SKLM: రైతు గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ వర్మ అన్నారు. నందిగాం మండల పరిధిలోని చిన్నలవుని పల్లి, నౌగాం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రాయితీలు పొందేందుకు గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు.
TG: పరీక్షలు జరిగే రోజుల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా RTC ప్రత్యేక చర్యలు చేపట్టింది. పదో తరగతి, ఇంటర్ హాల్ టికెట్లు చూపిస్తే కోరిన చోట బస్సు ఆపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనుండటంతో.. పరీక్షల సమయంలో అదనంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే గూండాలా, రౌడీలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన వ్యక్తి వయసు 65 ఏళ్లు ఉంటుందన్నారు.
BPT: అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే సాంబశివరావు క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఇసుకదర్శిలోని కార్యాలయంలో, ఇంకొల్లు గ్రామానికి చెందిన షేక్ చాందిని వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.3,02,598 విలువైన ఎల్‌ఓసీ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
GNTR: జీజీహెచ్‌లో కుక్కకాటుకు గురై చికిత్స పొందుతున్న చిన్నారులను వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మంగళవారం పరామర్శించారు. నల్లచెరువు వద్ద కుక్కల దాడిలో గాయపడిన ఫణీంద్ర రెడ్డి, షేక్ ఆయన్‌ల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకు ఆమె ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
PLD: మాచర్ల విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ హఠాన్మరణం చెందిన హుస్సేన్ కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. అందరూ కలిసి సేకరించిన రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మంగళవారం పల్నాడు జిల్లా ఎస్‌ఈ డాక్టర్ విజయకుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తా మన్నారు.
ప్రకాశం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రకాశం జిల్లా దర్శిలో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
CTR: విజయవాడలోని జరిగిన ఏపీ శాసనసభక్రీడా పోటీల్లో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు. మంగళవారం జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో ఆయన ప్రతిభకనబరిచి రెండో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తమిళ చిత్రం ‘హాట్‌స్పాట్: 2 మచ్’ తెలుగు వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఈనెల 27 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రియా భవానీ శంకర్, భాస్కర్, తంబి రామయ్య, అశ్విన్ కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. సమాజంలోని సున్నితమైన అంశాలను దర్శకుడు ఈ సినిమాలో వెండితెరపై ఆవిష్కరించాడు.
AP: రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మరి కొందరికి డిప్యూటీ కలెక్టర్లుగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్‌పై పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు.
TG: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హతా పిటిషన్లపై ఈనెల 27, 28 తేదీల్లో విచారణ జరగనుంది. ఈ నెల 27 దానంపై దాఖలైన పిటిషన్ విచారణ చేపట్టనున్నారు. ఆయన తరఫున స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సాక్ష్యాలు నమోదు చేయనున్నారు. ఈ నెల 28న కడియంపై దాఖలైన పిటిషన్ విచారించనున్నారు. ఆయన తరఫున కూడా స్పీకర్ సాక్ష్యాలు సమర్పించనున్నారు.
TG: గ్రామీణ ప్రజలకు నిరంతర, నాణ్యమైన తాగునీటి సరఫరా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. తాగునీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ సోర్స్ పాయింట్లు, రిజర్వాయర్లలో నీటి లభ్యత, గ్రామాల వారీగా సరఫరా పరిస్థితులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వలో ఉందని, వేసవిలోనూ పెద్ద ఇబ్బందులు ఉండవని అన్నారు.
AP: కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిర్మాణాత్మకంగా ఉండాల్సిందిపోయి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ‘అసెంబ్లీకి రాకుండా వైసీపీ నేతలు బయట రాజకీయాలు చేస్తున్నారు. శాఖలపై మంత్రులు గ్రిప్ పెంచుకోవాలి. మంత్రులతో సమాధానాలు చెప్పించే బాధ్యత పయ్యావులదే. అసెంబ్లీలో చర్చ సమయంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో గమనిస్తున్నా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా #SavePunarvika అనే మాటే వినిపిస్తోంది. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడే జోల్‌జెన్‌స్మా ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు. ఇతర మందుల్లా ఇది జీవితాంతం వాడక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క డోస్‌తో వ్యాధిని నయం చేస్తుంది. అమెరికాలో తయారు చేసే ఈ మందు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది కావడానికి కారణం దీని సంక్లిష్టమైన తయారీ విధానమే.