HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా శిబిరంలో ఓపీ నమోదు, ,ప్రాథమిక పరీక్షల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఫార్మసీ కౌంటర్‌ను సందర్శించి అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరాతీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
MDCL: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అలవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం అల్వాల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధి హస్మత్‌పేట్ హరిజన్ బస్తీలో ముద్దంగుల బాలు (33) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం కోసం డబ్బులు లేకపోవడంతో ఇంట్లో తలుపులు వేసుకుని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడన్నారు.
TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అన్ని రకాల సహకారాలు అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‍చౌహాన్‍ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి కోరారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్‍కు విచ్చేసిన కేంద్రమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ఏడాది 3లక్షల ఇళ్లు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.
SRPT: మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కాటన్ లోడుతో వెళుతున్న లారీ, రాంగ్ రూట్‌లో వస్తున్న మరొక వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ సల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
JGL: కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం పేద ప్రజలకు గృహ స్వప్నాన్ని నెరవేర్చే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి కల నెరవేరింది అన్నారు.
ASR: పచ్చదనం, పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాను క్లీన్ ఆర్గానిక్ జిల్లాగా ఉంచడమే ప్రధాన ద్యేయమన్నారు. “జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ నినాదంతో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర శనివారం పాడేరు మండలం తుంపాడ జీపీయూ స్కూల్లో నిర్వహించారు. వీధులలో, రోడ్లకు ఇరువైపు పరిశీలించి చుట్టుపక్కల వ్యర్ధాలు లేకుండా చూడాలన్నారు.
VKB: బొంరాస్పేట మండలంలోని గుబ్బడి తండాలో ప్రాథమిక పాఠశాల కంపౌండ్ వాల్ నిర్మాణానికి మంజూరు వచ్చింది. ఈరోజు సర్పంచ్ శాంతి బాయ్, గ్రంథాలయ ఛైర్మన్ రాజేష్ రెడ్డి, MGNREGS మెంబర్ నర్సింహులు గౌడ్ అధ్వర్యంలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, తండా వాసులు మరియు పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో ఫిబ్రవరి 4 నుంచి 21 వరకు జరిగిన హుండీ లెక్కింపు ద్వారా రూ. 2,89,12,052ల ఆదాయం వచ్చినట్లు ఏఓ సీనా నాయక్ తెలిపారు. ఇందులో 171 గ్రాముల బంగారం, 2.88 కిలోల వెండి లభించాయి. రోజుకు సగటున రూ. 17 లక్షల ఆదాయం నమోదైంది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు వెల్లడించారు.
PDPL: మంథని మున్సిపల్ పరిధిలో ప్రజలు నిరంతరం ఎదుర్కొంటున్న కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ముసుకుల సయేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. కోతుల వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ADB: రాయితీ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలియజేశారు. రాయితీ బియ్యం అక్రమాలను అరికట్టేందుకుగాను పట్టణంలోని రేషన్ డీలర్లతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బ్రోకర్లతో కుమ్మక్కై రాయితీ బియ్యానికి దుర్వినియోగం పాల్పడితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
చాలామంది కెరీర్, ట్రాన్స్‌ఫర్లు, పిల్లల చదువుల కోసం ఊళ్లు మారుతూ ఉంటారు. అయితే తరచూ ఇళ్లను మారడం పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాల్యంలో తరచూ ఇళ్లు మారుతోంటే పెద్దయ్యాక వాళ్లు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. పిల్లలకు చిన్నతనంలో స్థిరమైన బాల్యాన్ని అందించాల్సిన అవసరం ఉందంటున్నారు.
KNR: సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం సర్పంచ్ మ్యాకల స్వప్న అంగన్వాడీ పిల్లలకు యూనిఫాంను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అందే రాకేష్, వార్డు సభ్యులు తలారి యాదగిరి, మొలుగూరి భారతి, తలారి రాము, గ్రామస్తులు ఉన్నారు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ రేసులో తొలి అడుగు వేయాలని చూస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయ క్యూలైన్లు నిండి బయటి వరకు భక్తులు వేచి ఉన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో పెంచల కిశోర్ స్పష్టం చేశారు.