• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బిల్డింగ్ పై నుంచి జారిపడిన యువకుడికి గాయాలు

WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలోని పాత ముగ్ధంపురం గ్రామానికి చెందిన నలుమస వంశి (23) శనివారం తెల్లవారుజామున బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడిన యువకుడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బంధువులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 10:09 AM IST

నరసరావుపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్

PLD: నరసరావుపేట క్రిస్టియన్‌పాలెంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు శనివారం తెల్లవారుజామున ఆకస్మిక కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులు.. రౌడీషీటర్లు, పాత నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 31 బైకులు, 2 ఆటోలతో పాటు కత్తులు, గొడ్డళ్లు వంటి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

February 28, 2026 / 10:05 AM IST

ఆయుర్వేద వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలు

NZB: జిల్లా ఆయుష్ విభాగం ఇన్‌ఛార్జ్ డాక్టర్ జే. గంగాదాస్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రాధాకృష్ణ పాఠశాల, ఆర్యసమాజ్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ అనిత, సునీత, ఫార్మాసిస్ట్‌లు పురుషోత్తం, ఉమాప్రసాద్, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.

February 28, 2026 / 10:05 AM IST

వెలుగుమట్ల బాధితులకు పట్టాల ఇళ్లు: కలెక్టర్

KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన వారి సామాజిక ఆర్థిక స్థితిగతులపై సర్వే చేపట్టినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సర్వే నివేదిక ఆధారంగా అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నివాస స్థల పట్టాలు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు. బాధితులు తమ గ్రామాల్లో అందుబాటులో ఉండి సర్వేకు సహకరించాలని సూచించారు.

February 28, 2026 / 10:04 AM IST

నాగార్జున ‘కింగ్ 100’ షూటింగ్ UPDATE

తమిళ దర్శకుడు రా. కార్తీక్‌తో అక్కినేని నాగార్జున తన 100వ మూవీ చేస్తున్నారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ మైసూర్‌లో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 2 వారాలకు పైగా సాగే ఈ షెడ్యూల్‌లో నాగ్‌తో పాటు కీలక సన్నివేశాలపై చిత్రీకరణ జరగనున్నట్లు టాక్. ఇక 2026 ద్వితీయార్ధంలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.

February 28, 2026 / 10:03 AM IST

తర్బూజ్ మామకు.. తెగ డిమాండ్..!

ఎండాకాలం చల్లదనం కోసం పానీయాలు సేవించటం కామన్. వంటికి చలువచేసే తర్బూజ్ సైతం తెగ తినేస్తుంటాం. దీంతో ఎండాకాలం ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. ఫిబ్రవరిలోనే HYD శివారు బాటసింగారం మార్కెట్‌లో డిమాండ్ షురూ అయింది. మొన్నటి వరకు కిలో రూ.30 పలుకగా ఇవాళ రూ. 35 నుంచి రూ. 40 వరకు చేరింది. ఇక మార్చి నెలలో తర్బూజ్ మామకు మరింత డిమాండ్ ఏర్పడనుంది.

February 28, 2026 / 10:03 AM IST

భక్తుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీస్తోంది: హరీష్ రావు

TG: మఠాన్ని కూల్చడమంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ కోకపేట నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠాన్ని హరీష్ రావు పరిశీలించారు. కేసీఆర్ అద్భుతమైన ఆలయాలు నిర్మిస్తే ఈ ప్రభుత్వం అన్నీ కూల్చుతోందని మండిపడ్డారు. ఖమ్మంలో పేదలు ఉంటున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు.

February 28, 2026 / 10:02 AM IST

గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం

CTR: జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ రాజశేఖర్ పర్యవేక్షణలో జిల్లాలోని గ్రామాలలో “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు గ్రామస్తులతో సంభాషించి ధైర్యం-స్పర్శ, మహిళలు మరియు పిల్లలపై నేరాలు, సైబర్ నేరాల జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, బాల్య వివాహాల నివారణపై మార్గ నిర్దేశం చేశారు.

February 28, 2026 / 10:02 AM IST

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: కవింద్ర

BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి GM కార్యాలయంలో ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ యూనియన్‌తో ఏరియా లెవెల్ స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏరియా ఇన్‌ఛార్జి జనరల్ మేనేజర్ కవింద్ర హాజరై మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి పూర్తి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు తదితరులు ఉన్నారు.

February 28, 2026 / 10:02 AM IST

ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్

ప్రకాశం: అర్ధవీడు మండలంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లతోపాటు,గతంలో ఈసీగా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం మార్కాపురం కార్యాలయంలో ఈసీగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి సస్పెండ్ అయ్యారు. అర్ధవీడులో మొక్కలు లేకుండానే బిల్లులు చేశారని లోకాయుక్తకు ఫిర్యాదు మేరకు, విచారణ చేపట్టిన అధికారులు భారీ అవినీతి బయటపడడంతో వారిని సస్పెండ్ చేశారు

February 28, 2026 / 10:01 AM IST

అక్రిడేషన్ల గడువు పెంపు: డిపిఆర్‌వో

WNP: జిల్లాలో ఆయా మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్ట్‌ల అక్రిడేషన్ కాలపరిమితిని ప్రభుత్వం రెండు నెలలు పొడిగించినట్లు డిపిఆర్‌వో సీతారాం తెలిపారు. నేటితో ముగియనున్న కాలపరిమితిని ఏప్రిల్ 30వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్ట్‌లు జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో శనివారం ఉదయం 10:30 నుంచి కార్డులపై స్టిక్కర్లు వేయించుకోవాలని సూచించారు.

February 28, 2026 / 10:01 AM IST

తాగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని తాగునీటి శుద్ధి కేంద్రాన్ని కమిషనర్ లక్ష్మీదేవి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆమె తాగునీటి శుద్ధి కేంద్రంలోని యంత్రాల పనితీరు, నీటి నాణ్యత, పారిశుధ్య పరిస్థితులను తనిఖీ చేసి ప్రజలకు నిరంతరం సురక్షితమైన తాగునీరు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటి శుద్ధి ప్రక్రియ సక్రమంగా జరుగుతోందో లేదో చూడాలన్నారు.

February 28, 2026 / 10:00 AM IST

ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవం

ASR: కొయ్యూరు మండలం చల్దిగెడ్డకు చెందిన నాగులమ్మ అనే నిండు గర్భిణికి శనివారం పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనం రహదారి సౌకర్యం లేక గ్రామ సమీపానికి చేరుకుంది. కుటుంబీకులు గర్భిణీని మోసుకొని వచ్చి, అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ హరి ప్రసాద్ ప్రసవం చేశారు

February 28, 2026 / 10:00 AM IST

జిల్లాలో 58.70 పింఛన్ల పంపిణీ పూర్తి: DRDA

అనకాపల్లి జిల్లాలో ఉదయం 8.52 గంటల వరకు 58.70 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. 76.38 శాతంతో నర్సీపట్నం మండలం ముందంజలో ఉందన్నారు. 47.8 శాతంతో పాయకరావుపేట మండలం చివర స్థానంలో ఉందన్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభించిన పింఛన్లు సాయంత్రంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

February 28, 2026 / 10:00 AM IST

సైనిక్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

VZM: ALL INDIA SAINIK EXAMలో ఎస్.కోట మండలం దొగ్గపేట ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు HM బీ సురేష్ శనివారం తెలిపారు. వజ్రపు శశి కుమార్ 267/300, చుక్కా శశాంక్ 241/300, తొత్తడి రిషిత 227/300 మార్కులు సాధించినట్లు తెలిపారు. వీరి ప్రతిభకు కారణమైన ఉపాధ్యాయులను విద్యార్థులు తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.

February 28, 2026 / 10:00 AM IST