NLG: నల్గొండ జిల్లా గంధంవారిగూడెం SLBC గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మట్టిలో మాణిక్యాల్లా మెరిసిన ఈ విద్యార్థినులను ప్రిన్సిపల్ లలితా కుమారి, వడ్డేపల్లి నాగరాజు గురువారం ఘనంగా సన్మానించారు. పట్టుదలతో శ్రమిస్తే అద్భుతాలు సాధించవచ్చని వారు ఈ సందర్భంగా విద్యార్థులను కొనియాడారు.
BDK: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టపై ఎన్ కౌంటర్ జరిగినట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పష్టం చేశారు. దండకారణ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుబడి ఉన్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని, అధికారికంగా తామే వెల్లడిస్తామని తెలిపారు.
SDPT: జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 14వ వార్డులో నిండుకున్న డ్రైనేజీలను మున్సిపల్ ఛైర్ పర్సన్ దండి లక్ష్మి కొమరయ్య పారిశుద్ధ్య కార్మికులచే క్లీన్ చేస్తున్నారు. రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ప్రజలు చెత్త రోడ్లపై పారవేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. ఈ మేరకు కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
TPT: పెళ్లికూరు మండలంలోని ఈనెల 25న సమస్త గ్రామాల పరిధిలో విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదాలత్ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత న్యాయమూర్తి శ్రీనివాస అంజనేయమూర్తి, అధిక సభ్యులుగా జి. మధుకుమార్ పాండే తదితరులు పాల్గొంటారు. విద్యుత్ సంబంధిత సమస్యలు ఉన్న వినియోగదారులు తమ ఫిర్యాదులను సమర్పించి పరిష్కారం పొందవచ్చని తెలిపారు.
NZB: బోధన్ మండలం సాలురా ప్రధాన రహదారిపై నాగన్‌పల్లి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో బాధితులను ఆసుపత్రికి తరలించారు.
SRD: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనట్లు అధికారి గోవిందారం తెలిపారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ లింకులు పంపామని, వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపల్స్ వద్ద కూడా వీటిని తీసుకోవచ్చన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
MNCL: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో మంచిర్యాల నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై ప్రత్యేక దృష్టి సారించి రోడ్ల విస్తరణ చేపడతామని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా డివిజన్లలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరుస్తామని, శాశ్వత డంపింగ్ యార్డు ఏర్పాటుకు త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు.
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా ఆ ముఠాకు చెందిన వ్యక్తి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ అతన్ని బెదిరించినట్లు తెలుస్తోంది. US నంబర్ నుంచి వాయిస్ నోట్ పంపినట్లు సమాచారం. దీనిపై ముంబై పోలీసులు విచారణ చేపట్టి, US ఏజెన్సీల సాయంతో నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారని మీడియా వర్గాలు తెలిపాయి.
E.G: కొవ్వూరు నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు, వంతెనల మరమ్మత్తులకు తగిన చర్యలు తీసుకోవాలని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో రహదారులకు మరమ్మత్తులు చేయలేదని విమర్శించారు. రానున్న గోదావరి పుష్కరాల నాటికి ప్రభుత్వం రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.
ATP: తాడిపత్రిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి రోజు శుక్రవారం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముగింపు వేడుకల సందర్భంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి వారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారిని పుష్పాలు, విశేష ఆభరణాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.
AP: వైసీపీ నేతల ఆందోళనలతో శాసనమండలి వాయిదా పడింది. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీలు తిరుమల శ్రీవారి సొమ్మును లూఠీ చేశాయని ఆరోపిస్తూ ఇవాళ కూడా వైసీపీ నేతలు మండలిలో నినాదాలు చేశారు. ర్యాలీగా నినాదాలు, ప్లకార్డులతో వారు మండలిలోకి రావడాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ తప్పుబట్టారు. ‘వారికి దేవుడిపై నమ్మకం లేదు. బుద్ధుందా’ అంటూ ఫైరయ్యారు. ఈ క్రమంలో మండలి 10 నిమిషాల పాటు వాయిదా పడింది.
ASF: RSS, వనవాసి కళ్యాణ పరిషత్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన వాడపల్లి గరుడాచలం మృతి RSS, BJPకి తీరని లోటని MLA హరీష్ బాబు అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణం ఆదర్శనగర్‌లో గరుడాచలం అనారోగ్యంతో మృతి చెందారని తెలిసి ఆయన నివాసంలో పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
KMR: దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిపై అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను గురువారం సాయంత్రం అధికారులు కూల్చి వేశారు. ఓ నాయకుడు గ్రామంలో అక్రమ కట్టడాన్ని రాజకీయ పలుకుబడితో కట్టడంతో అధికారులు సైతం వెనుకంజ వేశారు.అయినప్పటికీ హైకో ర్టు అడ్వకేట్ ముందుకు వచ్చి పోలీసులు అధికారులతో కలిసి అక్రమ కట్టడాన్ని కూల్చివేయించారు.
CTR: కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి TTD నుంచి అందుతున్న వార్షిక నిర్వహణ గ్రాంట్‌ను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ. 50 లక్షలు అందుతుండగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని రూ. 1 కోటికి పెంచింది. TTD బోర్డు తీర్మానం మేరకు ఈ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతానికి తోడ్పాటు లభించనుంది.
SKLM: జిల్లాలో వచ్చే నెల 13 నుంచి 15 వరకు రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్లు టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి తెలిపారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతో క్రీడలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మండలాల నుంచి ఎక్కువ మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.