• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహిళా కార్పొరేటర్ల వినూత్న నిరసన

విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మహిళా కార్పొరేటర్లు వినూత్న డిమాండ్‌తో నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్ కాలపరిమితి ముగింపు సందర్భంగా కార్పొరేటర్ల కోసం స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తామని మేయర్ ప్రతిపాదించగా, మహిళా సభ్యులు దీనిని వ్యతిరేకిస్తూ ఆటలు కాకుండా విహారయాత్ర ఏర్పాటు చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా ఏకమై తమ డిమాండ్‌ను వినిపించారు.

February 28, 2026 / 03:00 PM IST

కల్తీ పాలు బాధితులకు అండగా ప్రభుత్వం: మంత్రి నిమ్మల

E.G: కల్తీ పాలు ఘటన నేపథ్యంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.

February 28, 2026 / 03:00 PM IST

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నం బట్టివాడకు చెందిన తాటికొండ రవీందర్ అనే వ్యక్తి శనివారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న మృతుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కేంసారం సంపత్ తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

February 28, 2026 / 03:00 PM IST

రాజగోపుర ప్రతిష్టపనలో పాల్గొన్న టీపీసీసీ సభ్యుడు

RR: మహేశ్వరం నియోజకవర్గం, రామకృష్ణ పురం డివిజన్, సౌభాగ్యపురంలో అలివేలుమంగ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానములో రాజగోపుర ప్రతిష్ఠాపన మహోత్సవం, కుంభప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మహాత్సవానికి టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 28, 2026 / 02:59 PM IST

ఆంజనేయస్వామి కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసిన MLA

BPT: చీరాల మండలం ఈపురుపాలెంలో శనివారం ఎమ్మెల్యే కొండయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్టైల్ కట్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న శ్రీ అభయాంజనేయ స్వామి కళ్యాణ మండపానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ అరుణానంద స్వామీజీతో పాటు, భక్తులు పాల్గొన్నారు.

February 28, 2026 / 02:59 PM IST

జడ్పీ పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవం

KRNL: ఆదోని(మం) చిన్న పెండేకల్ గ్రామంలోని జడ్పీ పాఠశాలలో శనివారం హెచ్ఎం శేకన్న ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శేకన్న మాట్లాడుతూ.. అన్ని శాస్త్రాలకు సైన్స్ తల్లిలాంటిదని తెలిపారు. మనిషి జీవితంలో సైన్స్ ఎంతో ప్రాముఖమైనదని తెలిపారు.

February 28, 2026 / 02:59 PM IST

శనగల కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్య గిత్త

NDL: మిడుతూరు మండల కేంద్రంలో NCCF ఏపీ మార్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల నూతన కొనుగోలు కేంద్రాన్ని MLA జయసూర్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి శనగలను ప్రభుత్వం మద్దతు ధర రూ. 5875తో కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 28, 2026 / 02:58 PM IST

జమ్మూకశ్మీర్ కలని నిజం చేసిన స్పీడ్ స్టర్

జమ్మూకశ్మీర్ తొలిసారిగా రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో ఆ జట్టు బౌలర్ అఖిబ్ నబీ దార్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టాడు. క్వార్టర్, సెమీస్‌లో వరుసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఫైనల్లో కూడా 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును దక్కించుకున్నాడు.

February 28, 2026 / 02:58 PM IST

పదవీ విరమణ పొందిన అధికారులకు వీడ్కోలు

ELR: సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో అంకితభావంతో పోలీస్ శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు అధికారులకు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్పీ ప్రతాప్ కిషోర్‌తో పాటు పలువురు అధికారులు వారిని సత్కరించి వారి సేవలను కొనియాడారు. పదవీ విరమణ పొందినా, ఎప్పటికీ మన పోలీస్ కుటుంబంలో సభ్యులేనని శేష జీవితం కుటుంబంతో హాయిగా గడపాలన్నారు.

February 28, 2026 / 02:57 PM IST

మత్స్యకారులకు సహాయ కార్యక్రమం

W.G: నరసాపురం(మం) పీ.ఎం.లంకలో రామకృష్ణ మఠం వారు రూ.2.10 లక్షల నిధులతో చేపట్టిన సహాయ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. మొదటి విడతగా రూ.70 లక్షల వ్యయంతో 100 మంది మత్స్యకారులకు బోట్లు, వలలను పంపిణీ చేయడం జరిగింది. మత్స్యకారులకు జీవనోపాధికి ఉపయోగపడే విధంగా బోట్లు, వలలు అందించడం గొప్ప విశేషం అన్నారు.

February 28, 2026 / 02:56 PM IST

కొమరోలులో పలు పంటలను పరిశీలించిన అధికారి

ప్రకాశం: కొమరోలు మండలంలోని ఓబులాపురం గ్రామంలో గల పలు పంటలను ఉద్యానశాఖ అధికారి శ్వేత శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలో పేనుబంక, తదితర చీడపీడలను నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు అగ్రికల్చర్ అసిస్టెంట్, స్థానిక రైతులు పాల్గొన్నారు.

February 28, 2026 / 02:55 PM IST

గచ్చిబౌలిలో కిషన్ రెడ్డితో రోబో

HYD: నేషనల్ సైన్స్ డే సందర్భంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన విజ్ఞాన్ వైభవ్ 2026 స్పేస్ కన్వెన్షన్ ప్రాజెక్ట్ ఎక్స్ పోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను, ఆవిష్కరణలను పరిశీలించారు. ఇందులో భాగంగా ఓ రోబో ఆయనకు షేక్యాండ్ ఇచ్చి, స్వాగతం పలికింది. కిషన్ రెడ్డి వెంట పలువురు అధికారులు ఉన్నారు.

February 28, 2026 / 02:55 PM IST

శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సూసైడ్.. కారణం ఇదే!

TPT: గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన బూదురు సునీల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పొదలకూరులోని శ్రీచైతన్య స్కూల్లో ఆయన ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు శ్రీచైతన్య స్కూల్ ఏజీఎం నర్ర శ్రీకాంత్ వేధింపులే కారణమని, పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్ చదివించాలన్నదే చివరి కోరికగా లేఖలో పేర్కొన్నారు.

February 28, 2026 / 02:55 PM IST

తాడికొండలో స్వచ్ఛరధాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: తాడికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ‘స్వచ్ఛరధం’ కార్యక్రమాన్ని శనివారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఇళ్లలో సేకరించిన చెత్తను స్వచ్ఛరధం వాహనానికి అందజేస్తే, దానికి బదులుగా నిత్యావసర సరుకులు అందించే విధానాన్ని అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

February 28, 2026 / 02:55 PM IST

‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన సదస్సు

కోనసీమ: డ్రగ్స్‌, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు యువత, విద్యార్థుల జీవితాలను చిత్తు చేస్తున్నాయనీ మండపేట టౌన్ CI సురేష్ పేర్కొన్నారు. శనివారం మండపేట గౌతమి పుర పాలక సంఘం హై స్కూల్ విద్యార్థులుకు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తుకు బానిస కావడం ఎన్నో దుష్పరిణామాలకు కారణమవుతున్నాయన్నారు.

February 28, 2026 / 02:54 PM IST