• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పొలాల్లో గాలి మరలు.. పనులు వేగవంతం

KRNL: ఆస్పరి మండలం చిన్న హోతూరు గ్రామ పొలాల్లో గాలి మరల (ఫ్యాన్లు) పనులు ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మరలు నిర్మించేందుకు అన్ని అనుమతులు వచ్చినందుకు పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే కొన్ని గాలి మరలు పూర్తయ్యాయని, వ్యవసాయానికి అనుగుణంగా వాటిని నిర్మిస్తున్నామని కాంట్రాక్టర్ తెలిపారు.

February 20, 2026 / 11:46 AM IST

అసహ్యంగా మాట్లాడితే దాడులా?: అంబటి రాంబాబు

AP: అసహ్యంగా మాట్లాడితే కేసులు పెట్టాలి కానీ దాడులు చేస్తారా? అని కూటమి నేతలను వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. గ్రూపులుగా వచ్చి తన ఇంటిపై దాడి చేశారని, ఆ సమయంలో ఇంట్లో తన పిల్లలు, మనవళ్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే పారిపోండి అని చెప్పారని విమర్శించారు. ఇంటిపై దాడులు చేయడమే కాక అరెస్ట్ చేసి 18 రోజులు జెలులో పెట్టారని మండిపడ్డారు.

February 20, 2026 / 11:46 AM IST

నేడు హరీష్ రావు పాలకుర్తి మండల కేంద్రానికి రాక

JN: పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రానున్నారు. నూతన ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళా నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కోరారు.

February 20, 2026 / 11:45 AM IST

‘ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్లో నమోదు చేయాలి’

MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, విభాగాల్లోని ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్లో నమోదు చేయాలని GM ఎం.శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, బ్లడ్ గ్రూపు వంటి వివరాలు గనులు, విభాగాలపై సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. లేకపోతే వీరికి మెడికల్ రిఫరెన్స్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

February 20, 2026 / 11:45 AM IST

పారిశుద్ధ కార్మికులను సన్మానించిన కార్పొరేటర్

PDPL: రామగుండం మున్సిపల్ పరిధిలోని 45వ డివిజన్లో పారిశుధ్యంపై తగు చర్యలు తీసుకోవాలని 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయనను సంబంధిత డివిజన్ పరిశుద్ధ కార్మికులు మున్సిపల్ కార్మికులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని ఆయన సన్మానించి డివిజన్లో పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చూసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 11:45 AM IST

అరుదైన వారందరికీ పింఛన్లు రేషన్ కార్డులు మంజూరు

అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ సమన్వయకర్త పీలా గోవింద హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. శుక్రవారం ప్రజలు పార్టీ శ్రేణులకు పలు సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. అనారోగ్యానికి గురై చికిత్స తీసుకున్న వారికి CMRF చెక్కులు అందజేశారు.

February 20, 2026 / 11:44 AM IST

ధృవ్ విక్రమ్‌తో అనుపమ డేటింగ్?

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ డేటింగ్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ అవార్డు వేడుకలో వీరిద్దరూ దిగిన సెల్ఫీని ధ్రువ్ ఇన్‌స్టాలో షేర్ చేయగా, అనుపమ దానికి ‘లవ్ సింబల్’ జోడించి రీషేర్ చేయడం చర్చకు దారితీసింది. గతంలోనూ రాత్రివేళ ఫోన్ చేయాల్సి వస్తే ధ్రువ్‌కే చేస్తానని ఆమె అనడం విశేషం. వీరిద్దరూ కలిసి ‘బైసన్’ చిత్రంలో నటించారు.

February 20, 2026 / 11:44 AM IST

కబడ్డీ జట్టుకు కోచ్‌గా శ్రీకాంత్ రెడ్డి నియామకం

NZB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ నెల 19 నుంచి 23 వరకు నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన ప్రతిభా కనబరిచిన క్రీడాకారులు ఎంపిక చేసి పంపడం జరిగింది. ఈ జట్టుకు కోచ్‌గా శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ పాఠశాలలో PET గా నిర్వహిస్తున్నారు.

February 20, 2026 / 11:42 AM IST

దూబేపై క్రిస్ శ్రీకాంత్ ప్రశంసలు

నెదర్లాండ్స్‌పై శివమ్ దూబే తన అద్భుత ప్రదర్శన(66 రన్స్, 2 వికెట్లు)తో టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో IPLలో చూసినదాని కంటే దూబే ఆట చాలా అప్‌గ్రేడ్ అయిందంటూ క్రికెట్ దిగ్గజం క్రిస్ శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ధోనీ టిప్స్, మ్యాచులు లేనప్పుడు ఆట మెరుగుపర్చుకునేందుకు చేస్తున్న హోంవర్క్ అతనికి చాలా కలిసి వచ్చాయని పేర్కొన్నారు.

February 20, 2026 / 11:42 AM IST

పీఎన్ కాలనీలో తాగునీటి కులాయి నీరు వృధా..!

శ్రీకాకుళంలోని గుజరాతి పేట సమీపంలోని పురుషోత్తం నగర్ కాలనీలో తాగునీటి కుళాయి నుంచి నీరు వృథాగా పోతుంది. దీని మూత పాడవడంతో నీరు పైనుంచి ధారలా కారుతుంది. గత కొన్ని రోజులుగా నీరు ఇలాగే వృధాగా పోతుందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.

February 20, 2026 / 11:40 AM IST

BREAKING: అమీర్‌పేట్‌లో అగ్నిప్రమాదం

TG: అమీర్‌పేట్ మైత్రీవనంలోని ఓ అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్‌లో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పలువురు విద్యార్థులు ఈ మంటల్లో చిక్కుకోవడంతో అక్కడ ఉన్న యువకులు, పోలీసులు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 11:40 AM IST

‘రైతులు కార్మికులకు బకాయిలు చెల్లించాలి’

AKP: చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్.రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా రైతులు కార్మికులు బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం శాసనసభలో మాట్లాడుతూ.. పీపీపీ విధానంలో డిష్టలరీ, ఇథనాల్ ఉత్పత్తి చేసే విధంగా ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలన్నారు.

February 20, 2026 / 11:39 AM IST

చిన్నారిని ఢీకొన్న కారు.. పరిస్థితి విషమం

CTR: పుంగనూరు మండలం శాంతినగర్ సమీపంలో ఇవాళ ఉదయం రోడ్డు దాటుతున్న చిన్నారి (5)ని 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు గాయపడ్డ చిన్నారిని ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మదనపల్లె జిల్లా ఆసుపత్రి తరలించారు.

February 20, 2026 / 11:38 AM IST

ఐదో అంతస్తు నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

HYD: పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. కొంపల్లి సమీపంలోని ఓ భవన నిర్మాణ స్థలంలో ఐదో అంతస్తు నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. భవన నిర్మాణ పనుల కోసం తల్లితో కలిసి వచ్చిన బాలిక, బాల్కనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. తీవ్ర గాయాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

February 20, 2026 / 11:38 AM IST

తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే దంపతులు

PDPL: శ్రీ తిరుమల తిరుపతి స్వామి వారిని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కలు చెల్లించారు. దర్శనానంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

February 20, 2026 / 11:37 AM IST