AP: ఏటా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, పోస్టుల హేతుబద్ధీకరణకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. టీచర్ల బదిలీలకు మే 30 వరకు ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకోనున్నారు. ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టుల హేతుబద్ధీకరణ జరగనున్నట్లు సమాచారం.
CTR: గంగవరం మండలం వైయస్సార్ జంక్షన్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. కారు బెంగళూరు నుంచి తిరుపతి వైపునకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తూ.గో: రంగంపేట మండలం ఈలకొలనులో సైకిల్ రిపేర్ వివాదంలో దుకాణ యజమాని వెంకటేశ్వరరావుపై దాడి జరిగింది. అంచురి అరుణ్ కుమార్ రూ.500 అడ్వాన్స్ ఇచ్చి రిపేర్ చేయించారు. తరువాత అదనంగా రూ.300 అడగడంతో వాగ్వాదం పెరిగి దాడికి దారితీసింది. కాలికి గాయమైన వెంకటేశ్వరరావు ఆసుపత్రిలో చేరారు. పోలీసులు అరుణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
MNCL: జిల్లా సరిహద్దులో ఉన్న తాండూర్ పోలీస్ స్టేషన్‌లో గత 2 నెలలుగా SI పోస్టు ఖాళీగా ఉంది. గత డిసెంబర్ 30న SI కిరణ్ కుమార్ హాజీపూర్ పోలీసుస్టేషన్‌కు బదిలీ అయ్యారు. మాదారం SI ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. రెగ్యులర్ ఎస్సై లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. SI పోస్టును భర్తీ చేస్తే శాంతిభద్రతలు పరిరక్షించే అవకాశం ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.
KRNL: నందవరం (మం) ముగతి సమీపంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయచూరులోని సైదాపూర్ చక్కర ఫ్యాక్టరీ నుంచి కడప(D) ప్రొద్దుటూరుకు చక్కెర లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ శివకుమార్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. డ్రైవర్తో పాటు క్లీనర్కు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు విచారణ చేపట్టారు.
AP: చోరీకి వచ్చి దొంగ మృతిచెందిన ఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు చోరీకి వచ్చారు. వారిని కాలనీవాసులు వెంటాడటంతో పరిగెత్తుతూ ఓ దొంగ రైల్వే ట్రాక్‌పై పడటంతో తలకు తీవ్రగాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడి మృతిచెందాడు. పరారైన మరో ఇద్దరు దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
RCB తమ హోం మ్యాచులను 5 చిన్నస్వామిలో, 2 రాయ్‌పూర్‌లో ఆడుతుందని ఆ ఫ్రాంచైజీ CEO రాజేశ్ మీనన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఒక ప్లేఆఫ్ మ్యాచ్, అలాగే టోర్నీ ఫైనల్‌కు చిన్నస్వామి ఆతిథ్యమిస్తుందని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సంతోష్ మీనన్ తెలిపారు. దీంతో RCB ఫ్యాన్స్ హర్షం వ్యక్తంచేస్తున్నారు. కాగా 2014, 2016 టోర్నీ ఫైనల్స్ చిన్నస్వామిలోనే జరిగాయి.
WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం లాగే ఈరోజు సైతం పత్తి ధర స్థిరంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,430 ధర పలకగా.. ఈరోజు ఈరోజు సైతం అదే ధర పలికింది. అలాగే, ఎల్లో రకం మిర్చికి రూ.21,000, టమాటా మిర్చికి రూ.38,500, 1048 రకం మిర్చికి రూ.19,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.
NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, గ్రామ కాంగ్రెస్ నేతలు, సామాజిక సేవాకర్త దశరథ, తదితరులు పాల్గొన్నారు.
TPT: రోడ్ల అభివృద్ధిపై ఆర్‌అండ్‌బీ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరులోని నియోజకవర్గాల పరిధిలో మొత్తం 136.19 కిలో మీటర్ల మేర రోడ్లు మరమ్మత్తులు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రూ. 24.24 కోట్లు నిధులు మంజూరైంది.
SDPT: కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారవుతోంది. ఎంపీ రఘునందన్ రావు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్‌ను కలిసి, పనులు పూర్తయిన స్టేషను వెంటనే అందుబాటులోకి తేవాలని కోరారు. దసరాకే ప్రారంభం కావాల్సి ఉన్నా, ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఎంపీ చొరవతో కదలిక రావడంతో ఈ నెలలోనే స్టేషన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
SRPT: కోదాడ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై పశువులు యధేచ్ఛగా తిరుగుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి రంగా థియేటర్ చౌరస్తా వరకు ఉదయం, రాత్రి వేళల్లో రహదారిపై పశువులు అడ్డదిడ్డంగా సంచరిస్తున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్లపై పశువుల సంచారాన్ని నివారించేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
AP: గల్ఫ్ ప్రవాస ఆంధ్రులకు మంత్రి వాసంశెట్టి భరోసా కల్పించారు. ఆయా దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులతో మంత్రి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని.. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. APNRTC హెల్ప్‌లైన్‌తో సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని మంత్రి సూచించారు.
RR: చేవెళ్ల పరిధి మల్కాపూర్‌లోని శ్రీ భువనేశ్వరి సహిత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని మరింత వైభవంగా తీర్చేదిద్దెందుకు దాతల సహకారం అవసరమని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. కళ్యాణ మండపం, కోనేరు నిర్మాణం,హోమగుండం ఏర్పాటు, రాజగోపురం నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ పుణ్యకార్యంలో దాతలు భాగస్వామ్యం కావాలని, తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.