• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రామాలయం నిర్మాణానికి మాజీ ఎంపీపీ విరాళం

VZM: డెంకాడ మండలం సింగవరం పంచాయితీ లెంకపేట గ్రామంలో నిర్మించనున్న నూతన రామాలయం నిర్మాణానికి మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ శనివారం విరాళం అందజేశారు. అక్కివరం తన స్వగృహంలో ఆలయ కమిటీ సభ్యులకు రూ.25,000 విరాళం అందజేశారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 07:02 PM IST

జోగులాంబ ఆలయంలో ప్రముఖ డైరెక్టర్

GDWL: అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంను ‘బలగం’ చిత్ర దర్శకుడు, సినీ నటుడు వేణు యెల్దండి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారిని, స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది సురేశ్ పాల్గొన్నారు.

February 21, 2026 / 07:02 PM IST

‘సామాజిక న్యాయం కోసమే చట్టాలు’

KNR: ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఆదేశాలకు అనుగుణంగా పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తనకు మహేష్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. లింగ, ధనిక, పేద, మత ఏ ఇతర వాటితో సంబంధం లేకుండా అందరికీ సామాజిక న్యాయం అందించేలా చట్టాలు రూపొందించబడ్డాయని అన్నారు.

February 21, 2026 / 07:01 PM IST

పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాల మూసివేత

KRNL: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సూచనల మేరకు జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్ కె. వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈనెల 23 నుంచి మార్చి 24 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 21, 2026 / 07:01 PM IST

డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు

ASR: జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాలతో అరకు సర్కిల్ పరిదిలో శనివారం సీఐ హిమగిరి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్‌తో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అరకు రైల్వే స్టేషన్లు, అరకులోయ బస్ స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్‌తో అణువణువు తనిఖీలు చేపట్టారు. రైలు, బస్సులలో ప్రయాణికుల వద్ద వున్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

February 21, 2026 / 07:01 PM IST

బ్లూ పోలీస్ వాహనానికి గ్రీన్సిగ్నల్

PPM: పార్వతీపురం పట్టణంలో బ్లూ పోలీస్ వాహనాన్ని ఏఎస్పీ మనీషా రెడ్డి గ్రీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల భద్రతే లక్ష్యంగా బ్లూ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. క్రైమ్ నియంత్రణ, చైన్ స్నాచింగ్, దొంగతనాలు వంటి ఘటనలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

February 21, 2026 / 07:01 PM IST

‘SC, ST కుటుంబాలకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్‌లు’

సత్యసాయి జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద 11,987 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు మంజూరైనట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. శనివారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే అర్హులైన పేదలకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

February 21, 2026 / 07:01 PM IST

బాల్య వివాహాల నిర్మూలన చైతన్య రథాన్ని ప్రారంభించిన RDO

ATP: అనంతపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో శనివారం బాల్య వివాహాల నిర్మూలన చైతన్య రథాన్ని ఆర్డీవో కేశవ నాయుడు ప్రారంభించారు. రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 07:00 PM IST

‘సమాజ హితం కోసం ఆలోచన కలిగించేవి రెడ్ బుక్స్’

ఏలూరు సీపీఐ కార్యాలయంలో శనివారం రెడ్ బుక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ఆలోచన కలిగించేలా సమాజంలో దోపిడీ పీడన నుంచి విముక్తి కలిగించేందుకు ఆలోచన కలిగించే గొప్ప పుస్తకాలు రెడ్ బుక్స్ అని కొనియాడారు. ప్రజల మధ్య అంతరాలు లేని గొప్ప సమాజాన్ని నిర్మించాలన్నారు.

February 21, 2026 / 07:00 PM IST

మార్చి 2న విజయవాడలో అంగన్వాడీల మహాధర్నా

W.G: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మార్చి 2న విజయవాడలో సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే రాజా రామ్మోహన్ రాయ్ అన్నారు. జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం భీమవరం సీఐటీయూ కార్యాలయంలో జరిగింది.

February 21, 2026 / 07:00 PM IST

కారును ఢీకొన్న కెమికల్ ట్యాంకర్

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక శ్రీ రంగనాథ స్వామి ఆలయ సమీపంలో శనివారం సాయంత్రం కారును కెమికల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జెంది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ సీఐ హాజీవల్లి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 07:00 PM IST

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు

NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

February 21, 2026 / 07:00 PM IST

వేంకటేశ్వరుడిని వదిలేయండి.. గోవిందా!

AP: తిరుమల లడ్డూ వ్యవహారం రాష్ట్రంలో చిలికి చిలికి గాలి వానలా మారింది. మీరు తప్పు చేశారంటే.. మీరు తప్పు చేశారని టీడీపీ, వైసీపీ నేతల విమర్శలు తారా స్థాయికి చేరాయి. అయితే ‘లడ్డూ అంటే కేవలం ప్రసాదం కాదు, కోట్ల మంది నమ్మకం. ఈ నమ్మకాన్ని కాపాడటం వదిలేసి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మంచిది కాదు. ఇప్పటికైనా ఆ వేంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగొద్దు’ అని భక్తులు వేడుకుంటున్నారు.

February 21, 2026 / 07:00 PM IST

‘చెత్తరహిత సమాజ స్థాపనకు సహకరించాలి’

VZM: చెత్త రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో రామకృష్ణ రాజు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛదివాస్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొండవెలగాడలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి ప్రజలు సహకారం అవసరమన్నారు. పరిశుభ్రతతోనే రోగాలకు దూరంగా ఉండొచ్చని చెప్పారు.

February 21, 2026 / 06:59 PM IST

ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి కొత్త టారిఫ్‌లు: వైట్ హౌస్

సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం టారిఫ్‌లు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ టారిఫ్‌లు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ వెల్లడించింది. ఈ సుంకాలు 150 రోజులపాటు అమలులో ఉంటాయని తెలిపింది.

February 21, 2026 / 06:57 PM IST