• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రభుత్వం మద్యం దుకాణంలో తనిఖీలు’

ELR: జిల్లా కామవరపుకోట గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలో స్టాక్ నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఇతరులకు మద్యాన్ని విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు మద్యాన్ని విక్రయించకూడదని పేర్కొన్నారు.

February 20, 2026 / 07:35 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వాహన తనిఖీలు

కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గుడివాడలో వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ నిన్న వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సీ (RC), పొల్యూషన్, ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.

February 20, 2026 / 07:35 AM IST

ఓటరు జాబితాపై EROలకు శిక్షణ

TG: ఎన్నికల జాబితాల పరిశుభ్రతను కాపాడడం EROల బాధ్యత అని CEC సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాల్లో చేర్చడంతో పాటు, అనర్హుల పేర్లను చట్టబద్ధంగా తొలగించాల్సిన అవసరం ఉందని సూచించారు. మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, HYD జిల్లాలకు చెందిన మొత్తం 50 మంది EROలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే త్వరలో చేపట్టనున్న SIRపై చర్చించారు.

February 20, 2026 / 07:35 AM IST

ANU బీ.ఆర్కిటెక్చర్ ఫలితాలు విడుదల..!

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్‌లో జరిగిన బీ.ఆర్కిటెక్చర్ (5/5, 2వ సెమిస్టర్) సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాలను గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని, రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 07:34 AM IST

‘యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తుల పంపిణి’

MHBD: జిల్లా గంగారాం మండలం వెంకమ్మగుంపు గ్రామానికి చెందిన క్రీడాకారులకు శుక్రవారం ఉదయం యువ ఫౌండేషన్ సభ్యులు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీగుడాలలో మంచి క్రీడానైపుణ్యం కలిగిన యువకులు ఉన్నారని, వారిని ప్రోత్సహించిన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. యువతతోనే ఏజెన్సీఅభివృద్ధి సాధ్యమన్నారు.

February 20, 2026 / 07:33 AM IST

కారు బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు

ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి మడేరు ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరంలో వివాహానికి హాజరై కొండపల్లికి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను జడ్డంగి పోలీసులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 07:32 AM IST

సిద్దిపేట ఐటీ హబ్‌లో ఉద్యోగ అవకాశాలు

SDPT: ఐటీ హాబ్ మేనేజర్ నరేందర్ గౌడ్ మహిళా అభ్యర్థులకు సువర్ణావకాశం ప్రకటించారని తెలిపారు. హైదరాబాద్ సోలార్ కంపెనీలో ఉద్యోగాల కోసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు, హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 20వ తేదీ వరకు https://forms.gle /AoKByEro8EvtckD67 దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 07:32 AM IST

‘నేడు కాకినాడ కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగుల ‘గ్రీవెన్స్’

KKD: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ‘గ్రీవెన్స్’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్ ప్రజావాణి హాలులో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి అధికారులు 3:45 గంటలకే హాజరు కావాలని సూచించారు. ఉద్యోగులు తమ సర్వీసుపై సమస్యలపై వినతులు సమర్పించాలన్నారు

February 20, 2026 / 07:32 AM IST

గంజాయి కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష

SRD: గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించారు. ఈ మేరకు సంగారెడ్డి ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి జయంతి గురువారం తీర్పు వెలువరించారని అందోలు ఎక్సైజ్ స్టేషన్ సీఐ సాగర్ రెడ్డి తెలిపారు. 2020 సెప్టెంబరులో 850 కేజీల గంజాయిని జాదవ్ బన్సీలాల్, రాథోడ్ శంకర్ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.

February 20, 2026 / 07:30 AM IST

పీలేరు పట్టణంలో దారుణం

అన్నమయ్య: పీలేరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. రామచంద్రారెడ్డి కాలనీలో ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగినట్లు సమాచారం. ఘటనపై ఆగ్రహించిన స్థానికులు నిందితుడిగా భావిస్తున్న 15 ఏళ్ల బాలుడికి దేహశుద్ధి చేశారు.అనంతరం అతడు సమీప బంధువుల ఇంట్లో తలదాచుకోగా, పీలేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 20, 2026 / 07:30 AM IST

నేడు ఫుడ్ కమిషన్ బృందం పర్యటన

KMR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం నేడు KMR జిల్లాలో పర్యటించనుంది. కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఉ.9:30 గం.కు KMR పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. ఉ.10:30 గం.కు మున్సిపల్ క్యాంటిన్లో ప్రజలకు విక్రయిస్తున్న పదార్థాల ధరలను తనిఖీ చేసి,11 గం.కు ZPHS పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయనున్నారు.12 గం.కు అంగన్వాడి సెంటర్ ను,1 గం.లకు రామారెడ్డి PHCకీ వెళ్తారు.

February 20, 2026 / 07:28 AM IST

అన్వేష్ యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్..?

యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కరాటే కళ్యాణి స్పందిస్తూ.. ‘అన్వేష్ యూట్యూబ్ ఛానల్ సహా అన్ని అకౌంట్లను డిలీట్ చేయాలని CPని కలుస్తా. అలాగే పాస్ పోర్ట్, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాలని కోరుతా. హిందువులను అవమానించిన అతడికి శిక్ష పడేలా చేస్తా’ అని తెలిపింది. దీంతో అన్వేష్ యుట్యూబ్‌ కూడా బ్లాక్ అవుతుందా అని SMలో చర్చ జరుగుతోంది.

February 20, 2026 / 07:28 AM IST

కోడిపందాలపై దాడి.. నలుగురు అరెస్ట్

E.G: నిడదవోలు మండలంలోని రావిమెట్ల గ్రామ శివారులో అక్రమంగా కోడిపందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను సమిశ్రగూడెం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,000 నగదుతో పాటు ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడైనా జూదం, కోడిపందాల వంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలన్నారు.

February 20, 2026 / 07:27 AM IST

‘6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి’

KRNL:  AP మోడల్ స్కూల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశపరీక్షకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోడుమూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఆశాజ్యోతి ఇవాళ తెలిపారు. ఈనెల23 నుంచి ఆన్‌లైన్‌లో ఆప్లికేషన్ ప్రారంభమవుతుందని, మార్చి 31లోగా విద్యార్థులంతా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ ఆప్లికేషన్లను సమర్పించాలన్నారు.

February 20, 2026 / 07:25 AM IST

పెదకాపవరంలో పర్యటించిన RWS అధికారులు

W.G: ఆకివీడు మండలం పెదకాపవరంలో గ్రామంలో గురువారం ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు. గ్రామంలోని మంచినీటి చెరువు, ఫిల్టర్ బెడ్లు, సంపులు, మైక్రో యూనిట్ల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర సలహాదారుడు ప్రభాకర్ రావు, బ్రౌసు సంస్థ సభ్యులు డాక్టర్ సుధాకర్ శ్రీధర్, డీఎల్పీవో దోసిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.

February 20, 2026 / 07:25 AM IST