• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విషాదం.. ప్రేమ జంట సూసైడ్

WNP: జిల్లాలోని కీర్యా తండాకు చెందిన గణేశ్ నాయక్(21) అన్నారం తండాకు చెందిన వసంత(18) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. HYDలో గణేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వసంత బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతుంది. ఇటీవల వసంతను వివాహం చేసుకోవాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన గణేష్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనతో ఆమె సూసైడ్ చేసుకుంది.

February 26, 2026 / 08:06 AM IST

‘పరిశ్రమలకు వేగంగా అనుమతులు మంజూరు చేయండి’

SS: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను జాప్యం లేకుండా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలను మంజూరు చేశారు. ఎంఎస్ఎంఈ పనులను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు.

February 26, 2026 / 08:06 AM IST

మూడేళ్లపాటు ఉచితంగా సివిల్స్ కోచింగ్

తిరుపతిలోని APSPDCL సీఎండీ కార్యాలయంలో “వెంకటపతి విద్యా దీవెన” పేరుతో పేద, వెనుకబడిన వర్గాల యువతకు రాష్ట్ర, కేంద్ర సివిల్ సర్వీసుల కోసం మూడేళ్లపాటు ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్, కోచింగ్ ఇవ్వనున్నారు. మొత్తం 200 మందికి ఈ అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాలురకు వినుకొండలో, బాలికలకు కేతనకొండ (విజయవాడ)లో ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు.

February 26, 2026 / 08:06 AM IST

అమలాపురం ఇంచార్జి ఆర్డీవో‌గా జేసీ నిశాంతి

కోనసీమ: అమలాపురం ఇంచార్జి ఆర్డీవోగా జేసీ టి.నిశాంతి బాధ్యతలు అప్పగించారు. రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం ఆర్డీవో‌లు బదిలీ కావడంతో వారి స్థానాల్లో ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపేట, రామచంద్రాపురం ఇంచార్జి ఆర్డీవో‌గా జిల్లా సర్వ శిక్షా ఏపీసీ జీ.మమ్మీ కి బాధ్యతలు అప్పగించారు.

February 26, 2026 / 08:05 AM IST

‘జిల్లాను రాష్ట్రంలోనే ముందుంచాలి’

BPT: సూర్యఘర్ యూనిట్ల స్థాపనలో బాపట్ల జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ వినోద్‌కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో 24,620 యూనిట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. జిల్లాలోని 45 గోదాముల్లో ఇప్పటికే 20 పూర్తయ్యాయని, మిగిలిన వాటి పనులు వేగవంతం చేయాలని తెలిపారు.

February 26, 2026 / 08:05 AM IST

భైంసాలో షీటీం భరోసా.. కలిసిన కుటుంబాలు

NRML: ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల గ్రీవెన్స్ నిర్వహించారు. ఇందులో షీ టీం కీలక పాత్ర పోషించింది. కుటుంబ వివాదాలతో వచ్చిన వారికి షీ టీం సిబ్బంది ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి విడిపోయిన వారిని తిరిగి కలిపారు. కౌన్సిలింగ్ కోసం నిర్మల్ వరకు వెళ్లే భారం తప్పించి భైంసాలోనే ఈ సదుపాయం కల్పించడం పట్ల బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

February 26, 2026 / 08:05 AM IST

అమ్మాయితో వీడియో కాల్.. క్లిక్ చేస్తే..!

HYD: మల్కాజ్‌గిరికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని నంబర్ నుంచి ఓ లింకు వచ్చింది. ‘రూ. 40కే అమ్మాయితో లైవ్ వీడియో కాల్ మాట్లాడొచ్చని, ఇందుకోసం లింకు క్లిక్ చేయండి’ అని మెసేజ్ సారాంశం. టెంప్ట్ అయిన అతడు పర్యవసానాలు ఆలోచించకుండా క్లిక్ చేశాడు. అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసి, వెంటనే కట్ చేసింది. అర్థంకాని అతడు ఆలోచనలో ఉండగా అకౌంట్‌లో ఉన్న రూ. 8,457 కట్ అయింది.

February 26, 2026 / 08:05 AM IST

‘రుణ లక్ష్యాలను గడువులోగా సాధించాలి’

ఆసిఫాబాద్ జిల్లాకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను గడువులోగా సాధించాలని కలెక్టర్ కే. హరిత బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్లో జరిగిన 2025 – 26 మూడో త్రైమాసిక సమీక్షలో ఆమె మాట్లాడారు. రూ. 3,023 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ. 1,581 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. PM ముద్ర యోజన, PM విశ్వకర్మ తదితర పథకాల లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

February 26, 2026 / 08:02 AM IST

మెట్‌పల్లి ఎంఈవోగా కనకతార నియామకం

JGL: మెట్‌పల్లి మండల విద్యా అధికారిగా జిల్లా పరిషత్ హైస్కూల్ (బాలికల) పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కనకతారను నియమిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా ప్రమాణాల అభివృద్ధి, పాఠశాలల పర్యవేక్షణ, విద్యార్థుల హాజరు, బోధన నాణ్యత మెరుగుపరిచే దిశగా ఆమె సేవలు అందించనున్నారు.

February 26, 2026 / 08:02 AM IST

చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

MNCL: చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, చెల్లించవల్సిన మొత్తం చెల్లించాలని జిల్లా జడ్జి నిరోష తీర్పునిచ్చారు. 2018లో జైపూర్ మండలంకి చెందిన నరసింహారెడ్డి వద్ద మంచిర్యాలకు చెందిన మధుసూదన్ రూ. 7.75 లక్షలు అప్పు చేశాడు. తిరిగి చెల్లించే క్రమంలో చెక్కు ఇవ్వగా అది బౌన్స్ అయ్యింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగాపై విధంగా తీర్పునిచ్చారు.

February 26, 2026 / 08:02 AM IST

40 పాఠశాలలకు పీఎం శ్రీ నిధులు: కలెక్టర్

NZB: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం 40 పాఠశాలలకు కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

February 26, 2026 / 08:01 AM IST

ఐదుగురు నకిలీ డాక్టర్ల అరెస్ట్

NLG: మిర్యాలగూడలో అర్హత లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న ఐదుగురు నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. 5 కంటి ఆసుపత్రిలో ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా వీరు చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో తేలింది. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలను డీఎస్పీ రాజశేఖర్ వెల్లడించారు.

February 26, 2026 / 08:01 AM IST

జనసేన సభ్యత్వాల ఇన్‌ఛార్జ్‌గా కొరికాన భవాని

SKLM: పాతపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వాల ఇన్‌ఛార్జ్‌గా కొరికాన భవానిని పార్టీ అధిష్ఠానం బుధవారం నియమించింది. శ్రీకాకుళంలో నిర్వహించిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సభ్యత్వాల నమోదు కోసం ఏడు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించామని పార్లమెంట్ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ రవికుమార్ తెలిపారు.

February 26, 2026 / 08:01 AM IST

నీతి ఆయోగ్ ప్రతినిధులను కలసిన కలెక్టర్

PPM: జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కోరారు. నీతి ఆయోగ్ అధికార ప్రతినిధి ఆయుషి అగర్వాల్ బుధవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలసి జిల్లా సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికపై వివరించారు.ఈ పర్యటనలో జిల్లా అధికారులు, నీతి అయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

February 26, 2026 / 08:00 AM IST

సోలార్ పథకాల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

NDL: జిల్లాలో అమలులో ఉన్న సోలార్ విద్యుత్ పథకాల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో APSPDCL అధికారులు, సోలార్ వెండర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన 9 పనుల్లో 4 పనులకు స్థలాలు ఖరారు కాగా, మిగిలిన పనులకు భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

February 26, 2026 / 08:00 AM IST