NDL: ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం సాయంత్రం నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో అంకురార్పణతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం సెల్వార్ కూత్ ఉత్సవం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
BDK: ఈనెల 22వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొడి వాతావరణ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 23 నుంచి 25వ తేదీల్లో జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పగటి ఉష్ణోగ్రత 34°C నుంచి 36°C ఉంటుందని తెలిపారు. చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంట తడవకుండా టార్పాలిన్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
WGL: నెక్కొండ(M) కేంద్రంలోని అక్కల్ చెడు GPలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేదని విమర్శించారు. అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
BDK: కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ సదరం క్యాంపును శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంపులో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైద్య పరీక్షలు, ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు విధానాన్ని ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
GNTR: నల్లపాడు GDCC బ్యాంక్‌లో నిధుల దుర్వినియోగం కేసులో వెలిసెల ఏడుకొండలను పోలీసులు గురువారం GT రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. 28 నవంబర్ 2025న నమోదైన కేసులో బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరెస్టైన నిందితుడిని కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ ఆదేశించారు. మిగతా నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
MBNR: గండీడ్ మండలం లింగాయపల్లి, సల్కర్‌పేట్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. మొదటి విడతకు అభినందనలు తెలిపారు. త్వరలో రెండో విడత మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కృష్ణా: హనుమాన్ జంక్షన్‌లో దాతల సహకారంతో రూ.కోటితో నిర్మించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, స్థానికులతో కలిసి దాతలను ఘనంగా సన్మానించారు. ఈ భవనం వల్ల హనుమాన్ జంక్షన్ పరిధిలో పోలీసు సేవలు మరింత వేగవంతంగా అందనున్నాయి.
SDPT: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం సర్పంచుల ఫోరం హుస్నాబాద్ అధ్యక్షుడిగా గాంధీనగర్ గ్రామ సర్పంచ్ పోలు సంపత్‌ను మండలంలోని 17 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సర్పంచులకు ఏ సమస్య ఉన్నా ముందుండి మరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
JGL: కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గల మోడల్ స్కూల్ విద్యార్థులకు మట్టి నమూన పరీక్షపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారిని నాగమణి మట్లాడుతూ.. సేంద్రియ, సహజ వ్యవసాయం నేలలో సరైన ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. రసాయన ఎరువులు వాడకంతో నేలలో సారం తగ్గిపోతుందన్నారు. అలాగే నేలలో జరిగే చర్యల గూర్చి విద్యార్థులకు వివరించారు.
MNCL: మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ప్రోహిబీషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గురవయ్య తెలిపారు. స్టేషన్ ఆవరణలో నిర్వహించే వేలంలో ఆసక్తి గల వారు పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
MBNR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న (రేపు) పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని డీఈవో ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ , 3వ తరగతి ఎఫ్ఎల్ఎన్/ ఎఫ్ఎల్ఎన్ పరీక్షల సిద్ధతపై దృష్టి పెట్టాలని అన్నారు.
E.G: ఇటీవల హాస్పటల్స్‌లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం సీఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 61 మందికి రూ.37,19,880 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు కాగా చెక్కులను శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
MHBD: మరిపెడ మండల కేంద్రంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని నాణ్యత ప్రమాణాలతో వెంటనే పూర్తిచేయాలని సీపీఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆసుపత్రి 100 ఏళ్ల ప్రజలకు ఉపయోగపడాలన్న పనుల్లో నాణ్యత ముఖ్యమని కాంట్రాక్టర్ నాణ్యత పాటించకపోయినా సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలను వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.
PPM: ప్రభుత్వ వైద్యం పేదలకు వరమని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా మెలగాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కొమరాడ(మం) కే.రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
HNK: జీవించే హక్కును హరిస్తే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ అన్నారు. 11వ డివిజన్ భద్రకాళి ఆలయం సమీపంలో ఉన్న చెరబండరాజు నగర్లో DBF నేతలు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజ్యాంగ బద్దంగా అధికారులు తమ విధులను సక్రమంగా వినియోగించి దళిత కుటుంబాలకు మంచి పాలన అందించాలని కోరారు.