కోనసీమ: మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరిందని జేఏసీ ఛైర్మన్ కామన ప్రభాకర్ రావు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జేఏసీ పోరాటం ఫలించిందన్నారు. ఈ క్రమంలో సోమవారం జేఏసీని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరిలోకి మండపేట చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
E.G: సీతానగరం మండలం కాటవరంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ పాశాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరారు.
RR: రేపు చంద్రగ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 7:30 గంటల వరకు స్వామివారి సేవలు ముగించి గుడి మూసి వేయడం జరుగుతుందని, తిరిగి సాయంత్రం 7 గంటలకు శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తుల దర్శనాలు బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.
CTR: గుడిపాల మండలంలోని గుడిపాల గ్రామ రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA తండ్రి చెన్నకేశవులు నాయుడు మాట్లాడుతూ.. రైతు బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రైతుల అవసరాలను ముందుగానే గుర్తించి ప్రభుత్వం తగిన యూరియా నిల్వలను సిద్ధం చేసిందని తెలిపారు. ఎలాంటి దళారితనం లేకుండా పారదర్శకంగా పంపిణీ జరుగుతుందన్నారు.
MDK: హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చెరువులు–కుంటల వద్ద ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
VZM: ఈనెల 5వ తేదీన జనని యే జగతికి ఆధారం అనే పేరుతో మహిళా దినోత్సవ వేడుకలు, సాంస్కృతిక ఉత్సవం సన్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం పాఠశాల కరస్పాండెంట్ మామిడి పాక అనిల్ కుమార్‌తో కలిసి ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. 2026 మహిళా దినోత్సవ పురస్కారాన్ని స్వప్న హైందవికి ప్రదానం చేయనున్నారు.
AP: ప్రవచనకర్త గరికపాటి నరసిహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. ‘డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ రాక్షసులు. అంగారక గ్రహంలో మస్క్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. ట్రంప్ ఆధిపత్యం కోసం కనిపించే దేశంపై దండయాత్ర చేస్తున్నాడు. వాళ్లను నాశనం చేయడానికి శ్రీమహా విష్ణువు రావాల్సిందే’ అని పేర్కొన్నారు.
శ్రీకాకుళం నగరంలో డయేరియా కట్టడి లక్ష్యంగా పారిశుధ్య నిర్వహణను జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. సోమవారం పారిశుధ్య నిర్వహణ పనులను , కార్మికుల హాజరును స్వయంగా పరిశీలించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలువల్లో ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పూడికను పూర్తిస్థాయిలో తొలగించాలని ఆదేశించారు.
ADB: ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహిమూద్ సోదరుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం మధ్యాహ్నం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
BHNG: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆసుపత్రిలో వైద్య సేవలు, మౌలిక వసతులు, సిబ్బంది కొరత, మందుల లభ్యతపై సమీక్ష నిర్వహించారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
IND-ENG మధ్య 5న T20 WC సెమీస్ జరగనున్న సంగతి తెలిసిందే. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతానికి ఈ పోరుకు వర్షం ముప్పు లేదు. ఒకవేళ వర్షం పడితే నాకౌట్ మ్యాచ్ కావడంతో రిజర్వ్ డే ఉంటుంది. ఆ రోజూ ఫలితం రాకపోతే.. సూపర్-8 దశలో మెరుగైన స్థానం కలిగిన ENG ఫైనల్‌కు చేరుతుంది. SA-NZ తొలి సెమీస్‌కూ ఇదే పరిస్థితి. రిజర్వ్ డేలో ఫలితం రాకుంటే సఫారీలు తుదిపోరుకు వెళ్తారు.
SRPT: నడిగూడెం మండలం రత్నవరం MPPS పాఠశాలలో ‘ప్రీ-ప్రైమరీ’ (LKG, UKG) తరగతులను నేడు మండల విద్యాధికారి సత్యనారాయణ, సర్పంచ్ నాగేశ్వరరావు ప్రారంభించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆట వస్తువులను, తరగతి గదులను వారు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆటపాటలకు ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు.
ADB: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి, స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు జయంతి వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీపాద రావు సేవలు మరువలేనివని కొనియాడారు.
కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో 20సెకన్ల పాటు కళ్లను మూసి విశ్రాంతి నివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్‌ను కళ్లకు తక్కువ ఎత్తులో ఉండేలా చూసుకోండి. రాత్రివేళల్లో సెల్‌ఫోన్ వాడకం తగ్గించండి. లైటింగ్ వల్ల కంటి చిన్నకండరాలు త్వరగా అలసిపోతాయి. ఏసీ, కూలర్ నుంచి వచ్చే గాలులు నేరుగా కంటిమీద పడనివ్వకండి. గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి.
KMM: ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. పదవ తరగతి చదివే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మోటివేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.