ATP: తాడిపత్రిలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, MLA అశ్మిత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఆంజనేయస్వామి మాన్యం వెనుక రూ.4.50 కోట్లతో నిర్మించే సోలార్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అలాగే అర్జాస్ స్టీల్ ప్లాంట్ ఎదురుగా మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్, జేసీ పార్క్ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శ్రీకారం చుట్టారు.
వాట్సాప్ గ్రూపుల్లో కొత్తగా చేరే వారికి పాత సంభాషణలు తెలిసేలా ‘హిస్టరీ షేరింగ్’ ఫీచర్‌ను మెటా పరిచయం చేసింది. అడ్మిన్లు గత 25 నుండి 100 మెసేజ్‌లను కొత్త సభ్యులతో షేర్ చేయవచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ఇది పూర్తి సురక్షితం. హిస్టరీ షేర్ చేసినప్పుడు గ్రూప్ సభ్యులందరికీ సమాచారం అందుతుంది. అవసరమైతే అడ్మిన్లు ఈ ఫీచర్‌ను ఎప్పుడైనా నిలిపివేయవచ్చు.
కృష్ణా: నందివాడ మండలం తమ్మిరిశ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బాల్య వివాహాల నివారణ గురించి ఎస్సై సుబ్రహ్మణ్యం ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థి దశనుంచే చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవచ్చని తెలిపారు. అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
WNP: హైదరాబాద్ నుంచి రైలులో ప్రయాణిస్తున్న క్రమంలో కరీంనగర్‌కు చెందిన గణేష్ అనే బాలుడు తప్పిపోయి మదనాపురం మండలం బౌసింగ్ తండా వాసుల వెంట వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్ సీతారాం నాయక్ తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. బాలుడి వివరాలు సేకరించిన అనంతరం పోలీసుల సహకారంతో సురక్షితంగా సఖీ కేంద్రానికి తరలించారు.
MLG: ప్రజా భవన్లో “Goddess of Folk–Sammakka Saralamma Jatara” కాఫీ టేబుల్ బుక్‌ను మంత్రి సీతక్క నేడు ఆవిష్కరించారు. బుక్‌ను రూపొందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. జాతర అరుదైన ఫోటోలతో ఆకర్షణగా మేడారం కాఫీ టేబుల్ బుక్ ఉందని మంత్రి సీతక్క అన్నారు.
చిత్తూరు నగర మేయర్ S. అముద వారి నూతన స్వగృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌కు ఎమ్మెల్యే పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేయర్ ఎమ్మెల్యే, ముఖ్య నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక TDP నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 316.57 పాయింట్లు లాభపడి 82814.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 116.90 పాయింట్ల లాభంతో 25571.25 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91గా ఉంది.
NZB: పోతంగల్ మండలం గన్నారం, లింగాపూర్ గ్రామాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో బోధన్ లయన్స్ క్లబ్ సహకారంతో శుక్రవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. గ్రామంలో సుమారు 65 మందికి పరీక్షలు చేయగా, 14మందికి మోతెబిందు ఆపరేషన్ కొరకు బోధన్ లయన్స్ క్లబ్ ఆసుపత్రికి పంపించినట్లు వెల్లడించారు.
KDP: సిద్ధవటం మండలం పొన్నవోలు గ్రామంలోని మామిడి శివారెడ్డి తోటలో కాపలాదారుగా ఉన్న యానికుల గణేష్(19 ) మతిస్థిమితం, అనారోగ్యంతో బుధవారం విషగుళికలు సేవించాడు. బందువులు సిద్ధవటం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లుగా ధృవీకరించారు. తండ్రి యాణికుల రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై హారిక తెలిపారు.
కృష్ణా: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పామర్రు ఎమ్మెల్యే, ఎస్సీ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ వర్ల కుమార్ రాజా కీలక విజ్ఞప్తి చేశారు. దళిత వాడలు, మైనారిటీ ప్రాంతాల్లో స్మశాన వాటికలు, కబరస్థాన్ల ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే దళితులకు పూర్తి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్’ సెకండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 110 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో పాక్ 16.4 ఓవర్లలో కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది.
BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీలో శుక్రవారం నూతన పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యత ఎంతో ఉన్నతమైందని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజా ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి ధ్యేయమన్నారు.
ASR: జీ.మాడుగుల మండలంలోని వంజరి, గెమ్మెలి గ్రామాల్లో శుక్రవారం గిరిజన రైతులకు కోళ్ల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పశు వైద్యాధికారిణి రాగిణి, శాస్త్రవేత్త శ్రీహరి పాల్గొని, పౌల్ట్రీ ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాలను వివరించారు. అనంతరం ఒక్కో రైతుకు 15 కోళ్ల చొప్పున పంపిణీ చేశారు. బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
TG: భవిష్యత్తులో జాతీయ స్థాయి క్రీడలను మక్తల్‌లో నిర్వహించేలా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం కప్‌లో భాగంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు. గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను వెలికి తీస్తామన్న మంత్రి.. 33 జిల్లాల నుంచి 66 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు.