లలను చూసుకుంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంగన్వాడీ టీచర్లను నియమించాలని పలువురు కోరుతున్నారు.

February 28, 2026 / 08:04 PM IST

ప్రసన్న కాకాణిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే

NLR: వైసీపీ నాయకుల దగ్గర డబ్బులు లేక అడుక్కుని రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విమర్శించారు. కొడవలూరులో ఆమె మాట్లాడారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజవర్గంలో అడుగుపెట్టని కాకాణి తాము డబ్బులు ఉన్న వాళ్ళమ్మని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ కుటుంబం నుంచి కూడా రాజకీయాల్లోకి మహిళా వస్తుందని గుర్తుపెట్టుకుని మాట్లాడాలన్నారు.

February 28, 2026 / 08:03 PM IST

పేలుడు ఘటన.. స్పందించిన వైద్యురాలు

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు స్పందించారు. 9 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారని, అందులో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని వెల్లడించారు. బాధితులందరికీ చికిత్స అందిస్తున్నామని, వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని స్పష్టం చేశారు. అత్యవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తామని తెలిపారు.

February 28, 2026 / 08:02 PM IST

రామేశ్వర్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

KMR: భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సర్పంచ్ చేపూరి రాణి-రాజు, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:02 PM IST

క్షత్రగాత్రులను పరామర్శించిన ఎంపీ

KKD: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పరామర్శించారు. ప్రతి బాధితుడి పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలంటూ వైద్యులను స్పష్టంగా ఆదేశించారు.

February 28, 2026 / 08:02 PM IST

‘ఇతరుల హక్కులకు భంగం కలిగించవద్దు’

NLG: చిట్యాల మండలం వట్టిమర్తిలో శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని సూచించారు. విద్యార్థులు అంబేద్కర్ ఆశయాలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. జీపీవో శాంతి, సర్పంచ్ మేడి శ్రీలత పాల్గొన్నారు.

February 28, 2026 / 08:01 PM IST

‘ప్రజలు సంతృప్తి చెందే దిశగా వైద్య సేవలందించాలి’

PPM: ఆసుపత్రికి వచ్చే రోగుల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని, తిరిగి వారు సంతృప్తి వ్యక్తం చేసే దిశగా వైద్య సేవలు అందించాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. జగన్నాధపురం పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. తొలుత హెచ్.పి.వి వ్యాక్సిన్ లాంచింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వైద్య అధికారులు, సిబ్బందితో కలిసి వీక్షించారు.

February 28, 2026 / 08:00 PM IST

క్రియాశీల సభ్యత్వంపై జనసేన సమావేశం

VSP: జనసేన పార్టీ నగర కార్యాలయంలో క్రియాశీల (ఉద్యమి) సభ్యత్వ నమోదుపై శనివారం ముఖ్య సమావేశం జరిగింది. నగర (పార్లమెంట్) అధ్యక్షుడు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తూర్పు, ఉత్తర నియోజకవర్గాల నాయకులతో చర్చించారు. సభ్యత్వంపై కార్యకర్తల సందేహాలు తెలుసుకుని నివృత్తి చేశారు. ప్రతి కార్యకర్త ఉద్యమి సభ్యత్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలన్నారు.

February 28, 2026 / 08:00 PM IST

కిడ్నీ బాధితులకు అండగా ఎమ్మెల్యే శిరీషాదేవి

ASR: ఉర్లకులపాడులో కిడ్నీ బాధితులను ఎమ్మెల్యే శిరీషాదేవి పరామర్శించారు. ఇక్కడ ఆరుగురు మరణించినా, నీటి నమూనాలు సురక్షితమేనని, అపోహలు వద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం, గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 08:00 PM IST