• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రూ. 20.70 లక్షల కూల్-లిప్ స్వాధీనం

అన్నమయ్య: ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా చౌడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 20.70 లక్షల విలువైన నిషేధిత కూల్-లిప్ పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లిలో 150 మంది పోలీసులతో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి, 24 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. డ్రగ్స్, నిషేధిత పొగాకుపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు.

February 26, 2026 / 01:38 PM IST

శాసనమండలి రేపటికి వాయిదా

AP: శాసనమండలి రేపటికి వాయిదా పడింది. తిరుమల లడ్డూ అంశంపై మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇరుపక్షాల నినాదాల మధ్య మండలిని ఛైర్మన్ మోషేన్ రాజు వాయిదా వేశారు. తిరుమల లడ్డూ అంశంపై చర్చించకుండానే వాయిదా పడింది.

February 26, 2026 / 01:37 PM IST

రేపు మండల స్థాయి విజలెన్స్ కమిటీ సమావేశం

CTR: పుంగనూరు తహశీల్దార్ కార్యాలయంలో రేపు మండల స్థాయి విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు MRO రాము గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు.

February 26, 2026 / 01:37 PM IST

ఘనంగా బొడ్రాయి 8 వ వార్షికోత్సవం

RR: శంషాబాద్ మండలం, నర్కూడ గ్రామంలో ఇవాళ బొడ్రాయి ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా, గ్రామ సర్పంచ్ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్రాయికి అభిషేకం చేసి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నర్కూడ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 01:37 PM IST

సర్పంచుల శిక్షణ కార్యక్రమం ముగింపు: కలెక్టర్

NRPT: ఉట్కూర్ మండలంలోని రెండో బ్యాచ్ నూతన సర్పంచులకు ఐదు రోజులపాటు నిర్వహించిన ఓరియంటేషన్ శిక్షణ ముగిసింది. ముగింపు వేడుకలకు కలెక్టర్ సిక్త పట్నాయక్, డీపీవో హాజరై సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. పలు గ్రామాల సర్పంచులతో పాటు మల్లేపల్లి సర్పంచ్ కతలప్ప మాట్లాడుతూ.. గ్రామ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కలిగిందని అన్నారు.

February 26, 2026 / 01:37 PM IST

మున్సిపల్ అభివృద్ధికి నిధుల కోసం వినతి

SRD: నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ శెట్కార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని గురువారం కలిశారు. జాతీయ రహదారి 161 (బీ) నిజాంపేట్-నారాయణఖేడ్ మీదుగా చేపడుతున్న పనులతో పాటు కర్ణాటక సరిహద్దులో మిగిలిన 8 కిలోమీటర్ల రహదారికి నిధులు కేటాయించాలని కోరారు.

February 26, 2026 / 01:36 PM IST

నగరంలో కోకోపిట్, కెమికల్స్‌తో నకిలీ టీ పౌడర్

HYD: నకిలీ టీ పౌడర్ తయారు చేస్తూ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు జగన్నాథ్ పట్టుబడ్డాడు. సింథటిక్ రసాయనాలతో టీ పౌడర్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక కిలో కల్తీ టీ పొడికి 450 గ్రాముల నాణ్యతలేని టీ డస్ట్ ఉపయోగిస్తున్నారని, 500 గ్రాముల నాణ్యతలేని గ్రాన్యూల్స్‌తో పాటు 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ మిక్స్ వాడుతున్నట్లు గుర్తించారు.

February 26, 2026 / 01:36 PM IST

ఇంటర్‌నేషనల్ పోటీలకు వెంకటగిరి యువకుడు

TPT: టర్కీలో జరిగే ఇంటర్‌నేషనల్ గోల్ బాల్ పోటీలకు వెంకటగిరికి చెందిన అంధ యువకుడు ముప్పాళ్ల శేషగిరి ఎంపికయ్యాడు. పాట్నాలో జరిగిన పోటీల్లో ఏపీ తరఫున అతను పాల్గొన్నాడు. అక్కడ ప్రతిభచూపడంతో జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. దీంతో అతడిని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తన కార్యాలయంలో అభినందించారు.

February 26, 2026 / 01:35 PM IST

సినిమా రంగంపై AI ముప్పు: దర్శకుడు దిలీప్ రాజా

GNTR: గుంటూరులో గురువారం జరిగిన ‘మా-ఏపి’ యూనియన్ సమావేశంలో దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల నటీనటులు, సాంకేతిక నిపుణుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. AI వినియోగంపై సెన్సార్ బోర్డు తక్షణమే స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.

February 26, 2026 / 01:35 PM IST

ప్రజా సమస్యల పరిష్కారాననికి వినతి

SRD: పటాన్చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి కోరారు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజనను కలిసి వినతి పత్రం అందజేశారు. బాంబే కాలనీ రైతు బజార్‌లో సింగిల్-బిడ్ దుకాణాలను మహిళా స్వయం సహాయక సంఘాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు 22 నాన్-టెండర్ దుకాణాలను కేటాయించాలని కోరారు.

February 26, 2026 / 01:35 PM IST

కాంగ్రెస్‌లో చేరిన పురాణీపేట్ సర్పంచ్

NZB: భీమగల్ మండలంలోని పురాణీపేట్ సర్పంచ్ బుర్ర సుమ ఆమె భర్త దేవేందర్ గౌడ్ గురువారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన, అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 01:35 PM IST

విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

VKB: ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సకాలంలో పరీక్షా కేంద్రాలకు వెళ్లే విధంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు వికారాబాద్ బస్ డిపో మేనేజర్ నమ్రత తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి.

February 26, 2026 / 01:34 PM IST

‘నీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వర్తించాలి’

కర్నూలు: తాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇంజినీరింగ్ విభాగ అధికారులు, సచివాలయ, తాగునీటి సరఫరా విభాగ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పీ. విశ్వనాథ్ సూచించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగ అధికారులతో పాటు జూమ్ ద్వారా అమినిటీస్ కార్యదర్శులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.

February 26, 2026 / 01:34 PM IST

హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి: ప్రిన్సిపల్ వసుధ

NLR: బుచ్చి మండలం రామచంద్రపురంలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ తరగతులతో పాటు 6 నుండి 10 తరగతుల వరకు అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ వసుధ తెలిపారు. మార్చి 1తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రవేశానికి, 6, 10వ తరగతి ప్రవేశానికి సంబంధించి మార్చి 8వ తేదీన పరీక్షలు జరుగుతాయన్నారు.

February 26, 2026 / 01:33 PM IST

బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా

MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్‌ను మంచిర్యాల జిల్లా న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, సుమన్‌కు సంబంధించిన న్యాయవాదుల వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత రేపటికి వాయిదా వేస్తూ తీర్పు వెలువరించారు.

February 26, 2026 / 01:32 PM IST