WGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కులం పేరుతో రజక కుటుంబంపై జరిగిన దారుణ దాడిని BSF తీవ్రంగా ఖండిస్తోంది. సోమవారం వరంగల్ జిల్లా కేంద్రంలో BSF ఉమ్మడి WGL జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్ మాట్లాడారు. రెండు నెలల పసికందును కాళ్లతో తన్ని చంపిన అగ్రకుల (రెడ్ల) పెత్తందార్లను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
కృష్ణా: పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ములుపూరి గోవింద ప్రభాకర్ రావు మరణించారు. ఆయన అంతిమయాత్ర మంగళవారం ఉదయం 9 గంటలకు కపిలేశ్వరపురం గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభాకర్ రావుకు నివాళులర్పించి.. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అంకితభావంతో సేవలందించారని నాయకులు కొనియాడారు.
NGKL: న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అచ్చంపేట బార్ అసోషియోషన్ న్యాయవాదులు చలో హైదరాబాద్ మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. న్యాయవాదులపై దాడులు, హత్యలు జరగడం దారుణమని బార్ అసోసియోషన్ అధ్యక్షుడు మస్తాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, భాస్కర్ రెడ్డి, రవికుమార్, వెంకటేశ్వర్ రావు, మల్లేశ్ ఉన్నారు.
NZB: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వినయ్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్మన్ గోనె లహరి, వైస్ ఛైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
AP: లడ్డూలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో రేపు దాదాపు 4 గంటలపాటు చర్చించనున్నారు. ఈ క్రమంలో రేపు ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్‌ను రద్దు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించనున్నారు.
SDPT: సిద్దిపేట కలెక్టరేట్ ముందు సీఐటీయు ఆందోళన చేపట్టింది. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చారు. సీఐటీయు ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ వద్దకు విచ్చేశారు. కలెక్టరేట్ కార్యాలయ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
MLG: తాడ్వాయి(మం) కామారం క్రాస్ వద్ద సోమవారం, అతివేగంతో దూసుకొచ్చిన ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఏటూరునాగారం(మం) రామన్న గూడెం స్థానిక నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. రహదారిపై నవీన్ మృతదేహం నుజ్జునుజ్జు అయింది. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. తనముందు హాజరై రాజీనామా కారణాలపై వివరణ ఇవ్వాలని తెలిపారు. వారు రాజీనామా పత్రాలు చేసి చాలా రోజులు అయినప్పటికీ ఛైర్మన్ ఆమోదించలేదని వైసీపీ నేతలు మోషేన్ రాజును కలిశారు. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
TPT: సూళ్లూరుపేటలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంపై తీవ్ర వివాదం చోటుచేసుకుంది. సత్యం జూనియర్ కళాశాలకు చెందిన మొత్తం 233 మంది విద్యార్థుల్లో 227 మందిని ఒకే ప్రైవేట్ కళాశాలలో పరీక్షలు రాయడానికి కేటాయించడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కొన్ని పాఠశాలలు పట్ల వివక్షత చూపుతున్నరన్నారు.
NRML: కోతుల బెడదను అరికట్టాలని ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు, పాలకులు మాత్రం కోతుల నియంత్రణకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు. ఆదివారం కడెం మండలం దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఓ వాహనానికి కోతులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి చెట్టును ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామాల్లో సైతం కోతులు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి.
NRML: కోతుల బెడదను అరికట్టాలని ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు, పాలకులు మాత్రం కోతుల నియంత్రణకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు. ఆదివారం కడెం మండలం దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఓ వాహనానికి కోతులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి చెట్టును ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామాల్లో సైతం కోతులు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి.
KDP: బద్వేల్లో మొదటి రోజు ప్రశాంతంగా పూర్తయిన ఇంటర్ పరీక్షలు ఎస్కేపి జూనియర్ కళాశాల, గౌతమ్, బీజేఎస్ఆర్, శ్రీ గాయత్రి కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై నాగ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసుల సీసీ కెమెరాల నిఘా ఉంచారు.
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమిపై అశ్విన్ తీవ్రంగా మండిపడ్డాడు. జట్టు ఎంపిక సరిగా లేదని కోచింగ్ స్టాఫ్‌ను తప్పుపట్టాడు. జట్టులో నుంచి అక్షర్ పటేల్‌ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదన్నాడు. ‘టీ20ల్లో అక్షర్ అత్యంత విలువైన ఆటగాడు.. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని నిరూపించాడు’ అని పేర్కొన్నాడు. అలాగే, రింకూను జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించాడు.
TPT: ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా వరదరాజ నగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వైద్య సిబ్బంది, త్రాగునీరు, భద్రతా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో ఆర్ & బీ శాఖ పనితీరుపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్న్, నాన్న్, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులతో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు.