• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి లోకేష్

AP: అసెంబ్లీని సందర్శించిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో మంత్రి లోకేష్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ, అమ్మలాంటి మాతృభాష తెలుగును మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దని ఆయన విద్యార్థులకు హితవు పలికారు.

February 25, 2026 / 06:30 PM IST

ALERT: పలు ప్రాంతాల్లో వర్షం

TG: HYDలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలిలో వర్షం పడుతుంది. తేలికపాటి వర్షమేనని, గరిష్టంగా 5-10 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. వాహనదారులు జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని సూచించారు.

February 25, 2026 / 06:28 PM IST

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల నెరవేర్పు – ఎమ్మెల్యే

HNK: ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం, గూడెప్పాడు, మల్కపేట గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులను శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు.

February 25, 2026 / 06:28 PM IST

ధన్వాడ ఎస్సైగా వెంకటేష్ గౌడ్

NRPT: ధన్వాడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా వెంకటేష్ గౌడ్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్ వీఆర్ నుంచి ధన్వాడకు వెంకటేష్ గౌడ్ బదిలీపై వచ్చారు. ధన్వాడ ఎస్సై రాజశేఖర్ రాజాపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకై కృషి చేస్తానని తెలిపారు.

February 25, 2026 / 06:27 PM IST

అలంపూర్ ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

GDWL: అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా క్యాంప్ ఆఫీసులో 46 మంది లబ్ధిదారులకు రూ.4.66 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 25, 2026 / 06:27 PM IST

సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎంపీ

సంగారెడ్డి జిల్లా కొల్లూరు వద్ద నిర్మిస్తున ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 2 సర్వీస్ రోడ్డు నిర్మాణం పనులను ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బుధవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు.

February 25, 2026 / 06:26 PM IST

కొలతలలో తేడా వస్తే చర్యలు తప్పవు: ఇన్‌స్పెక్టర్

KRNL: తుగ్గలి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలు రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసే సమయంలో తూకాలలో, కొలతలలో తేడాలు చేస్తే చర్యలు తప్పవని ఆదోని డివిజన్ తునికి, కొలతల ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం దస్తగిరికు చెందిన ఎస్ఎస్ ట్రేడర్ షాప్లో ఆయన తూకాలు వేసే ఎలక్ట్రికల్ కాటా మిషన్లను తనిఖీ చేశారు.

February 25, 2026 / 06:25 PM IST

బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలి: కలెక్టర్

NRML: జిల్లాలో బాల్యవివాహాలు,మాదక ద్రవ్యాల వినియోగం,రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గత సంవత్సరం 45, ఈ ఏడాది 2 బాల్యవివాహాలను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 06:25 PM IST

కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

MHBD: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమ్మయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి చేరుకున్న సందర్భంగా వారిని ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోని తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

February 25, 2026 / 06:24 PM IST

క్రీడ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

WNP: తెలంగాణ క్రీడా స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్ మరి ఆదేశాలు మేరకు జిల్లా నుంచి 10 మంది బాలురు,10 మంది బాలికలు 4వ తరగతి ప్రవేశానికి వనపర్తి జిల్లాలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు యువజన అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. అర్హులైన వారు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్‌సైట్లో http:/tgss.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 06:24 PM IST

120 ఎకరాలు ఆయిల్ ఫామ్

MDK: నిజాంపేట మండలంలో 120 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు గుర్తించినట్లు లీవ్ ఫామ్ రిసోర్సెస్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ సుజాత తెలిపారు. నార్లాపూర్‌లో నారాయణ, లక్ష్మి రైతుల భూముల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేపట్టారు. ఆయిల్ ఫామ్ తోటల ప్లాంటేషన్ చేసిన రైతులు సబ్సిడీ అందజేస్తున్నట్లు వివరించారు. రైతులు ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు.

February 25, 2026 / 06:24 PM IST

పోలీసులపై మాజీ ఎమ్మెల్యే ఫైర్

NGKL: పోలీసులపై మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారుల పేర్లు పింక్ బుక్లో రాస్తామన్నారు. అత్యుత్సాహం చూపిన ఏ పోలీసు అధికారిని వదిపెట్టామని హెచ్చరించారు.

February 25, 2026 / 06:23 PM IST

ఫోన్‌లో సిమ్ ఉంటేనే వాట్సాప్..!

భారత యూజర్ల కోసం వాట్సాప్ సిమ్ వెరిఫికేషన్‌ను తెస్తోంది. దీంతో సైబర్ నేరాలకు చెక్ పెట్టనుంది. ఇప్పటివరకు ఫోన్‌లో సంబంధిత అకౌంట్ సిమ్ లేకపోయినా వేరే డివైజ్‌లో ఆ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో వాట్సాప్‌లో లాగిన్ కావొచ్చు. దీంతో వేరే వ్యక్తులు వాట్సాప్ వాడుకునే అవకాశం ఉంది. కొత్త వెరిఫికేషన్‌తో సిమ్ ఫోన్‌లో ఉంటేనే లాగిన్ అవకాశం ఉంటుంది.

February 25, 2026 / 06:23 PM IST

పల్లా క్రికెట్ టీంలో ఎమ్మెల్యే

PPM: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కబడ్డీ, టేక్ ఆఫ్ వారు వంటి ఆటలు పూర్తికాగా బుధవారం క్రికెట్ పోటీలు సందడిగా సాగాయి. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కెప్టెన్‌గా వ్యవహరించిన టీంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రికెట్లో సత్తా చాటారు.

February 25, 2026 / 06:22 PM IST

‘విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావద్దు’

MNCL: పదవ తరగతి విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావద్దని పీఎంశ్రీ పాఠశాలల వ్యక్తిత్వ వికాస నిపుణులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ అన్నారు. బుధవారం భీమారంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో, పరీక్ష రోజు ఎలా చదవాలో జ్ఞాపకశక్తి పెంచుకునే పద్ధతులను నేర్పించారు.

February 25, 2026 / 06:20 PM IST