• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ పర్యటన

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఆదిలాబాద్‌కు వెళ్లనున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కేటీఆర్ పరామర్శిస్తారు. కష్టకాలంలో తోడుగా ఉంటూ, పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపేందుకు స్వయంగా జైలుకు వెళ్లి సుమన్‌తో ములాఖత్ కానున్నట్లు సమాచారం.

February 23, 2026 / 08:50 AM IST

రెండు ఇసుక ట్రాక్టర్లపై కేసు నమోదు: ఎస్సై

HNK: ఐనవోలు మండలం పన్నేలు గ్రామం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా సోమవారం ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. కానిస్టేబుల్ ట్రాక్టర్‌ను ఆపి అనుమతిపత్రాలను పరిశీలించినప్పటికీ, సరైన అనుమతులు లేని కారణంగా ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించినట్లు, ట్రాక్టర్ డ్రైవర్,యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

February 23, 2026 / 08:47 AM IST

స్వాతంత్య్రం వచ్చిన దాడులు ఆగడం లేదు

KMM: అంబేద్కర్ సెంటర్ వద్ద BC, SC, ST జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న రాత్రి స్థానిక కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో రజకులపై జరిగిన దాడిలో 2 నెలల పసికందు మృతి చెందడాన్ని నిరసిస్తూ ఖమ్మం నగరంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా ఇంకా తాడులు ఆగలేదని JAC నేత రాంబాబు చెప్పారు.

February 23, 2026 / 08:45 AM IST

ఇంటర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

GNTR: నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కృషి, పట్టుదలే విజయానికి మార్గమని పేర్కొన్నారు. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు విజయాలతో వెలిగిపోవాలని ఆకాంక్షించారు.

February 23, 2026 / 08:45 AM IST

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు

ప్రకాశం: ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లాలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లాలోని 79 పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు.

February 23, 2026 / 08:44 AM IST

బాన్సువాడలో 42 మందిపై కేసు: ఎస్పీ

KMR: బాన్సువాడలోని రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాళ్లు విసిరిన ఘటనలో ఇప్పటివరకు 42 మందిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

February 23, 2026 / 08:43 AM IST

తిరుమల క్యూలైన్‌లో భక్తురాలికి పాముకాటు

AP: తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం క్యూలైన్‌లో పాము కలకలం రేపింది. తెలంగాణకు చెందిన భక్తురాలు మౌనిక(27)ను పాము కాటేసింది. ఆలయ సిబ్బంది వెంటనే భక్తురాలిని అశ్విని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. భక్తురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 08:43 AM IST

నర్వలో రంజాన్ పవిత్ర వాతావరణం

NRPT: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ నెల సందర్భంగా నర్వ మండలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జామా మసీద్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంజాన్ ప్రార్థనల కోసం భక్తులు తరలవచ్చేలా రంగురంగుల వెలుగులతో మసీదు శోభాయమానంగా తీర్చిదిద్దబడింది. రాత్రి వేళల్లో మసీదు మెరిసిపోతోంది. ముస్లింలు ఉపవాస దీక్షలు, ప్రత్యేక నమాజ్‌లు నిర్వహిస్తున్నారు.

February 23, 2026 / 08:41 AM IST

వాటర్ ట్యాంకును పరిశీలించిన.. నగర మేయర్.!

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని శంభునిపేట కాలనీలోని వాటర్ ట్యాంక్‌ను నిన్న రాత్రి నగర మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అంతరాయం లేకుండా సరఫరా కొనసాగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు ఉన్నారు.

February 23, 2026 / 08:40 AM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

NZB: వర్ని మండలం అక్బర్ నగర్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ట్రాక్టర్- లారీ ఢీకొన్న ఘటనలో పాత వర్నికి చెందిన భూమయ్యకు గాయాలయ్యాయి. వర్ని 108 సిబ్బంది రామకృష్ణ, గౌస్ బాధితుడికి ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 08:40 AM IST

మూసీ పేరుతో వ్యాపారం వద్దు: హరీశ్ రావు

SDPT: మూసీ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మూసీ ప్రాజెక్టు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లు కూల్చడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. సీఎం చేసే ప్రతి పని వెనుక భూముల పంచాయతీ, వ్యాపార ప్రయోజనాలే ఉంటున్నాయని ఆయన ఆరోపించారు.

February 23, 2026 / 08:39 AM IST

కొనసాగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితుల ఆందోళన

PDPL: ముత్తారం మండలంలోని లక్కారంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించే వరకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారులు కేవలం సర్వేలతో కాలయాపన చేస్తూ తమను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, అప్పటివరకు పోరాటం ఆపేది లేదన్నారు.

February 23, 2026 / 08:38 AM IST

ఈదురు గాలుల బీభత్సం: మొక్కజొన్న పంట ధ్వంసం

MHBD: బయ్యారం మండలం బీరొనిమడుగు, పంది పంపుల, అల్లిగూడెం గ్రామాల్లో ఇవాళ తెల్లవారుజామున ఈదురు గాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీంతో 30 ఎకరాలు మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం అయ్యింది. చేతికి వచ్చిన పంట నెల రావడంతో అన్నదాతలు కన్నీటి పరేమయ్యారు. ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

February 23, 2026 / 08:38 AM IST

‘సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తాం’

PLD: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నీలావతి దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

February 23, 2026 / 08:36 AM IST

బేతంచెర్ల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సతీమణి పర్యటన

NDL: బేతంచెర్ల పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ పర్యటించారు. పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఫంక్షన్ హాల్లో వైసీపీ నాయకుడు కేశవరావు కుమారుని వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా కాటసాని జయమ్మ పాల్గొన్నారు. అనంతరం ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించారు.

February 23, 2026 / 08:36 AM IST