SKLM: నరసన్నపేట పట్టణం తంబకాయ కూడలు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. తంబకాయ కూడలు వద్ద మలుపు ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడం వలన ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
ప్రకాశం: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గురువారం ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు పోలీసులు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల రక్షణార్థం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ ను ఉపయోగించి మహిళలు తమకు తామే రక్షణ కల్పించుకోవచ్చని పోలీసులు తెలిపారు. మహిళల స్మార్ట్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేయించి, దాని ఉపయోగాలను వారికి వివరించారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,000గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
TG: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ కీలక నేత జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత కొంత కాలంగా సొంత కాంగ్రెస్ పార్టీపైనే ఆయన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను పరీక్షల విభాగం అధికారి ఉదయభాస్కర్ విడుదల చేశారు. ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతాయన్నారు.
SRD: సిర్గాపూర్ పీఎం పాఠశాతకు చెందిన విద్యార్థులు ఎక్స్‌ప్లోజర్ విజిట్ ఇండస్ట్రియల్ టూర్‌కు వొకేషనల్ విద్యార్థులు 50 మంది శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ICT గూగుల్ మైక్రోసాఫ్ట్ గచ్చిబౌలి (బాయ్స్), బ్యూటీ అండ్ వెల్నెస్ అను హెర్బల్ ఇండస్ట్రీ సుల్తాన్పూర్ ( గర్ల్స్) లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించనున్నట్లు PD తెలిపారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి రూ.1,56,170కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.1,43,150 పలుకుతోంది. అటు వెండి ధరలో నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. కిలో వెండిధర రూ.2,70,000ల వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
SRPT: పెన్‌పహాడ్ మండలంలోని ధర్మాపురం గ్రామంలో శుక్రవారం వింత ఘటన చోటుచేసుకుంది. స్థానిక మధిరామక్క చెరువులో నీటి కుక్క కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఉదయాన్నే ఈ వింత జీవిని చూసిన యువకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వార్త వైరల్‌గా మారింది. సముద్రాల్లో ఉండే జంతువు తమ చెరువులో కనిపించడంతో జనం ఎగబడ్డారు.
T20 WCలో అభిషేక్ ఆడిన 3 మ్యాచుల్లోనూ డకౌట్ కావడం అటు జట్టును, ఇటు క్రికెట్ అభిమానులను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అతనికి కీలక సూచన చేశారు. తొలి బంతికి బౌండరీ కోసం కాకుండా సింగిల్‌కు ప్రయత్నించాలని, ప్రారంభంలో పరుగులు చేయకున్నా క్రీజులో నిలబడాలని సూచించారు. ఒక్కసారి స్థిరపడితే రన్స్ సునాయాసంగా పరుగులు వస్తాయని పేర్కొన్నారు.
ATP: గుత్తి రైల్వే జంక్షన్‌లో శుక్రవారం తెల్లవారుజామున కదులుతున్న రైలులో చోరీ జరిగింది. బెంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాద్‌కు చెందిన అరుణ అనే మహిళ ప్రయాణికురాలి 3 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్ళాడు. ఈ ఘటనపై బాధితురాలు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
NLG: చిట్యాల మండలం నేరడలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ వద్ద నిధులు లేవని అధికారులు చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులకు అండగా ఉంటామని బీజేపీ నేత శంకరాచారి పేర్కొనగా, ఇందిరమ్మ ఇళ్ల హామీపై బాధితులు అసహనం వ్యక్తం చేశారు.
AKP: నర్సీపట్నంలో ఈ నెల 24వ తేదీన రిషి డిగ్రీ కాలేజ్ వద్ద మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా మేనేజర్ గోవిందరావు తెలిపారు. 17 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల నిరుద్యోగులు పదో తరగతి, డిగ్రీ, పీజీ, ఐటిఐ డిప్లొమా చేసిన నిరుద్యోగులు హాజరు కావాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈవో రాజేశ్వర్ వెల్లడించారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 13 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.
భారీ విజయం అందుకున్న ‘సైయారా’ మూవీ దర్శకుడు మోహిత్ సూరితో రణ్‌బీర్ కపూర్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. మోహిత్ ఓ గ్యాంగ్‌స్టర్ మ్యూజికల్ లవ్‌స్టోరీని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో రణ్‌బీర్ హీరోగా నటించనుండగా.. ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్లు టాక్.
NRPT: ఊట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామ ప్రతినిధులు నారాయణపేట విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్ నవీన్‌ను కలిసారు. తక్కువ వోల్టేజ్, లూజ్ లైన్లు, కర్రలపై విద్యుత్ లైన్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్. నర్సిములు, భారతీయ కిసాన్ సంఘం నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.