• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సూపర్-8లో మార్పు ఉండొచ్చు: గవాస్కర్

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా టీమిండియా సూపర్-8 పోరుకు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో ఆదివారం తలపడనుంది. ఈ పోరులో ఒక్క మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేసి.. అతడి స్థానంలో అక్షర్‌కు అవకాశం ఇవ్వొచ్చని తెలిపాడు. అలాగే, సుందర్‌ను కొనసాగించే ఛాన్స్ ఉందన్నాడు.

February 20, 2026 / 03:46 AM IST

వైఎస్సార్ పేరు తొలగింపు

AP: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలకు ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును అధికారులు తొలగించారు. YSR పేరు తొలగించాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్‌కు వినతిపత్రం అందించారు. తాజాగా బుధవారం మరోసారి కోరడంతో ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ YSR పేరును తొలగిస్తూ ఆదేశాలిచ్చారు.

February 20, 2026 / 02:16 AM IST

ఫిబ్రవరి 20: చరిత్రలో ఈరోజు

➢1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం➢1946: దివంగత నటి విజయ నిర్మల జననం➢1973: మ్యూజిక్ డైరెక్టర్ టి.వి.రాజు మరణం➢2010: నటుడు, నిర్మాత పద్మనాభం మరణం* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం* పిచ్చుకల దినోత్సవం* జాతీయ నాయకత్వ దినోత్సవం* అరుణాచల్ ప్రదేశ్, మిజోరం అవతరణ దినోత్సవం

February 20, 2026 / 01:59 AM IST

ఫిబ్రవరి 20: శుక్రవారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం తదియ: మ.3:33 తదుపరి చవితి ఉత్తరాభాద్ర: రా.9:13 తదుపరి రేవతి వర్జ్యం: ఉ.7:11 నుంచి 8:44 వరకు అమృత ఘడియలు: సా.4:32 నుంచి 6:06 వరకు దుర్ముహూర్తం: ఉ.8:46 నుంచి 9:33 వరకు తిరిగి మ.12:37 నుంచి 1:22 వరకు రాహుకాలం: ఉ.10:30 నుంచి 12:00 వరకు సూర్యోదయం: ఉ.6:29; సూర్యాస్తమయం: సా.5:59. 

February 20, 2026 / 01:19 AM IST

పురుషుల్లో క్షీణిస్తున్న’Y’ క్రోమోజోమ్

వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల ‘Y’ క్రోమోజోమ్‌ను ఎక్కువగా నష్ట పోతున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులతోపాటు, తక్కువ ఆయుర్దాయంతో ముడిపడి ఉందట. 60 ఏళ్లు పైబడిన పురుషులలో ‘Y’ క్రోమోజోమ్ లోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆడవారితో పోలిస్తే మగవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఇది ఒక కారణం కావొచ్చని అంచనా వేశారు.

February 20, 2026 / 12:59 AM IST

సామెత- దాని అర్థం

సామెత: ‘ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాడట’ అర్థం: కొంత మంది తను చేయాల్సిన కనీస బాధ్యతలు చేయడం కూడా ఏదో ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటారు. భార్యను పోషించడం భర్త కనీస బాధ్యత. తను, తన సంసారం కాకుండా, లోకానికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తే అర్ధం ఉంది. కానీ, తన వాళ్ళకి పెట్టుకుని లోకాన్ని ఉద్దరించినట్లు మాట్లాడే వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ సామెత ఉపయోగిస్తారు.

February 20, 2026 / 12:58 AM IST

ఇవాళ నమాజ్ వేళలు

ఫిబ్రవరి 20: శుక్రవారం➢ ఫజర్: తెల్లవారుజామున 5:28 గంటలకు➢ సూర్యోదయం: ఉ.6:41 గంటలకు➢ దుహర్: మ.12:30 గంటలకు➢ అసర్: సా.3:51 గంటలకు➢ మఘ్రిబ్: సా.6:20 గంటలకు➢ ఇష: రా.7:33 గంటలకుగమనిక: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

February 20, 2026 / 12:39 AM IST

చాట్‌జీపీటీతో జతకలిసిన జియో హాట్‌స్టార్

చాట్‌జీపీటీ, జియోహాట్‌స్టార్ జతకలిశాయి. ఇకపై చాట్ జీపీటీలో వినోదాత్మక కంటెంట్ గురించి సెర్చ్ చేసే వారికి జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ లింక్‌లు కనిపించనున్నాయి. మరోవైపు జియోహాట్ స్టార్, ఓపెన్ ఏఐ కలిసి చాట్‌జీపీటీ పవర్డ్ వాయిస్ డిస్కవరీ ఫీచర్‌ను కూడా తీసుకువచ్చాయి. ఇది వ్యూయర్స్ అడిగిన దాన్ని బట్టి వినోదాత్మక కంటెంట్‌ను సజెస్ట్ చేయనుంది.

February 19, 2026 / 11:16 PM IST

B.Y నగర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

సిరిసిల్ల పట్టణం B.Y నగర్ లోని యశ్వసిన్ మండప్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశభక్తి, పరాక్రమం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

February 19, 2026 / 10:19 PM IST

OTTలోకి వచ్చేసిన కొత్త మూవీ

మలయాళ నటులు అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విషాక్ నాయర్ కలిసి నటించిన మూవీ ‘చథా పచ్చ’. FEB 13న రిలీజైన ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. WWE తరహా రెజ్లింగ్ క్లబ్‌ను స్థాపించే ముగ్గురు సోదరుల కథతో ఈ మూవీ దర్శకుడు అద్వైత్ నాయర్ తెరకెక్కించాడు.

February 19, 2026 / 10:56 AM IST

పత్తికొండలో కిసాన్ పథకం నమోదు కీలకం

KRNL: పత్తికొండ మండలంలో రైతు విశిష్ట సంఖ్య ఉంటేనే కిసాన్ పథకం వర్తిస్తుందని మండల వ్యవసాయ అధికారి వెంకట్రాముడు బుధవారం తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన 2,143 మంది రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించినట్లు చెప్పారు. నమోదు లేని రైతులు వెంటనే తమ గ్రామ రైతు సేవా కేంద్రాలను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు.

February 19, 2026 / 10:15 AM IST

రోడ్డు ప్రమాదం.. ఇరువురికి తీవ్ర గాయాలు

CTR: సోమల మండలం కందూరు, చౌడేపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు ఢీ కొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు చౌడేపల్లిగా స్థానికుల చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 19, 2026 / 10:05 AM IST

BREAKING: ప్రముఖ మీడియా సంస్థకు నోటీసులు

AP: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సాక్షి మీడియా సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తనకు వ్యతిరేకంగా, తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు రాశారని పేర్కొన్నారు. ఇందిరా టెలివిజన్ MD భారతీరెడ్డి, ఎడిటర్ బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్లకు లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పి.. నష్టపరిహారంగా రూ.కోటి చెల్లించాలని, ఆడబ్బును అమరావతి రైతులకు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

February 19, 2026 / 10:04 AM IST

యనమలకుదురు ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు

కృష్ణా: యనమలకుదురు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. 82 రోజుల కాలానికి హుండీ ఆదాయం మొత్తం రూ.23,40,500గా వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్. భవాని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, గ్రామస్థులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యనమలకుదురు శాఖ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

February 19, 2026 / 10:00 AM IST

వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాల ప్రవేశాలు

మహబూబ్ నగర్: గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో 6-10 తరగతుల్లో దరఖాస్తులను ఆహ్వానించారు అని ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7-10 తరగతుల్లో ఖాళీలు ఉన్నాయని, ఈ నెల 28లో https://tgms.telangana.gov.inలో దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఉంటుందని పేర్కొన్నారు.

February 19, 2026 / 09:59 AM IST