• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు సామాజిక న్యాయ దినోత్సవం

GNTR: నేడు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కోటా మాలాద్రి తెలిపారు. గుంటూరులోని మల్లయ్య లింగం భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృతమైందని, అసమానతలు పెరిగాయని విమర్శించారు.

February 20, 2026 / 09:01 AM IST

పెద్ద జట్లకు నెదర్లాండ్స్ విజ్ఞప్తి

ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పెద్ద జట్లకు నెదర్లాండ్స్, స్కాట్లాండ్ తరఫున డచ్ ప్లేయర్ బాస్ డెలీడ్ కీలక విజ్ఞప్తి చేశాడు. పెద్ద టీమ్స్ ICC టోర్నీల్లో మినహా తమ నెదర్లాండ్స్ లాంటి అసోసియేట్ జట్లతో ఆడట్లేదని.. ద్వైపాక్షిక సిరీసులు కుదరకుంటే వార్మప్ మ్యాచులైనా ఆడాలని కోరాడు. దీంతో తమ ఆట మెరుగవుతుందని, జూన్‌లో వన్డే WC క్వాలిఫైయింగ్ మ్యాచులు జరిగే వరకు తాము ఖాళీనే అని పేర్కొన్నాడు.

February 20, 2026 / 08:59 AM IST

గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

NDL: బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

February 20, 2026 / 08:56 AM IST

నాగసమందర్‌లో సీసీ కెమెరాల నిఘా

VKB: ధారూర మండల పరిధిలోని నాగసమందర్‌లో మరింత కట్టుదిట్టం చేస్తూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం ధారూర్ ఎస్సై సున్నం రాఘవేందర్ ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సర్పంచ్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ఎంతో దోహదపడతాయని తెలిపారు.

February 20, 2026 / 08:56 AM IST

OTTలోకి వచ్చేసిన ‘ఈషా’

హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘ఈషా’ మూవీ OTTలోకి వచ్చేసింది. గత ఏడాది DEC 25న విడుదలై ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ కేవలం ఓవర్సీస్‌లో రెంట్ పద్దతిలో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా తెలుగులో కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇక ఈ మూవీలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ కీలక పాత్రలు పోషించారు.

February 20, 2026 / 08:55 AM IST

రైతులకు ఏఈవో సూచన..!

MNCL: యూరియా బుకింగ్ యాప్‌లో రైతులు ఫోన్ నెంబర్‌ను లింక్ చేయించుకోవాలని జన్నారం మండలం కవ్వాల్ క్లస్టర్ అక్రమ్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు యూరియా బస్తాల కోసం ఇంకా యాప్‌లో ఫోన్ నెంబర్‌ను లింక్ చేయించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో వారికి యూరియా బస్తాలు అందే అవకాశాలు లేదని హెచ్చరించారు. దేవునిగూడెం రైతు వేదికకు రైతులు రావాలని సూచించారు.

February 20, 2026 / 08:55 AM IST

సెల్ టార్చ్ లైట్ వెలుగులో అంత్యక్రియలు

NLG: రూ. కోట్లు పెట్టి నిర్మించిన చిట్యాల పురపాలక వైకుంఠధామంలో సౌకర్యాల లేమి అద్దం పడుతోంది. గురువారం రాత్రి మునుగోటి వెంకన్న అనే వ్యక్తి అంత్యక్రియల సమయంలో కనీసం విద్యుత్ దీపాలు లేకపోవడంతో, సెల్‌ఫోన్ టార్చ్ లైట్ల సాయంతో కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. విద్యుత్ స్తంభాలు ఉన్నా దీపాలు అమర్చకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

February 20, 2026 / 08:49 AM IST

మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య

VZM: మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరంలో జరిగింది. వన్ టౌన్ ఎస్సై ఎస్సై అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన బెవర శ్రీనివాస్ (28) కూలీ పనులు చేస్తు జీవనం సాగించే వాడు. మద్యానికి బానిస కావడంతో ఆయన భార్య రేవతి మందలించింది.

February 20, 2026 / 08:48 AM IST

‘బిల్లులను విడుదల చేయాలి’

KNR:గంగాధర మండలంలో మాజీ సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని కోరుతూ గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో డి.రాముకు పలువురు మాజీ సర్పంచ్‌లు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు మాజీ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:48 AM IST

కారు బోల్తా ఘటనలో మహిళ మృతి

ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ మడేరు అనకట్ట సమీపంలో శుక్రవారం ఉదయం కారు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కొండపల్లి గ్రామానికి చెందని బీరబోయిన సీతారత్నం (30) మృతి చెందినట్లు జడ్డంగి PHC డా. నాగార్జున తెలిపారు. ఈ ప్రమాదంలో బీరబోయిన బాబూరావు, బీరబోయిన దమయంతి, లక్ష్మీ, వరప్రసాద్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

February 20, 2026 / 08:47 AM IST

అనంతపురంలో చీని ధరలకు రెక్కలు

ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.25 వేల ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు. మార్కెట్‌కు మొత్తం 462 టన్నుల దిగుమతి రాగా, నాణ్యతను బట్టి కనిష్ఠంగా రూ.8 వేలు, సరాసరిగా రూ.17 వేల ధర లభించినట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులతో పోలిస్తే ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు వ్యక్తం చేస్తున్నారు.

February 20, 2026 / 08:46 AM IST

పెద్ద చెరువు ప్రాంతంలో పక్షుల సందడి

MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ శివారులో ఉన్న పెద్ద చెరువు వద్ద పక్షులు కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఆ చెరువు వద్దకు పలు రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ఓరియంటల్ వైట్ ఇబ్బిస్, కామన్ కూట్ వంటి పక్షులు అక్కడకు చేరుకుంటున్నాయి. చెరువు ప్రాంతంలో ఆహారం, నీరు అందుబాటులో ఉండడంతో పక్షులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

February 20, 2026 / 08:45 AM IST

పెద్ద చెరువు ప్రాంతంలో పక్షుల సందడి

MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ శివారులో ఉన్న పెద్ద చెరువు వద్ద పక్షులు కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఆ చెరువు వద్దకు పలు రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ఓరియంటల్ వైట్ ఇబ్బిస్, కామన్ కూట్ వంటి పక్షులు అక్కడకు చేరుకుంటున్నాయి. చెరువు ప్రాంతంలో ఆహారం, నీరు అందుబాటులో ఉండడంతో పక్షులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

February 20, 2026 / 08:45 AM IST

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం

HYD: జలమండలి ప్రజలతో మమేకమయ్యేందుకు ‘బస్తీ బాట’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం శుక్రవారం నుంచి వారానికి నాలుగు రోజులు అమలులో ఉంటుంది. ఈ సందర్భంగా, ఎండీ నుంచి వార్డు మేనేజర్ల వరకు అధికారులు బస్తీలు, కాలనీల్లో ప్రత్యక్షంగా పర్యటించి నీరు, సీవరేజ్ సమస్యలను గుర్తించి, తక్షణ పరిష్కార చర్యలు చేపడతారు.

February 20, 2026 / 08:43 AM IST

‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు’

SRCL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని 14, 19వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 08:41 AM IST