NZB: రాష్ట్ర అభివృద్ధికి 2040 ప్రణాళికతో ముందుకెళుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపకుండా ఇక్కడి బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు సహకరించాలని కోరారు.
NLG: చందంపేట మండలం బీజేపీ నాయకులను శనివారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. AI సమ్మిట్‌లో మన దేశ పరువు పోయేలా అర్ధ నగ్నంగా కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ అరెస్ట్‌లో స్టేట్ కౌన్సిల్ మెంబర్ అంజి నాయక్ ఉన్నారు.
TPT: తిరుపతి నగరంలో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 23 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు. అలాగే నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వాహనాలు నడిపిన 46 మందికి రూ.500 చొప్పున జరిమానా విధించారు. మొత్తంగా 69 మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.
NTR: విజయవాడలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షూబ్లీ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీలంటే వైసీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.గత జగన్ ప్రభుత్వంలో వేధింపులకు తట్టుకోలేక అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు.కోవాబన్ అంశంలో వలికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు.
NDL: శ్రీశైలం MLA బుడ్డా రాజశేఖర రెడ్డి శుక్రవారం సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న లింగాలగట్టు గ్రామానికి చెందిన టీడీపీ బూత్ కన్వీనర్ పోలయ్యను ఆయన పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
GDWL: నల్లమల అటవీ ప్రాంతంలో శుక్రవారం అరుదైన ‘నక్షత్రపు తాబేలు’ వెలుగుచూసింది. ఇటీవల అడవిలో అగ్నిప్రమాదాల కారణంగా వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చాయి. ITDA మెడికల్ ఆఫీసర్ కళ్యాణ్ సాగర్, బ్రహ్మగిరి నుంచి అచ్చంపేట వెళ్తుండగా రోడ్డుపై భారీ తాబేలును గుర్తించారు. ఇంత పెద్ద పరిమాణంలో తాబేలును అధికారికంగా గుర్తించడం ఇదే మొదటిసారి.
పెద్దపల్లి జిల్లాలో అగ్నివీర్ నియామకాల కోసం యువతకు 90 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు, కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఫిజికల్ ట్రైనింగ్, రాత పరీక్ష కోచింగ్, మెడికల్ అవగాహన, స్టడీ మెటీరియల్ సదుపాయాలు కల్పిస్తారు. 17.5-22 ఏళ్ల మధ్య, 10వ తరగతి ఉత్తీర్ణులైన పురుషులు ఫిబ్రవరి 23లోపు రుద్రమదేవి స్టేడియంలో ఉదయం 6-8 గంటల మధ్య నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
SRD: విదేశాల్లో చదువు కోసం డా. BR.అంబేద్కర్ విదేశీ విద్యానిధి కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని SC అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి ఇవాళ తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను www.telanganaepass.gov.in లో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షలు అందిస్తామన్నారు.
MBNR: జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో భోజనం చేసి వసతులను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల మెలకువలు నేర్పించి, సందేహాలు గ్రూప్ డిస్కషన్ ద్వారా పరిష్కరించాలని సూచించారు. పరీక్షల్లో ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యార్థులను ధైర్యపరిచారు.
కృష్ణా: నాలుగేళ్ల క్రితం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో 559 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నివేశనా స్థలాలను కేటాయించింది. నాగాయలంక, భావదేవరపల్లి గ్రామాలకు చెందిన వారికి సెంటున్నర భూమి ఇచ్చి రాళ్లు వేశారు. ఈ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తే ఒక ఊరుగా మారుతుందని ప్రజలు ఆశించారు. కానీ నేటికీ నిర్మాణాలు జరగకపోవడంతో పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి.
GNTR: గుంటూరు నల్లచెరువులో వీధి కుక్కల దాడికి గురైన బాలుడిని తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ శుక్రవారం అర్ధరాత్రి హుటాహుటిన GGHకు వెళ్లి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించి, మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ADB: నేరడిగొండ మండల కేంద్రలో పోలీస్ స్టేషన్ ఎదుట NH-44పై కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడానికి సోలార్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. ఆకస్మాతుగా ఆ బ్యాటరీలలో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ మొత్తం కాలి బూడిదయింది. సమాచారం తెలుసుకున్న NH-44 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.
KMM: కొద్దిరోజుల క్రితం తప్పిపోయిన గోపాలపురం వాసి షేక్ నాగుల్ మీరా (65) శుక్రవారం సాగర్ కాలువలో మృతి చెంది కనిపించారు. టేకులపల్లి బ్రిడ్జి సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కాలువ నుంచి వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ ప్రాంతంలో కార్తికేయ పట్టణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక టెలిస్కోప్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఈ టెలిస్కోప్ ద్వారా అంతరిక్షంలోని గ్రహాలను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, నగర కమిషనర్ చావత్ బాజ్ పాయ్ గ్రహాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ASR: హుకుంపేట మండలం సూకూరులో శుక్రవారం SI దుర్గా ప్రసాద్ పర్యటించారు. గ్రామస్థులతో సమావేశమయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలు అధికారులకు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు దూరంగా ఉండాలన్నారు.