MDK: హవేలీ ఘనపూర్ మండలం లింగసాన్ పల్లి వద్ద ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తిమ్మాయిపల్లికి చెందిన మమత, ఆర్యాన్, పరమేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది ప్రవీణ్ కుమార్, కిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కుటుంబ కలహాలపై నటి హేమ మాలిని ఎట్టకేలకు స్పందించింది. నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత సన్నీ డియోల్, బాబీ డియోల్‌లతో తనకు విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తామంతా ఒకే కుటుంబంగా కలిసి ఉన్నామని స్పష్టం చేసింది. ఈ పుకార్లలో నిజం లేదని చెబుతూ వివాదాలకు చెక్ పెట్టింది.
ADB: నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో రెండు నెలల పసికందు మరణానికి కారణమైన శ్రీధర్ రెడ్డి, మధు సుదన్ రెడ్డి అనే నిందితులందరిపై మర్డర్ కేసు నమోదు చేయాలని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పసిపాపను చంపిన కులోన్మాదులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
BPT: ప్రజారక్షణే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రశంసించారు. అసెంబ్లీలో ఏపీలో ‘నో హెల్మెట్–నో ఫ్యూయల్’ అమలు చేయాలని ప్రతిపాదించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ లేక ఇంధనం ఇస్తే ప్రమాదాలు పెరుగుతాయని తెలిపారు.
WNP: ఆత్మకూరు పట్టణంలో గురువారం వాసవి కాలనీలో నూతనంగా నిర్మించిన వాసవి కళ్యాణ మండపాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైశ్య సోదరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు రూ.2 కోట్లతో నిర్మించిన కళ్యాణ మండపం నిర్మించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
KRNL: విజయవాడలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడును ఆలూరు టీడీపీ ఇంఛార్జి వైకుంఠం జ్యోతి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సమావేశంలో ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఇంఛార్జి చర్చించారు. ఈ భేటీ నియోజకవర్గ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించింది.
NZB: జిల్లా సైక్లింగ్ సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన భూలోక విజయ్ కాంత్ రావు ఇవాళ మర్యాద పూర్వకంగా జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్‌ను కలిశారు. DYSO మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సైక్లింగ్ క్రీడ అభివృద్ధి చేయాలని క్రీడ సంస్థ పక్షాన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ELR: దెందులూరులో గురువారం కలెక్టర్ వెట్రి సెల్వి పర్యటించారు. గ్రామస్తులకు పన్నుల చెల్లింపు ప్రాముఖ్యతపై అవగాహన వివరించడంతో స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా ఆన్‌లైన్‌లో హౌస్ టాక్స్‌ను చెల్లించారు. ప్రజలు సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యతగా పన్నులు చెల్లించాలని వారికి సూచించారు.
BHNG: మోత్కూర్-గుండాల ప్రధాన రహదారిలోని బిక్కేరు వాగుపై నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన సింగిల్ లైన్ బ్రిడ్జితో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ దృష్ట్యా ఈ పాత వంతెనపై తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఆర్టీసీ, ప్రైవేటు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు.
NRPT: కానుకుర్తి రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న రైతుల నష్టపరిహారం కోసం సర్పంచ్ నారాయణ ఆధ్వర్యంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరగా.. శివకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం ద్వారా న్యాయం చేస్తానని తెలిపారు.
AP: రాష్ట్రంలో పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. పాల నాణ్యతపై అధికారులు స్పాట్ టెస్ట్ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్నవారిపై కేసులు పెట్టారు.
AKP: ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లికి చెందిన గొర్లె వరహాలమ్మ(55) ఈనెల 23న స్వగ్రామం నుంచి ఆసుపత్రికి ఆటో బయలుదేరి ఎలమంచిలిలో దిగి అదృశ్యం అయింది. చుట్టుపక్కల బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె బంధువు ప్రసాద్ స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై సావిత్రి గురువారం తెలిపారు.
AP: నదుల అనుసంధానం కోసం తాము ప్రయత్నించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వంశధార నుంచి పెన్నా వరకు అనుసంధానం చేయాలని అన్నారు. అప్పుడే రాష్ట్రంలో నీటి సమస్య అన్నది లేకుండా పోతుందని తెలిపారు. గంగ-కావేరి అనుసంధానం జరగాలన్నది తన కోరిక అని వెల్లడించారు. నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇస్తామన్నారు.
KKD: కిర్లంపూడి డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న కె.సాయి కిరణ్ గురువారం మండల మెజిస్ట్రేట్‌గా ఫుల్ అడిషనల్ ఛార్జ్ స్వీకరించారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
TG: మంత్రి ఉత్తమ్ కుమార్‌ను తొక్కినట్లు నన్నూ తొక్కాలనుకుంటున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తనను తొక్కడం రేవంత్ వల్ల కాదన్నారు. తాను ఉత్తమ్ కుమార్ అంత సౌమ్యుడిని కాదని పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చూసుకుంటానని హెచ్చరించారు.