• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటికే భద్రాద్రి సీతారాముల తలంబ్రాలు

ADB: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించింది. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులు రూ. 151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.

February 26, 2026 / 05:02 PM IST

నాగోబా ఆలయంలో షూటింగ్‌లపై నిషేధం

ADB: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రాంగణంలో నూతన వధూవరుల ఫొటో షూటింగ్‌లకు అనుమతి లేదని ఆలయ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. గతంలో షూటింగ్‌లకు అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఏడాది నుంచి నాగోబా దేవస్థానంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు తీయరాదని నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

February 26, 2026 / 05:02 PM IST

డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన MLA

ASF: గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, నూతన సంవత్సర 2026 క్యాలెండర్‌ను ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి గురువారం ఆవిష్కరించారు. MLA మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే TS-TWTU యొక్క ప్రధాన ఎజెండాగా కొనసాగాలని సూచించారు. CRT ఉపాధ్యాయుల సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

February 26, 2026 / 05:01 PM IST

T20 WC: వెస్టిండీస్ అరుదైన రికార్డు

వెస్టిండీస్ జట్టు అరుదైన రికార్డు సాధించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ ప్లేయర్లు హోల్డర్(49), షెపర్డ్(52*) 8వ వికెట్‌కు 89 పరుగులు జోడించారు. దీంతో T20Iల్లో 8వ వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన ICC ఫుల్ మెంబర్ టీమ్‌గా WI రికార్డు సృష్టించింది. అదేవిధంగా 7 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధికంగా 93 పరుగులు చేసిన జట్టుగా కూడా నిలిచింది.

February 26, 2026 / 05:00 PM IST

‘డెకాయిట్’ ఫస్ట్ సింగిల్‌కు టైం ఫిక్స్

టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘రూబారూ’ రిలీజ్‌కు టైం ఫిక్స్ అయింది. FEB 27న సాయంత్రం 6:03 గంటలకు ఈ పాట రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక దర్శకుడు షానీల్ డియో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.

February 26, 2026 / 05:00 PM IST

ఆలయ భూములకు వేలం ఖరారు

AKP: నాతవరం శ్రీగంగాదేవి, నూకాలమ్మ తల్లి ఆలయాల 13 ఎకరాల వ్యవసాయ భూముల పంట కౌలకు గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం జరిగింది. 11 మంది పాటదారులు పాల్గొన్న ఈ వేలంలో గవిరెడ్డి సత్యనారాయణ రూ.1.48 లక్షలకు పాటను పొందారు. ఈ కార్యక్రమంలో ఉమాదేవి, ఈవో సాంబశివరావు పాల్గొన్నారు.

February 26, 2026 / 04:56 PM IST

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

SRPT: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందన్నారు.

February 26, 2026 / 04:55 PM IST

వాహనాల పార్కింగ్‌కు స్థల పరిశీలన

CTR: మార్చి నెలలో పుంగనూరులో ప్రతిష్టాత్మకంగా శ్రీసుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ నేపథ్యంలోనే జాతరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. భక్తుల సౌకర్యార్థం చర్యలు చేపట్టనున్నారు. గురువారం మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, సీఐ సుబ్బరాయుడు సంయుక్తంగా కలిసి వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని పరిశీలించారు.

February 26, 2026 / 04:55 PM IST

ఊట్ల పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారం గ్రామ ప్రభుత్వ పాఠశాలను గురువారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని ఊట్ల పాఠశాలను పరిశీలించారు.

February 26, 2026 / 04:55 PM IST

డూప్లికేట్ గాంధీలు ఉన్నారు: KTR

TG: దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని.. ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురు మంత్రులదేనన్నారు. శత్రుదేశం మీద దండయాత్రకు పోయినట్లు.. 4000 మంది పోలీసులతో పేదల ఇళ్లు కూల్చివేశారని మండిపడ్డారు. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై మంత్రులు కన్నేశారన్నారు.

February 26, 2026 / 04:55 PM IST

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

VKB: ఖాసీంపూర్ తండాకు చెందిన సరితకు పురిటినొప్పులు రావడంతో 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్‌ను నిలిపి ఈఎంటీ అవినాష్ చాకచక్యంగా అక్కడే డెలివరీ చేయగా, సరిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం వారిని తాండూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

February 26, 2026 / 04:54 PM IST

‘చంద్రబాబు స్వార్థ రాజకీయం కోసం వెన్నుపోటు’

AP: రాయలసీమకు సీఎం చంద్రబాబు తీరని అన్యాయం చేశారని తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు లాలూచీ పడ్డారని ఆరోపించారు. జన్మనిచ్చిన సీమకు ఏమీ చేయలేదని ఇంగితం లేదా? అని ప్రశ్నించారు. ‘స్వార్థ రాజకీయం కోసం పిల్లనిచ్చిన మామకైనా.. జన్మనిచ్చిన సీమకైనా వెన్నుపోటు తప్పదు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

February 26, 2026 / 04:54 PM IST

రేపుదివ్యాంగుల కోసం ప్రత్యేక మెగా జాబ్ మేళా

VKB: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటెలెక్ట్యువల్ డిసెబిలిటీస్ ఆధ్వర్యంలో యూత్4జాబ్స్ సాకారం కోసం దివ్యాంగుల ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఫిబ్రవరి 27, 2026న సికింద్రాబాద్‌లోని NIEPID క్యాంపస్‌లో ఈ మేళా జరుగనుంది. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్, దివ్యాంగ ధృవీకరణ లేదా UDID కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలి.

February 26, 2026 / 04:52 PM IST

చేబ్రోలులో పీహెచ్‌సీ భవనానికి శంకుస్థాపన

GNTR: ఎమ్మెల్యే ధూళిపాళ్ల చొరవతో మంజూరైన రూ. 36 లక్షల నిధులతో చేబ్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు మైలా వెంకట రామ రాజు, ఎంపీటీసీ పఠాన్ ఇర్ఫాన్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ డీఈ ఉమా శ్రీనివాసరావు, డాక్టర్ ప్రియాంక, కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 04:50 PM IST

నీట్ పరీక్షకు తగు ఏర్పాట్లు చేస్తున్నాం: కలెక్టర్

కృష్ణా: న్యూఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాకేష్ లఖన్ నీట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే నెల 3వ తేదీన జరగనున్న నీట్ పరీక్షకు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

February 26, 2026 / 04:50 PM IST