• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు మధురవాడ జోన్‌లో నీటి సరఫరా నిలిపివేత

VSP: మధురవాడ జోన్‌లో శుక్రవారం తాగునీటి సరఫరా అంతరాయం ఉంటుందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. గంభీరం వద్ద 700 మి.మీ ప్రధాన పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా వార్డు 6, 7లోని సాయిరాం కాలనీ, కొమ్మాది, బక్కన్నపాలెం, మిధిలాపురి వుడా కాలనీ, పాత మధురవాడ ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. అవసరమైతే ట్యాంకర్ కోసం సంబంధిత ఏఈలను సంప్రదించాలని సూచించారు.

February 20, 2026 / 07:25 AM IST

జమ్మిచేడు జమ్ములమ్మ దివ్య మంగళ స్వరూపంగా

GDWL: లోకపావని, చల్లని తల్లి జమ్ములమ్మ అమ్మవారు నేడు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అని ఆలయ అర్చకులు తెలిపారు. గద్వాల జిల్లా జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారనారు.

February 20, 2026 / 07:25 AM IST

ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా వికాస్ కుమార్

PDPL: ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వికాస్ కుమార్ యాదవ్‌ను నియమించారు. హైదరాబాద్‌లో జరిగిన యూనియన్ 21వ త్రైవార్షిక ప్రతినిధుల మహా సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అతి చిన్న వయసులో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం పట్ల వికాస్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 07:25 AM IST

‘రైతులకు నష్టపరిహారం చెల్లించాలి’

ASR: జీకేవీధి మండలం మంగళపాలెం నుంచి గుణయలంక వరకూ జరుగుతున్న రోడ్డు నిర్మాణంలో కాఫీ మొక్కలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. పలువురు గిరిజన రైతులకు చెందిన కాఫీ మొక్కలు పోతున్నాయన్నారు. అధికారులు కాఫీ మొక్కలు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.

February 20, 2026 / 07:24 AM IST

మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

ATP: బ్రహ్మసముద్రం మండలం నంజాపురంలో తులసి అనే మహిళ మెడలో ఉన్న బంగారపు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. గురువారం ఆమె కళ్యాణదుర్గం నుంచి నంజాపురానికి స్కూటీలో బయలుదేరింది. గొంచిరెడ్డిపల్లి, ఐదుకల్లు గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు బైక్ లో వచ్చి మహిళ మెడలోని 40 గ్రాముల బంగారు గొలుసు చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

February 20, 2026 / 07:23 AM IST

నేడు నెహ్రూ యువ కేంద్రంలో ఉద్యోగ మేళా

SKLM: నగరంలో నెహ్రూ యువ కేంద్రంలో ఇవాళ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె. సుధ ఓ ప్రకటనలో తెలిపారు. 85 ఖాళీల భర్తీకి ఇంటర్ ఆపై విద్యార్హత కలిగి, 30 ఏళ్లలోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.

February 20, 2026 / 07:23 AM IST

చెరబండరాజు నగర్ దళిత వాసులకు రక్షణ ఆదేశాలు

HNK: భద్రఖాళీ దేవాలయ ప్రాంతంలోని చెరబండరాజు నగర్ కాలనీ దళిత వాసుల సమస్యలను మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ గురువారం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్మన్ డా: జస్టిస్ శామీర్ అక్తర్ దృష్టికి తీసుకెళ్లారు. ఛైర్మన్ సానుకూలంగా స్పందించి తగిన రక్షణ కల్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు.

February 20, 2026 / 07:23 AM IST

జిల్లా వ్యాప్తంగా విస్తృత విజిబుల్ పోలీసింగ్

కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం విస్తృతంగా అమలవుతోంది. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై కట్టుదిట్టమైన తనిఖీలు, గస్తీలు కొనసాగుతున్నాయి. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

February 20, 2026 / 07:22 AM IST

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10-12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండటంతో భక్తులు కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్‌లో ఉన్నారు. నిన్న శ్రీవారిని 57,682 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,020మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

February 20, 2026 / 07:21 AM IST

టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెంచాలి: కలెక్టర్

WGL: జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించి ఉత్తీర్ణత శాతం పెరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. DEO అధ్యక్షుల గురువారం సాయంత్రం ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 10 th class విద్యార్థులకు స్పెషల్ క్లాస్ నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు.

February 20, 2026 / 07:21 AM IST

గంగమ్మ తల్లి జాతర ఘనంగా ముగింపు

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి జాతర ఘనంగా ముగిసింది. జాతర సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

February 20, 2026 / 07:21 AM IST

‘ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి’

VKB: జిల్లాలో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి కార్యాలయంలో ఇంటర్ పరీక్షలపై సమావేశం నిర్వహించారు.

February 20, 2026 / 07:20 AM IST

రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన దివ్యాంగ విద్యార్థులు

NGKL: హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి దివ్యాంగుల విద్యార్థుల క్రీడలలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. క్రీడలలో పాల్గొని సత్తా చాటిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం సాయంత్రం అభినందించారు. జిల్లాకు చెందిన తులసీదర్, నాని, విద్యార్థులు క్రీడలలో సత్తా చాటి జిల్లాకు పేరు తేవడం గర్వకారణమని అన్నారు.

February 20, 2026 / 07:20 AM IST

‘కన్నాయిగూడెంలో చెక్కుల పంపిణీ’

MLG: కన్నాయిగూడెం రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగా కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల మహిళలు చెక్కులు అందుకున్నారు.

February 20, 2026 / 07:19 AM IST

నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

SRD: జిల్లాలో నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. 20, 23 తేదీల్లో ప్రాథమిక స్థాయి, 24, 25 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేయాలని కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఏంఈవోలకు సూచించారు.

February 20, 2026 / 07:19 AM IST