• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అన్నమయ్య: పాత రాయచోటిలో పిచ్చి కుక్క సైరవిహారం

అన్నమయ్య: పాత రాయచోటిలో పిచ్చి కుక్క హల్‌చల్. సోమవారం కుక్క దాడిలో ఇద్దరికీ గాయాలు కాగా, స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు.గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.వీధి కుక్కల బెడదపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 05:01 PM IST

రాయదుర్గంలో రెండు రోజులు నీటి సరఫరా బ్రేక్

అనంతపురం: రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజులపాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. టి వీరాపురం వద్ద పైప్ లైన్ లీకేజీ కారణంగా మరమ్మత్తులో భాగంగా 24, 25వ తేదీలలో నీటి సరఫరా ఉండదని తెలిపారు. కావున రెండు రోజులపాటు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని కోరారు.

February 23, 2026 / 05:01 PM IST

కామారెడ్డి ఎమ్మెల్యేతో ఎంపీ డీకే అరుణ భేటీ

KMR: జిల్లా కేంద్రంలో 5 రోజుల నుంచి నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మహబూబ్ నగర్ MP డీకే అరుణ కామారెడ్డికి చేరుకున్నారు. MLA క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించిన తీరుపై, ఉద్రిక్త పరిస్థితుల గల కారణాలను MLA రమణారెడ్డిని అడిగి తెలుసుకోనున్నారు. ఆయనతో భేటీ అనంతరం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 05:00 PM IST

నగరిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

CTR: పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశాయి. మొదటి విడతగా నగరి మున్సిపాలిటీకి 454 ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తమ కల నెరవేరుతోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 05:00 PM IST

శరవేగంగా పూషడం ప్రధాన రహదారి నిర్మాణం

కృష్ణా: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో ఘంటసాల మండలం పూషడం గ్రామ ప్రధాన రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రూ.కోటీ నలభై లక్షలతో పల్లె పండుగ కార్యక్రమం పురస్కరించుకొని జాతీయ రహదారి-216 నుంచి పూషడం వరకూ మూడు కిలోమీటర్లు ప్రధాన రహదారిలో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

February 23, 2026 / 05:00 PM IST

ములుగు ఎస్పీని కలిసిన ఛైర్మన్, కౌన్సిలర్లు

ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకేన్‌ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, వైస్ ఛైర్‌పర్సన్ ఆసియా షాహిన్ రియాజ్ మిర్జా, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీకి నూతన మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతలో సత్కరించారు. అనంతరం నూతన పాలక వర్గానికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.

February 23, 2026 / 05:00 PM IST

పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ ధర్నా

GNTR: పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ప్రత్తిపాడు సర్పంచ్ వసవర్తి రమాదేవి సోమవారం పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. గతంలో సుమారు రూ.14 లక్షల బిల్లులను డ్రా చేసి గోల్‌మాల్ చేశారని ఆమె ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఎలా డ్రా చేశారో అధికారులు సమాధానం చెప్పాలని, కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 05:00 PM IST

అద్దంకిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

BPT: అద్దంకి మండలం ద్వారకా నగర్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాంసన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

February 23, 2026 / 05:00 PM IST

ది హార్ట్ ఫోర్డ్ ఇండియా కార్యాలయం ప్రారంభం

TG: హైదరాబాద్ నానక్ రాంగూడలో అమెరికా బీమా సంస్థ ‘ది హార్ట్ ఫోర్డ్ ఇండియా’ కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా 1200 మందికి ఉపాధి లభించనుంది. హైదరాబాద్‌ను గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. పరిశ్రమల అవసరాల మేరకు యువతను తీర్చిదిద్దుతున్నామన్నారు.

February 23, 2026 / 04:59 PM IST

‘గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎర్రన్న స్థానం ప్రత్యేకం’

SKLM: గల్లీ నుండి డిల్లీ వరకు ఎర్రన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకమైనదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. తన తండ్రి దివంగత ఎర్రంనాయుడు 69వ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన పలు కార్యక్రమాలలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. అనంతరం నిమ్మాడలోని ఎర్రన్న ఘాట్‌లో కుటుంబ సభ్యులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

February 23, 2026 / 04:59 PM IST

ప్రభుత్వ రివార్డులు ఇప్పించండి: మాజీ మావోయిస్టు

TG: మాజీ మావోయిస్టు వసంత అలియాస్ మమత.. ఇవాళ జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కలిశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ రివార్డులు, పెన్షన్, నివాసం కోసం ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. కాగా, 2000లో తన భర్త పసుల రాంరెడ్డి మరణించిన తర్వాత కూడా ఆమె మావోయిస్టు పార్టీలోనే కొనసాగి.. 2025 జనవరిలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి లొంగిపోయారు.

February 23, 2026 / 04:59 PM IST

వైసీపీ మండల స్థాయి విస్తృత సమావేశం

VZM: రాబోయే ఏ ఎన్నికల్లోనైనా వైసీపీ ఘనవిజయం సాధించి, జెండా ఎగరవేయడం ఖాయమని విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం భీమిలి మండలం అవనాం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీను అధ్యక్షతన జరిగిన మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు.

February 23, 2026 / 04:58 PM IST

‘ప్రతిభ గల పోలీస్ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం’

MNCL: ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను సోమవారం అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు సాధించి శాఖకు మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

February 23, 2026 / 04:58 PM IST

ప్రజావాణిలో 156 దరఖాస్తుల స్వీకరించిన కలెక్టర్

మహబూబాబాద్: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 156 దరఖాస్తులను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్వీకరించారు. ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ కేటాయించి వెంటనే వీటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ ఫిర్యాదుల్లో అత్యధిక శాతం పింఛన్ సదరన్ క్యాంపుకు సంబంధించినవే ఉన్నాయి.

February 23, 2026 / 04:57 PM IST

‘జైలులో సత్ప్రవర్తనతో మెలగాలి’

SKLM: ముద్దాయిలు జైలులో సత్ప్రవర్తనతో మెలగాలని, శిక్షా కాలం ముగిసిన తర్వాత సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. సోమవారం అంపోలులోని జిల్లా కారాగారాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

February 23, 2026 / 04:56 PM IST