కడప: జిల్లాలోని చేనేత సహకార సిల్క్, కాటన్ నిధులు కేటాయించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని చేనేత ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున స్పష్టం చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట శుక్రవారం చేనేత సహకార సంఘాలు,ప్రజా సంఘాల నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. సంఘాలను తిరిగి పునరుద్దించేలా RRR నిధులను విడుదల చేసేలా చూడాలన్నారు.
MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం BFAC సమావేశం నిర్వహించారు. BFAC ఛైర్మన్ రౌతు సత్తయ్య, ADA రాజ నరేందర్ హాజరయ్యారు. సమావేశంలో రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచి, వ్యవసాయ అభివృద్ధిని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.
దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తాజాగా ఆయన ఆరోగ్యం కుదటపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం భారతీరాజా తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు ఎవరినీ కలవనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
KMM: వెలుగుమట్ల భూబాధితులకు భరోసా కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి లోకసభసభ్యుడు ఈటల రాజేందర్ శనివారం ఖమ్మం విచ్చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఈటల రాజేందర్ బాధితులతో ముఖాముఖి సమావేశం కానున్నారు.
ELR: జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిని శుక్రవారం ఏలూరు ఎంపీ మహేష్ సందర్శించారు. పేషంట్ల వద్దకు వెళ్లి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించద్దని ఆసుపత్రికి కావలసిన వివిధ సేవల గురించి ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు.ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కర్నూలు: యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ ఎస్ఈ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. డి అంజిబాబు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కోటి రూపాయల ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సమాన వేతనం కల్పించాలని కోరారు.
ATP: జిల్లాలో మార్చి 3 నుంచి 5 వరకు ‘జనగణన-2027’ మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఏ. మలోల తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో సుమారు 200 మంది అధికారులకు ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇళ్ల జాబితా, గృహ గణన అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
కడప: వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రామలక్షణ రెడ్డి, శివకోటి రెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్ టీడీపీలో చేరగా.. మరో ఇద్దరు నూతనంగా చేరారు.
W.G: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికు శుక్రవారం నిర్వాహకులు ఆహ్వానం అందజేశారు. ఆదరణ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం పోస్టర్ కలెక్టర్ నాగరాణి భీమవరం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆశాజ్యోతి పాల్గొన్నారు.
CTR: ఓటర్ల క్లెయిమ్‌లు వేగవంతంగా పరిష్కారించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికల సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 15,77,743 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లా 2002-2025 ఎన్నికల జాబితాతో SIR మ్యాపింగ్‌లో 74.45% పురోగతిని సాధించడం జరిగిందని తెలిపారు.
EG: ఉండ్రాజవరం మండలం తాడిపర్రు జడ్పీ హైస్కూల్లో 10th క్లాస్ బ్యాచ్ ఫేర్‌వెల్ కార్యక్రమం హెచ్ఎం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సుమారు 60 విద్యార్థులకు ఉపాధ్యాయులు వీడ్కోలు పలికారు. మార్చి 16 నుంచి జరగబోయే పరీక్షలకు ప్రతి ఒక్కరూ కష్టపడి విజయం సాధించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. జిల్లా కిషన్ మోర్చా సంయుక్త కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ పాల్గొన్నారు.
CTR: పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సైన్స్ మేళా నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన తమ సైన్స్ ప్రాజెక్టుల నమూనాలను ప్రదర్శించి వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించే ఒక అద్భుతమైన వేదికే సైన్స్ మేళా అన్నారు.
సత్యసాయి: ధర్మవరం పట్టణం 28వ వార్డులో నూతనంగా నిర్మించిన డ్రైనేజ్ కాలువకు పైకప్పులు లేకపోవడం చుట్టూ గ్రావెల్ పరచకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ధర్మవరం బీజేపీ నేత హరీష్ బాబు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. కాలువపై భద్రతా పైకప్పులు ఏర్పాటు చేసి, గ్రావెల్ పరిచే పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
SRCL: పీఎం శ్రీ కింద జిల్లాలోని పలు విద్యాలయాల్లో అమలు అవుతున్న కార్యక్రమాలను పీఎంశ్రీ నోడల్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ ప్రవీర్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని మోడల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయాలను సందర్శించారు. జిల్లాలో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
ADB: రాష్ట్రీయ పర్ధాన్ జనజాతి ఉద్దాన్ సంఘటన్ సంస్థ సభ్యులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 15న నిర్వహించనున్న గోండి ధర్మ గురు హిరాసుకా లింగో జయంతి ఉత్సవాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ రావు, శంకర్, మాధవ్, తదితరులు ఉన్నారు.