• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గోరికొత్తపల్లిలో కనీస వసతుల లోపం

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలం ఏర్పడి సంవత్సరకాలం దాటినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ATM, బస్ సెంటర్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు కాలేదు. వెంటనే స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని MLA దృష్టికి తీసుకెళ్లి కనీస వసతులు కల్పించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

February 23, 2026 / 02:45 PM IST

కాసేపట్లో కేబినెట్ భేటీ

కాసేపట్లో మంత్రివర్గం భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతు భరోసా నిధులు విడుదలపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

February 23, 2026 / 02:44 PM IST

సంక్లిష్టంగా భారత్ సెమీస్ అవకాశాలు..?

దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి పాలవ్వడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ ఓటమితో భారత్ -3.800 నెట్ రన్ రేట్‌తో గ్రూప్-1లో చివరి స్థానంలో ఉంది. దీనివల్ల భారత్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినప్పటికీ సెమీస్ చేరుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై విజయం సాధించి మెరుగైన రన్ రేట్ సాధిస్తే సెమీస్ చేరుకుంటుంది.

February 23, 2026 / 02:44 PM IST

ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి పలు సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. అన్ని సమస్యలను ఆయా శాఖల అధికారులకు వివరించి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో పుల్లారావు పేర్కొన్నారు.

February 23, 2026 / 02:43 PM IST

పాడేరులో అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష

ASR: పాడేరు ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడీలు సోమవారం రిలే నిరాహార దీక్షకు దిగారు. రూ.26వేల కనీస వేతనం, 1810 మినీ కేంద్రాల అప్‌గ్రేడేషన్, గ్రాట్యుటీ మార్గదర్శకాలు, వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్‌తో పాటు రూరల్, అర్బన్ తేడాలేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 02:42 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే

WNP: వనపర్తి మార్కెట్ యార్డులో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పెబ్బేరు మండలం జనంపల్లి గ్రామానికి చెందిన పరశురాం రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందేలా చూస్తారని వారికి ధైర్యం చెప్పారు.

February 23, 2026 / 02:41 PM IST

పులి కలకలం.. ప్రజలకు ఎమ్మెల్యే హెచ్చరిక

JGL: భీమవరం మండలంలోని మోత్కురావుపేట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం అటవీ అధికారులతో సమీక్షించారు. మోత్కురావుపేట-చందుర్తి అటవీ మార్గంలో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. పులి కదలికలు ఉన్నందున రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావొద్దన్నారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

February 23, 2026 / 02:39 PM IST

రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

TG: మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేశారని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. స్థానిక సమస్యలైన తాగునీరు, పారిశుధ్యం, అభివృద్ధిని విస్మరించి, ప్రజల దృష్టి మరల్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS నేతలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడం కేవలం రాజకీయ కక్ష సాధింపేనని అన్నారు.

February 23, 2026 / 02:39 PM IST

తాడిపత్రిలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

ATP: కర్నూలు జిల్లాకు చెందిన న్యాయవాది పవన్ కుమార్‌పై సీఐ విక్రమసింహా దౌర్జన్యం చేసినందుకు నిరసనగా తాడిపత్రి న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సోమవారం కోర్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదుల పట్ల జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు.

February 23, 2026 / 02:37 PM IST

మూడు అంశాలపై చర్చించాలి: బొత్స

AP: BACలో మూడు అంశాలపై చర్చించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ‘పంటలకు గిట్టుబాటు ధరపై మండలిలో చర్చ జరగాలని కోరాం. యూనివర్సిటీ పేరుతో విశాఖలో రైతుల భూములను దోచుకోవాలని చూస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలకు భూముల దోచిపెట్టాలనే ఆలోచనపై చర్చించాలని డిమాండ్ చేశాం. తిరుమల లడ్డూ అంశంపైనా చర్చ జరగాలని అడిగాం’ అని వెల్లడించారు.

February 23, 2026 / 02:37 PM IST

వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన గని

MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గని 2025-26 వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 40 రోజుల ముందుగానే అధిగమించింది. ఈ సందర్భంగా సోమవారం కార్మికులు, సుపర్ వైజర్లను జీఎం శ్రీనివాస్ అభినందించి స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. ఇదే ఒరవడితో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీసైదా పాల్గొన్నారు.

February 23, 2026 / 02:36 PM IST

నిర్దేశించిన సమయంలో పన్నులు వసూళ్లు చేయండి: కమిషనర్

NLR: నెల్లూరులోని 26వ డివిజన్ విక్రమ్ నగర్ ప్రాంతంలో కార్పొరేషన్ నందన్ అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. డివిజన్ పరిధిలో అన్ని భవనాలను అసెస్మెంట్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. 100% నిర్దేశించిన ఆస్తి, తాగునీటి కుళాయి, ఖాళీ స్థలం పన్నులను వసూళ్లు చేయాలని ఆదేశించారు.

February 23, 2026 / 02:35 PM IST

ఛలో సెక్రటేరియట్‌కు ఆర్టీసీ పిలుపు

HYD: తమ హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 24న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదరు వెంకన్న తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా గాందేయ మార్గంలో ఈ పోరాటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

February 23, 2026 / 02:34 PM IST

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు: డీఎస్పీ

సత్యసాయి: వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రారంభించినట్లు కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామి తెలిపారు. సోమవారం జాతీయ రహదారిపై డీఎస్పీ కార్యాలయం ముందు రెండు చలివేంద్రాలను అధికారులు ప్రారంభించారు. ఎంపీడీఓ పొలప్ప, గురురాజు గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

February 23, 2026 / 02:34 PM IST

త్రాగునీటి సమస్యలకు పరిష్కారం: సర్పంచ్

కోనసీమ: కే. గంగవరం మండలంలోని తామరపల్లి గ్రామంలో ప్రజల రాగినీటి సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తోకల మంగ శ్రీనివాస్ తెలిపారు. సర్పంచ్ స్థానిక నాయకులతో కలిసి సోమవారం గ్రామంలో నూతనంగా నిర్వహించనున్న సురక్షిత త్రాగు నీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాయకులు నెక్కంటి బాలకృష్ణ, గన్ని శ్రీనివాస్ పాల్గొన్నారు.

February 23, 2026 / 02:34 PM IST